chandrababu elected as tdlp leader టీడీఎల్పీ నేతగా చంద్రబాబు.. ఏకవాక్య తీర్మాణం..

Chandrababu was elected tdlp leader in andhra pradesh assembly

Telugu Desam Party, N. Chandrababu Naidu, Telugu Desam Legislature Party, Andhra Pradesh, TDLP Leader, CBN, Andhra Pradesh Assembly, CM YS Jagan, leader of the opposition, Chandrababu, Andhra Pradesh, Politics

Former Andhra Pradesh Chief Minister N Chandrababu Naidu had been elected as TDLP Leader of the Party, with a single word resolution.

టీడీఎల్పీ నేతగా చంద్రబాబు.. ఏకవాక్య తీర్మాణం..

Posted: 05/29/2019 12:04 PM IST
Chandrababu was elected tdlp leader in andhra pradesh assembly

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీలో ప్రతిపక్షపాత్ర వహించాల్సిన టీడీపీ పార్టీ శాసనసభా పక్షం నేత ఎన్నిక ఏకవాక్య తీర్మాణం ద్వారా జరిగింది. ఆ పార్టీ అధ్యక్షుడు మాజీ సీఎం చంద్రబాబునే ఆ పార్టీ శాసనసభ్యులు తమ టీడీఎల్పీ నేతగా ఎన్నికున్నారు. ఉండవల్లిలోని చంద్రబాబు నివాస గృహంలో జరిగిన టీడీపీ లెజిస్లేటివ్‌ పార్టీ సమావేశంలో పార్టీ ఎమ్మెల్యేలు చంద్రబాబే తమ నేత అని పునరుద్ఘాటిస్తూ.. ఏకవాక్య తీర్మానంతో చంద్రబాబును ఎన్నుకున్నారు.

సార్వత్రిక ఎన్నికల్లో ఘోర పరాజయం, 23 సీట్లకే టీడీపీ పరిమితం అయిన నేపథ్యంలో టీడీపీకి పూర్వ వైభవం తీసుకురావాలంటే చంద్రబాబే తమ పార్టీ పగ్గాలను అందుకోవాలని టీడీపీ ఎమ్మెల్యేలు వ్యాఖ్యానించినట్లు సమాచారం. అలాకానీ పక్షంలో టీడీపీ పార్టీ ఉనికికే ప్రమాదం వచ్చే అవకాశం వుందని కూడా వారు అభిప్రాయపడ్డారు. అయితే ఘోర పరాజయం నేపథ్యంలో టీడీఎల్పీ నేతగా చంద్రబాబు ఉండకపోవచ్చునన్న ఊహాగానాలు చెలరేగాయి. ఈ ఊహాగానాలకు నిన్ననే పార్టీ వర్గాలు తెరదించాయి. ఇక టీడీఎల్పీ సమావేశంలో సార్వత్రిక ఎన్నికల్లో పార్టీ ఓటమికి కారణాలు, భవిష్యత్తు కార్యాచరణపైనా చర్చించారు.

ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ.. తెలుగుదేశం పార్టీ ప్రజల మధ్య ఉందని, నేతలు ఎవరూ అధైర్యపడాల్సిన అవసరం లేదని అన్నారు. ప్రజల కోపం వల్ల టీడీపీ ఓటమి చెందలేదని, జగన్ పై ఉన్న సానుభూతే ఆ పార్టీని గెలిపించిందని బాబు వ్యాఖ్యానించారు. ఈ ఎన్నికల్లో ఓటమికి దారి తీసిన కారణాలు, పార్టీ భవిష్యత్‌ కార్యాచరణ, త్వరలో జరిగే శాసనసభ సమావేశాల్లో అనుసరించాల్సిన వైఖరి, స్థానిక సంస్థల ఎన్నికలకు సంసిద్ధత తదితర అంశాలపై ఈ సమావేశంలో చర్చిస్తున్నారు.

అలాగే జగన్‌ ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారోత్సవానికి వెళ్లాలా? వద్దా? అన్న అంశంపై శాసనసభాపక్ష సమావేశంలో చర్చించాక తుది నిర్ణయం తీసుకోనున్నట్టు పార్టీ వర్గాలు తెలిపాయి. కాగా, జగన్ ప్రమాణ స్వీకారం కార్యక్రమానికి తమ పార్టీ తరపున ఓ బృందాన్ని పంపాలని కూడా టీడీపీ నిర్ణయించినట్లు సమాచారం. పార్టీ తరపున జగన్ కు వారు లేఖ కూడా అందజేయనున్నారని తెలుస్తోంది. ఈ సమావేశానికి ఆ పార్టీ నుంచి ఎన్నికైన ఎమ్మెల్యేలు, ఎంపీలతో పాటు రాజ్యసభ సభ్యులు సుజనాచౌదరి, కనకమేడల రవీంద్రకుమార్‌, ఏపీ టీడీపీ అధ్యక్షుడు కిమిడి కళా వెంకట్రావ్‌, ఎమ్మెల్సీ యనమల రామకృష్ణుడు తదితరులు హాజరయ్యారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles