security beefed-up at Tedepalli YS Jagan House తాడెపల్లిలో భద్రత కట్టదిట్టం.. కొత్త సెక్యూరిటీ అధికారిగా జోషీ

Security beefed up at tedepalli ys jagan house joshi as new security officer

YSRCP, YS Jagan Mohan Reddy, Amarlapudi Joshi appointed as security officer, ys jagan new security officer, ys jagan house at tadepalli, ys jagan new convoy, Amarlapudi Joshi, Amaravati, Tadepalli, Andhra Pradesh, politics

The security has been tightened up at YS Jagan residence cum party office at Tadepalli. The AP Police Department has appointed Amarlapudi Joshi as the chief security officer to YS Jagan Mohan Reddy.

వైఎస్ జగన్ కు కొత్త కాన్వాయ్ సిద్దం.. సెక్యూరిటీ అధికారిగా జోషీ

Posted: 05/24/2019 01:30 PM IST
Security beefed up at tedepalli ys jagan house joshi as new security officer

రాష్ట్రంలో అఖండ విజయం సాధించి కొత్త ప్రభుత్వం ఏర్పాటు దిశగా వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అడుగులు వేస్తున్న నేపథ్యంలో ఆ పార్టీ అధినేత, ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టనున్న వై.ఎస్‌.జగన్మోహన్‌రెడ్డి భద్రత కోసం ఆంధ్రప్రదేశ్ పోలీసు శాఖ ప్రత్యేక అధికారులను నియమించింది. ఈనెల 30వ తేదీన జగన్‌ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్న విషయం తెలిసిందే. దీంతో ఆయన చీఫ్‌ సెక్యూరిటీ ఆఫీసర్ గా ప్రస్తుతం సీఎం సెక్యూరిటీ విభాగంలో విధులు నిర్వహిస్తున్న అమర్లపూడి జోషిని పోలీసు శాఖ నియమించింది. దీంతో జోషి చీఫ్‌ సెక్యూరిటీ ఆఫీసర్ గా శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు.

దీంతో పాటు జగన్ కోసం ప్రత్యేక కాన్వాయ్ ను కూడా సిద్దంచేశారు. గుంటూరు జిల్లా ఉండవల్లిలోని జగన్ నివాసం వద్ద భద్రతను పెంచిన పోలీసులు, ఆ ప్రాంతాన్నంతా మెటల్ డిటెక్టర్లు, డాగ్ స్క్వాడ్ తో తనిఖీలు చేశారు. స్థానిక ఇళ్లలోనూ సోదాలు జరిపారు. ఇక జగన్ కాన్వాయ్ నిమిత్తం ఓ బులెట్ ప్రూఫ్ వాహనం, మొబైల్ సిగ్నల్ జామర్, అంబులెన్స్, సెక్యూరిటీ సిబ్బంది వాహనాలను ఏర్పాటు చేశారు. మొత్తం ఆరు వాహనాల కాన్వాయ్ ని 'ఏపీ 18పీ 3418' నంబర్ తో అధికారులు కేటాయించారు. ఈ వాహనాలన్నీ ప్రస్తుతం జగన్ ఇంటి ముందే నిలిచివున్నాయి. ఇంటెలిజెన్స్ సెక్యూరిటీ వింగ్ (ఐఎస్ డబ్ల్యూ) రంగంలోకి దిగి, జగన్ భద్రతను స్వయంగా చేతుల్లోకి తీసుకుంది.

ఇక అటు గుంటూరులోని తాడెపల్లిలో కూడా పోలీసులు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు. తాడెపల్లిలోని జగన్ నివాసంతో పాటు ఆయా పరిసర ప్రాంతాలను పోలీసులు తమ అధీనంలోకి తీసుకున్నారు. జగన్ ఇంటికి దారితీసే రహదారిపై బారికేడ్లను ఏర్పాటు చేసి, ఆ రూట్ లో వాహనాల రాకపోకలపై ఆంక్షలను విధించారు. వైఎస్ జగన్ కాబోయే ముఖ్యమంత్రి కావడంతో, నిబంధనల మేరకు భద్రతను పెంచామని ఉన్నతాధికారులు అంటున్నారు. ఇదిలావుండగా, రాష్ట్ర ఉన్నతాధికారులు.. జగన్ తో సమావేశమై, రాష్ట్ర పరిస్థితులను వివరిస్తునున్నారు.

చీఫ్ సెక్రెటరీ ఎల్వీ సుబ్రహ్మణ్యం సహా పలువురు ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు పాల్గొననున్నారు. ఆపై వైసీపీ తరఫున గెలిచిన అభ్యర్థులతోనూ జగన్ సమావేశం కానున్నారు. ఇక తిరుమల తిరుపతి దేవస్థానం టీటీడీ ఈవో అనీల్ కుమార్ సింఘాల్ సహా డాలర్ శేషాద్రి కూడా జగన్ ను కలసి శుభాకాంక్షలను తెలిపారు. తిరుమలలో స్వామివారికి ప్రత్యేకంగా ధరింపజేసిన పూజా మాల, ప్రసాదాలను తీసుకుని వచ్చిన ఆయన, జగన్ కు వాటిని అందించారు. సింఘాల్ తో పాటు డాలర్ శేషాద్రి, మరికొందరు అధికారులు జగన్ ను కలిసిన వారిలో ఉన్నారు. సాధ్యమైనంత త్వరగా తాను స్వామివారిని దర్శించుకుంటానని ఈ సందర్భంగా జగన్ వారికి వెల్లడించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : YSRCP  YS Jagan Mohan Reddy  Amarlapudi Joshi  Amaravati  Tadepalli  Andhra Pradesh  politics  

Other Articles