Twitter users remove 'Chowkidar,' to follow the spirit ‘ఆ’ పదాన్ని తొలగించిన ప్రధాని, కేంద్రమంత్రులు

Twitter users remove chowkidar to follow the spirit

Twitter users remove Chowkidar, PM Narendra Modi, twitter, twitterities, chowkidar, union ministers, Narendra Modi, Amit Shah, Lok Sabha Elections 2019, National politics

Several Twitter users followed PM Narendra Modi's call to remove the prefix 'Chowkidar from their Twitter handles."The word 'Chowkidar' goes from my Twitter name but it remains an integral part of me. Urging you all to do the same too!" tweeted Modi.

‘ఆ’ పదాన్ని తొలగించిన ప్రధాని, కేంద్రమంత్రులు

Posted: 05/24/2019 11:47 AM IST
Twitter users remove chowkidar to follow the spirit

ప్రధాని నరేంద్రమోదీ నేతృత్వంలోని బీజేపీకి దేశప్రజలు బ్రహ్మరథం పట్టారు. 2014లో నరేంద్రమోడీ మానియా తీవ్రస్థాయిలో వుండటంతో ఆయనకు దాదాపుగా మూడు దశాబ్దాల తరువాత అంతటి భారీ మెజార్టీ లభించిందని రాజకీయ విశ్లేషకులు వ్యాఖ్యానించారు. కానీ ఆయన తీసుకున్న నిర్ణయాలపై దేశప్రజలు ఇబ్బందులు ఎదుర్కోన్నారంటూ ఇప్పుడు ఆయన ఛరిష్మా తగ్గిపోయిందని ఎవరెన్ని రకాలుగా ప్రచారం చేసినా.. ఆయన మానియా ఏ మాత్రం తగ్గలేదు సరికదా.. మరింత పెరిగిందని తాజా ఫలితాలు స్పష్టం చేస్తున్నాయి. బీజేపి పార్టీకి గతంలో కన్నా అధికంగా ఎంసీ స్థానాలు లభించడమే ఇందుకు నిదర్శనం.

ప్రజలు తమకు ఘన విజయం కట్టబెట్టడం పట్ల నరేంద్ర మోదీ హర్షం వ్యక్తం చేశారు. ఆ వెంటనే ట్విటర్‌లో తన పేరు నుంచి ‘చౌకీదార్’ పదాన్ని తొలగించుకోవడం గమనార్హం. 2019 లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో ప్రధాని మోదీ ఉపయోగించిన ‘చౌకీదార్’ అనే పదం బాగా పాపులర్ అయిన విషయం తెలిసిందే. తాను ఈ దేశాన్ని కాపాడే చౌకీదార్ (కాపలాదారుడు) అని మోదీ తన ప్రసంగాల్లో చెప్పుకుంటూ వచ్చారు. నరేంద్ర మోదీని అనుసరిస్తూ బీజేపీ మంత్రులు, నేతలు, మద్దతుదారులంతా తమ ట్విట్టర్ అకౌంట్ల పేర్ల ముందు ‘చౌకీదార్’ అని పదాన్ని జత చేసుకున్నారు.

అయితే.. లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధించిన వెంటనే మోదీ తన పేరు నుంచి చౌకీదార్ పదాన్ని తొలగించారు. దీనికి సంబంధించి ట్వీట్ కూడా చేశారు. ‘భారత ప్రజలందరూ చౌకీదార్లుగా మారి దేశానికి ఎంతో సేవ చేశారు. చౌకీదార్ నేడు అతి పెద్ద శక్తిగా అవతరించింది. రక్షణకు పర్యాయపదంగా నిలిచింది. కుల, మత కలహాలు, అవినీతి లాంటి దుష్టశక్తుల నుంచి దేశాన్ని కాపాడింది’ అంటూ మోదీ ట్వీట్ చేశారు. ఇక చౌకీదార్ స్పూర్తిని మరో స్థాయికి తీసుకెళ్లాల్సిన తరుణం వచ్చిందని మోదీ పేర్కొన్నారు.

‘ఈ స్పూర్తిని భారతదేశ పురోగతిలో ప్రతి క్షణం సజీవంగా ఉంచుదాం..’ అంటూ ఆయన పిలుపునిచ్చారు. ట్విటర్‌లో తన పేరు నుంచి చౌకీదార్ పదాన్ని తొలగిస్తున్నట్లు వెల్లడించారు. అయితే.. ఆ పదం ఎల్లప్పుడూ తన మదిలోనే ఉంటుందని చెప్పారు. ‘ట్విట్టర్ పేరు నుంచి చౌకీదార్ పదాన్ని తొలగిస్తున్నా.. కానీ, నా మనస్సులో అది ఎల్లప్పుడూ ఉంటుంది. మీ అందరిని కూడా అలాగే చేయాలని కోరుతున్నా’ అంటూ మోదీ మరో ట్విట్ చేశారు. మోదీ పిలుపు మేరకు పలువురు బీజేపీ నేతలు, పార్టీ అభిమానులు తమ ట్విట్టర్ ఖాతాలో పేర్ల నుంచి చౌకీదార్ అనే పదాన్ని తొలిగించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles