Banners stating AP CM YS Jagan appear in Amaravathi "ముఖ్యమంత్రి వైఎస్ జగన్.. అమరావతిలో బ్యానర్లు"

Banners stating ap cm ys jagan appear in amaravathi

andhra pradesh CM YS Jaganmohan Reddy Banners, AP CM Chandrababu, TDP president chandrababu, YSRCP Leaders, YSRCP leaders viajayawada banners, YSRCP leaders banners, chandrababu, TDP, YS Jagan, YSRCP, sensational satire, andhra pradesh, politics

Few hours left to know the mandate given by the voters of Andhra Pradesh, in this peak time few banners attract passers-by of amaravathi and vijayawada stating YSRCP president YS Jagan as chief minister of Andhra Pradesh.

"ముఖ్యమంత్రి వైఎస్ జగన్.. అమరావతిలో బ్యానర్లు"

Posted: 05/22/2019 04:06 PM IST
Banners stating ap cm ys jagan appear in amaravathi

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఎవరు ప్రమాణస్వీకారం చేస్తారు..? రాష్ట్ర ప్రజల తీర్పు ఎలా వుండనుంది.? అధికారం ఎవరికి అందించనున్నారు.? రాష్ట్ర ప్రజ సంక్షేమాన్ని కోరుకుంటున్నారా.? లేక అభివృద్ది మంత్రాన్ని పటించనున్నారా.? యువత, తొలిసారి ఓటర్లు ఎవరి పక్షాన నిలిచారు.? ప్రధాన పార్టీలే యువత ఓట్లను అకర్షించిందా.? లేక ప్రత్యామ్నాయాన్ని కోరుకుందా.?  రాష్ట్రంలో సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటవుతుందా.? లేక ఏకపక్ష విజయాన్నే అందించనున్నారా.? ఇంతకీ ఎవరిది పైచేయి..? ఎవరికి ఆంధ్రఓటరు జై కొట్టనున్నాడు అన్న వివరాలు మరికోన్ని గంటల్లో తేలిపోనున్నాయి.

ఈ క్రమంలో రాజకీయ పార్టీ నేతల్లో టెన్షన్ మాత్రం పెరిగిపోతుంది. అయితే పైకి మాత్రం తమేదే విజయమని.. తమ గెలుపు తధ్యమని చెబుతున్నా..  నిజానికి మాత్రం ధీమా వ్యక్తం చేస్తున్నా.. అందరిలోనూ టెన్షన్ మాత్రం నెలకొంది. ఈ క్రమంలో అభిమానులు మాత్రం తమ పార్టీదే విజయమని, తమ నాయకుడే ముఖ్యమంత్రి అవుతాడని గంటాపథంగా చెబుతున్నారు. దీంతో రాజకీయ పార్టీ అభిమానుల మధ్య కూడా ఘర్షణలు చోటుచేసుకుంటాయని భావించిన పోలీసులు ముందస్తు జాగ్రత్తచర్యల్లో భాగంగా కౌంటింగ్ కేంద్రాలు మొదలుకుని ప్రధాన కూడళ్ల వరకు రాష్ట్ర భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.

కాగా విజయవాడ, అందులోనూ రాజధాని అమరావతి ప్రాంతంలో ముఖ్యమంత్రి ఎవరు అవతారన్న విషయమై ఏర్పాటైన బ్యానర్లు, ఫెక్సీలు స్థానికులను ప్రధానంగా ఆకర్షిస్తున్నాయి. రాష్ట్ర ప్రజలు దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి సంక్షేమాలనే కోరుకుంటున్నారని.. ధీమా వ్యక్తం చేస్తున్న వైసీపీ అభిమానులు.. రాష్ట్రంలో అధికార మార్పిడి తప్పక చోటుచేసుకుంటుందని తేల్చిచెబుతున్నారు. ఇందులో భాగంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి.. అంటూ సంబోధిస్తూ.. ఆయనకు స్వాగత తొరణంగా బ్యానర్లను ఏర్పాటు చేశారు. ఇవి స్థానికులను అకర్షిస్తున్నాయి. అయితే గెలుపెవరిదన్నది రేపే తేలుతుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : chandrababu  TDP  YS Jagan  YSRCP  chief ministers  banners  amaravati  vijayawada  andhra pradesh  politics  

Other Articles