ISRO launches RISAT-2B satellite into space ఇస్రో ఖాతాలో మరో విజయం.. కక్ష్యలోకి భూపరిశీలన ఉపగ్రహం..

Pslv c46 takes off successfully with india s earth observation satellite

Isro, isro launch, isro launch today, PSLV-C46, RISAT-2B, earth observation satellite, Sriharikota, Satish Dhawan Space Centre, isro launch images, isro launch pics, isro launch video, PSLVC46 launch, RISAT2B launch

The Indian Space Research Organisation (ISRO) scripted history on Wednesday by successfully launching earth observation satellite RISAT-2B that would enhance the country's surveillance capabilities among others

కక్ష్యలోకి భూపరిశీలన ఉపగ్రహం.. భారత్ భద్రత మరింత కట్టుదిట్టం..

Posted: 05/22/2019 11:59 AM IST
Pslv c46 takes off successfully with india s earth observation satellite

భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో ఖాతాలో మరో ఘన విజయం చేరింది. పీఎస్ఎల్వీ సీ46 ద్వారా ఆధునిక రాడార్‌ ఇమేజింగ్‌ భూపరిశీలన ఉపగ్రహమైన రీశాట్‌-2బీఆర్‌1 ఉపగ్రహ ప్రయోగం సక్సెస్ అయ్యింది. నెల్లూరు జిల్లాలోని షార్ నుంచి పొలార్‌ శాటిలైట్‌ లాంచ్‌ వెహికల్ ‌-సీ46 నింగిలోకి దూసుకెళ్లింది. 615 కిలోల బరువు గల రీశాట్‌-2బీ ఉపగ్రహాన్ని పీఎస్‌ఎల్వీ-సీ46.. 557 కి.మీ ఎత్తులోని కక్షలో ప్రేవేశపెట్టింది. దీంతో పీఎస్‌ఎల్వీ-సీ46 ప్రయోగం సక్సెస్ అయ్యింది. రక్షణ, వ్యవసాయ రంగాలకు రీశాట్-2బీ ఉపగ్రహం సేవలు అందించనుంది.

అంతరిక్షంలోని నిర్ణత కక్ష్యలోకి చేరిన ఉపగ్రహం రీశాట్‌-2బీ కాలపరిమితి ఐదేళ్లు. ఈ ఉపగ్రహం రక్షణశాఖకు కీలకం. సరిహద్దుల్లో శత్రువుల కదలికలను ఈ ఉపగ్రహం ద్వారా సులువుగా గుర్తించొచ్చు. అలాగే వ్యవసాయం, అటవీ రంగాల సమాచారంతో పాటు ప్రకృతి విపత్తుల్లో ఈ ఉపగ్రహం సాయపడనుంది. ఈ ప్రయోగానికి సంబంధించి మంగళవారం (మే 21,2019) ఉదయం 4.30 గంటలకు కౌంట్ డౌన్ ప్రారంభమైంది. 25 గంటల కౌంట్‌డౌన్‌ తర్వాత బుధవారం (మే 22,209) ఉదయం 5.30 గంటలకు పీఎస్‌ఎల్‌వీ-సీ46 నింగిలోకి దూసుకెళ్లింది.

రాకెట్ బయలుదేరిన తర్వాత 15.29 నిమిషాలకు ఉపగ్రహం విడిపోయింది. మొదటగా 2009లో రీశాట్‌ను ఇస్రో ప్రయోగించింది. 2012లో రీశాట్‌-1ను ప్రయోగించింది. ఏడేళ్ల తర్వాత రీశాట్ సిరీస్ లో మరో ప్రయోగం చేసింది. పీఎస్ఎల్వీ ప్రయోగాల్లో ఇది 48వ ప్రయోగం. ప్రయోగం సక్సెస్ కావడంతో ఇస్రో శాస్త్రవేత్తలు ఆనందంలో మునిగిపోయారు. 2019లో ఇస్రో చేసిన ప్రయోగాల్లో ఇది మూడవది. 15 నిమిషాల్లో ప్రయోగం సక్సెస్ అయ్యింది.

రీశాట్-2బీ ప్రత్యేకతలు:

* విక్రమ్ ప్రాసెసర్
* సెమీ కండక్టర్ లేబొరేటరీ
* తక్కువ ధరతో తయారైన నేవిగేషన్ సిస్టమ్
* ఫ్యూచర్ లో అన్ని కంప్యూటర్లకు వర్క్ హార్స్ గా మారనున్న విక్రమ్ ప్రాసెసర్
* ఈ ప్రయోగంతో ఇస్రో రికార్డ్.. స్పేస్ లోకి 50 టన్నుల బరువుతో కూడిన 350 ఉపగ్రహాలు పంపింది.
* రీశాట్ సిరీస్ లో తొలి ప్రయోగం జరిగింది 2009, ఏప్రిల్ 20న. రీశాట్ -2 ని పంపిన ఇస్రో.
* 2012, ఏప్రిల్ 26న రీశాట్-1 ప్రయోగం

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : X-Band Radar  RISAT-2B  pslv-c46/risat-2b mission  pslv-c46  isro  

Other Articles