Heat Wave Conditions To Continue In Hyderabad నగరవాసులు మరో అలర్ట్.. మూడు రోజులు వడగాల్పులే..

Despite showers heat wave conditions to continue in hyderabad

India Meteorological Department, heat wave, weather-report, warning, summer, heatwave in Hyderabad, telangana

Despite thunderstorms and sudden downpour, the heatwave conditions are likely to prevail across the State till May 25, according to the IMD forecast. The temperatures will continue to soar during the day time with thunderstorms in the evenings.

నగరవాసులు మరో అలర్ట్.. మూడు రోజులు వడగాల్పులే..

Posted: 05/22/2019 11:28 AM IST
Despite showers heat wave conditions to continue in hyderabad

ప్రచండ భానుడి ఉగ్రరూపానికి నగరవాసులు బెంబేలెత్తిపోతున్నారు. నగరంలో సాధారణం కంటే అధిక ఉష్ణోగ్రతలు నమోదు కావడంతో నగరవాసులు ఇళ్ల నుంచి బయటకు రావాలంటేనే జంకుతున్నారు. ఓవైపు సాయంత్రం వేళల్లో వర్షాలు కురుస్తున్నా.. ఆ ప్రభావం మాత్రం ఉదయానికి కనిపించకుండాపోతుంది. ఈ క్రమంలో నగరవాసులకు మరో అలర్ట్ వుందని తాజాగా హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. రాగల మూడు రోజుల్లో రాష్ట్రంలో తీవ్ర మైన వడగాల్పులు వీచే అవకాశం ఉందని కొన్ని చోట్ల తేలికపాటి నుంచి  ఓ మోస్తరు వర్షాలు కూడా కురిసే అవకాశం ఉందని వారు వివరించారు.

రాష్ట్రంలో  ప్రస్తుత వేసవిలో ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా అప్రమత్తంగా ఉండి తాగునీటికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్‌కే జోషి  చెప్పారు.  తెలంగాణలో ఏప్రిల్‌లో 6 రోజులు, మే నెలలో 10 రోజులు వడగాలులు వీచాయని, కలెక్టర్లకు ఎప్పటికప్పుడు ముందస్తు ఆదేశాలిస్తూ, ప్రజలకు సమాచారం అందజేస్తూ, పరిస్థితులను సమీక్షిస్తున్నామని ఆయన అన్నారు. కేంద్ర కేబినెట్‌ కార్యదర్శి ప్రదీప్‌కుమార్‌ సిన్హా మంగళవారం ఢిల్లీ నుంచి అన్ని రాష్ట్రాల సీఎస్‌లతో  నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ లో సీఎస్ ఈ వివరాలు తెలిపారు.

వేసవి తీవ్రత, వడగాలులు, కరవు, భూగర్బజలాలు, విద్యుత్‌ సరఫరా, రిజర్వాయర్లలో నీటి నిల్వలు, మంచినీటి సరఫరా, రుతుపవనాల రాక, నీటి నిర్వహణ, డేటా సేకరణ తదితర అంశాలపై కేంద్ర కేబినెట్ కార్యదర్శి సమీక్షించారు. కాగా, మంగళవారం తెలంగాణలోని పలు ప్రాంతాల్లో నమోదైన ఉష్ణోగ్రతలు 45 డిగ్రీలకు పైగానే ఉండటం గమనార్హం. ఆదిలాబాద్ లో 45.4 ,నిజమాబాద్ 45.1, రామగుండంలో 44, మెదక్ 43.2,మహబూబ్ నగర్ లో 42.9, ఖమ్మం  42.6, భద్రాచలం లో 42.2, హన్మకొండ, హైదరాబాద్ లలో42,డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles