Ravi Prakash sold TV9 logo, TradeMark, Copyrights; case filed టీవీ9 లోగో, ట్రేడ్ మార్క్, కాఫీరైట్స్ అమ్మేసిన రవిప్రకాష్..

Another case filed against ravi prakash for selling tv9 logo trademark copyrights

Ravi Prakash, Shivaji, MKVN Murthy, Hari, MSN Murthy, vijayawada Advocate, data theft, fake shares purchase, national company law tribunal, Forgery Case, Cyberabad Cybercrime Police, Investigation, Evidences, Hyderabad, KCR, Telangana CM, Telangana, politics

The BanjaraHills Police registered criminal cases against TV9 former CEO V Ravi Prakash, CFO MVKN Murthy and Hari Kiran Chereddi under sections 467, 420, 409, 406 IPC and 120 (B) IPC alleging cheating, criminal breach of trust and causing wrongful loss to ABCL and it's shareholders.

టీవీ9 లోగో, ట్రేడ్ మార్క్, కాఫీరైట్స్ అమ్మేసిన రవిప్రకాష్..

Posted: 05/17/2019 01:25 PM IST
Another case filed against ravi prakash for selling tv9 logo trademark copyrights

సైబరాబాద్ పోలీసులు పెట్టిన పోర్జరీ, డాటా చోరి కేసులో తప్పించుకుని తిరుగుతున్న టీవీ9 మాజీ సీఈవో రవిప్రకాశ్‌ పై మరో కేసు నమోదైంది. నటుడు శివాజీతో కలసి ఏబిసీఎల్ సంస్థ నూతన యాజమాన్యాన్ని ఇబ్బంది పెట్టేందుకు చేసిన ఇరువురు చేసుకున్న లోగుట్టును తెలంగాణ సైబర్ క్రైమ్ పోలీసులు సేకరించి.. వెలుగులోకి తీసుకువచ్చిన నేపథ్యంలో ఆయనపై మరో కేసు కూడా నమోదు కావడం చర్చనీయాంశంగా మారింది. టీవీ9 సీఈవోగా ఆయన అధికార దుర్వినియోగానికి పాల్పడినట్టు సమాచారం.

తప్పుడు పత్రాలు సృష్టించి టీవీ9 చానల్ కాపీరైట్స్, టీవీ9 కంపెనీ రిజస్టర్ ట్రేడ్ మార్క్ ను టీవీ9 మాజీ డైరెక్టర్లు రవి ప్రకాష్, ఎంవీకేఎన్ మూర్తి, మీడియా ఎన్ఎక్స్ టీ ఇండియా ప్రైవేటు లిమిటెడ్ కు రూ. 99 వేలకు విక్రయించినట్లు ఏబీసీఎల్ మీడియా డైరెక్టర్ కౌశిక్ రావు బంజారాహిల్స్ పీఎస్ లో కంప్లయింట్ చేశారు. ఇందులో మోజ టీవీ ఎండీ హరికిరణ్ పాత్ర ఉందని.. ముగ్గురిపై కేసులు నమోదు చేయాలని కోరుతూ కౌశిక్ రావు బంజారాహిల్స్ పోలిస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. ఏబీసీఎల్ లో మెజార్టీ షేర్లను అలంద మీడియా కొనుగోలు చేసినట్లు.. ఈ నేపథ్యంలో టీవీ9 ప్రతిష్టను దెబ్బతీసి.. కంపెనీకి నష్టం తేవాలన్న ఉద్దేశ్యంతో రవి ప్రకాష్..ఎంవీకేఎన్ మూర్తిలు కుట్రకు తెరతీశారని ఫిర్యాదులో తెలిపారు.

కుట్రలో భాగంగా టీవీ9 పాత యాజమాన్యంలో డైరెక్టర్లుగా ఉన్న రవి ప్రకాష్, మూర్తి పాత తేదీలతో తప్పుడు అగ్రిమెంట్ సృ‌ష్టించి టీవీ 9 ఛానల్ కంపెనీ కాపీ రైట్స్, టీవీ - 9  కంపెనీ రిజిస్టర్ ట్రేడ్ మార్క్ తో పాటు మరికొన్ని ట్రేడ్ మార్క్ లను మీడియా ఏఎన్ఎక్స్ టి ఇండియా (మోజో టీవీ) ప్రైవేటు లిమిటెడ్‌కు రూ. 99 వేలకు బదిలీ చేసినట్లు.. 2018 డిసెంబర్ 31 తేదీతో ఒక లావాదేవీ సృష్టించారని పిర్యాదులో తెలిపారు. కంపెనీకి సంబంధించిన రికార్డులను పరిశీలిస్తే.. 2019 ఫిబ్రవరి 28న ఏబీసీఎల్, మీడియా ఏఎన్ఎక్స్ టి ఇండియా (మోజో టీవీ)కి మధ్య రూ. 99 వేలకు లావాదేవీ జరిగినట్టు వెల్లడించారు కౌశిక్. జనవరి 22న కొన్ని రిపేర్లు, మెయింటెనెన్స్ పనులు చేసినందుకు మీడియా ఏఎన్ఎక్స్ టి రూ. 99 వేలు చెల్లించినట్లు ఉందన్నారు. కౌశిక్ రావు ఫిర్యాదు మేరకు పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు బంజారాహిల్స్ పోలీసులు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles