cybercrime police collected key evidences against ravi prakash టీవీ9 కేసులో కీలక ఆధారాలు.. రవిప్రకాష్ చుట్టూ ఉచ్చు

Key evidences collected by cybercrime police against ravi prakash

Ravi Prakash, Shivaji, MKVN Murthy, Hari, MSN Murthy, vijayawada Advocate, data theft, fake shares purchase, national company law tribunal, Forgery Case, Cyberabad Cybercrime Police, Investigation, Evidences, Hyderabad, KCR, Telangana CM, Telangana, politics

The Cyberabad Cybercrime police who intensified their investigation in the forgery and cheating cases booked on TV 9 former CEO Ravi Prakash and actor Shivaji, has reportedly collected many key evidences in the case.

టీవీ9 కేసులో కీలక ఆధారాలు.. రవిప్రకాష్ చుట్టూ బిగుస్తున్న ఉచ్చు

Posted: 05/16/2019 12:57 PM IST
Key evidences collected by cybercrime police against ravi prakash

సైబరాబాద్ పోలీసులు పెట్టిన పోర్జరీ, డాటా చోరి కేసులో తప్పించుకుని తిరుగుతున్న టీవీ9 మాజీ సీఈవో రవిప్రకాశ్‌ చుట్టూ పోలీసులు ఉచ్చు బిగుసుకుపోతొంది. ఆయనతో పాటుగా ఈ కేసులో నటుడు శివాజీ చుట్టూ కూడా పోలీసులు ఉచ్చు బిగిస్తున్నారు. టీవీ9 వ్యవహరాంలో అత్యధిక వాటాదారైన అలందా మీడియాకు వ్యతిరేకంగా రవిప్రకాష్ పన్నిన కుట్ర కూపీని బయటకు లాగిన సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు ఈ కేసులో కీలక ఆధారాలను రాబట్టారు. ఈ వ్యవహారంలో రవిప్రకాశ్ కు సహకరించిన నటుడు శివాజీల కావాలనే కుట్రపూరితంగా టీవీ9 నూతన యాజమాన్యాన్ని ఇబ్బందులు పెట్టేందుకు ప్రయత్నించారని పోలీసులు అధారాలను సేకరించారు.

వీరిద్దరి మధ్య జరిగిన కొన్ని ఈ-మెయిల్ సంభాషణలకు సంబంధించిన వివరాలను సైబర్ క్రైమ్ పోలీసులు రాబట్టినట్లు తెలుస్తుంది. శివాజీ, రవిప్రకాశ్ ల మధ్య జరిగిన నకిలీ ఒప్పందం షేర్ పర్చేజ్ అగ్రిమెంట్ కు సంబంధించిన పూర్తి స్థాయి ఆధారాలను సైబర్ క్రైమ్ పోలీసులు సేకరించినట్టు చెబుతున్నారు. టీవీ 9 మాతృసంస్థ అసోసియేటెడ్ బ్రాడ్ కాస్టింగ్ కంపెనీ ప్రైవేట్ లిమిటెడ్ (ఏబిసీఎల్) అలందా మీడియా నేతృత్వంలో కొత్త యాజమాన్యానికి ఇబ్బందులు సృష్టించే ఉద్దేశంతో.. నకిలీ షేర్లను కొనుగోలు వ్యవహారాన్ని తెరపైకి తీసుకువచ్చి.. నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ (NCLT)ను అశ్రయించారని పోలీసులు అధారాలు సేకరించారు.

వీరిద్దరి మధ్య 40 వేల టీవీ9 షేర్లు కొనుగోలు ఒప్పందం ఈ ఏడాది ఏప్రిల్ 13న కుదరగా, వీరు గత ఏడాది ఫ్రిబవరి 20న ఒప్పందం కుదుర్చుకున్నట్లు పాత తేదీ ప్రకారమే ఒప్పందం చేసుకున్నామని వారు స్పష్టం చేస్తూ ఎన్సీఎల్టీలో కేసు వేశారు. అయితే వీరిద్దరి మధ్య జరిగిన ఈ మెయిల్స్ ఆధారంగా ఈ విషయాన్ని తెలుసుకున్న సైబర్ పోలీసులు.. ఎన్సీఎ్టీలో కేసు వేయడం కోసమే వీరిద్దరూ ఈ కుట్రకు తెరలేపారని కీలక అధారాలను సేకరించారు. దీంతో ఈ కేసులో కొత్త ట్విస్ట్ ఏర్పడింది.

ఈ కుట్రకు సంబంధించి శక్తి అనే వ్యక్తి నుంచి, డైరెక్టర్ ఎంకేవీఎన్‌ మూర్తి, రవిప్రకాశ్, రవిప్రకాశ్‌కు సన్నిహితుడైన హరి అనే వ్యక్తి, ఏబీసీఎల్ ఫైనాన్స్ అధికారిగా ఉన్న మూర్తి అనే మరో వ్యక్తి మధ్య బదిలీ అయిన పలు ఈ-మెయిళ్లను సైబర్ క్రైమ్ పోలీసు అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈ-మెయిల్స్ ఆధారాలు దొరకకుండా సర్వర్ల నుంచి రవిప్రకాశ్, ఆయన అనుచరులు డిలీట్ చేసినప్పటికీ, సైబర్ క్రైమ్ పోలీసులు అత్యాధునిక పరిజ్ఞానం ఉపయోగించి ఈ-మెయిళ్లను తెరచి వాటి అటాచ్ మెంట్లను కూడా డౌన్ లోడ్ చేయడంతో అసలు గుట్టు భయటపడింది.

ఇదిలావుండగా, తెలంగాణ పోలీసులు తమకోసం గాలిస్తున్నారన్న వార్త తెలియడంతో రవిప్రకాశ్ సహా నటుడు శివాజీలు తెలంగాణ నుంచి ఆంధ్రకు వెళ్లి అక్కడ ఆశ్రయం పోందుతున్నారు. వీరిద్దరూ విజయవాడ సమీపంలోనే ఉన్నారని హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు గుర్తించారు. తాము విచారణకు రావడానికి మరో 10 రోజుల సమయం కావాలని వీరిద్దరి నుంచి వచ్చిన ఈ-మెయిల్స్ ను విశ్లేషించిన పోలీసులు, ఐపీ అడ్రస్ లు విజయవాడ నుంచే వచ్చాయని గుర్తించినట్టు తెలిసింది. దీంతో వారి కోసం విజయవాడ పోలీసులకు సమాచారం ఇచ్చి, అక్కడికి ఓ బృందాన్ని పంపినట్టు సమాచారం.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles