BJP Leader shoots cousin for voting to Congress కాంగ్రెస్ కు ఓటేశారని కాల్పులు.. పరారీలో బీజేపి నేత

Bjp leader shoots his own cousin thrice for voting for congress

Haryana Jhajjar, Jhajjar elections, BJP Congress, Dharmendra Silani, Man shoots his own cousin, man shoot cousin for voting Congress, Raja Singh, BJP vote, Congress vote, Lok Sabha polls, India elections, Politics

In a bizarre incident, BJP mandal-level leader Dharmender Silani shot at his own cousin over casting vote in favour of Congress party in phase VI of Lok Sabha election in Haryana.

కాంగ్రెస్ కు ఓటేశారని కాల్పులు.. పరారీలో బీజేపి నేత

Posted: 05/15/2019 08:47 PM IST
Bjp leader shoots his own cousin thrice for voting for congress

అన్ని బందాల కంటే రక్త సంబంధమే గోప్పదని అంటుంటారు పెద్దలు. అయితే అన్ని బంధాలు అర్థికసంబంధాలే అంటూ మారుతున్న మనుషుల స్వభావంతో నిజాలను చాటిచెప్పారు మహాకవులు. కానీ ప్రస్తుతం ఈ ట్రెండు కూడా మారినట్లే వుంది. అన్ని బంధాలలో రాజకీయ అనుబంధాలే అంటూ కొత్త అర్థం చెప్పాడు హర్యానాలోని ఓ బీజేపి రాజకీయ నేత. అన్నదమ్ములం అన్న కనీస కనికరం కూడా లేకుండా తన తమ్ముడిపైనే కాల్పులుకు తెగబడి.. విషయం బయటకు రావడంతో పోలీసులకు చిక్కకుండా పరారయ్యాడు.

తన బాబాయ్ కుమారుడు కాంగ్రెస్ పార్టీకి ఓటెయ్యడాన్ని జీర్ణించుకోలేకపోయిన సదరు బీజేపీ నేత తుపాకితో అతడిపై మూడుసార్లు కాల్పులు జరిపాడు. హర్యానాలోని ఝాజర్‌లో జరిగిందీ ఘటన. ఈ నెల 12న జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా జరిగిన ఆరో విడత ఎన్నికల్లో బీజేపీ మండలస్థాయి నాయకుడైన ధర్మేంద్ర సిలానీ సొంత కజిన్ రాజా సింగ్ కాంగ్రెస్‌కు ఓటేశాడు. విషయం తెలిసిన సిలానీ అతడిపై మూడుసార్లు కాల్పులు జరిపాడు. రెండుసార్లు కాళ్లపైన, ఓసారి కడుపులోనూ కాల్చాడు.

సిలానీ కాల్పుల్లో తీవ్రంగా గాయపడి కుప్పకూలిన రాజా సింగ్‌ను వెంటనే ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం అతడి పరిస్థితి నిలకడగా ఉన్నట్టు పోలీసులు తెలిపారు. హత్యాయత్నం కేసు నమోదు చేసిన పోలీసులు పరారీలో ఉన్న సిలానీ కోసం గాలిస్తున్నారు. రాజా, అతడి కుటుంబ సభ్యులను బీజేపీకి ఓటేయాల్సిందిగా సిలానీ కోరాడని, అయితే వారు ప్రత్యర్థి పార్టీ అయిన కాంగ్రెస్‌కు ఓటేసిన విషయం తెలియడంతోనే ధర్మేంద్ర ఈ ఘాతుకానికి పాల్పడ్డాడని పోలీసులు తెలిపారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles

Today on Telugu Wishesh