EC orders end of campaigning in West Bengal పశ్చిమ బెంగాల్ లో ప్రచారానికి ఈసీ బ్రేక్.. 324 అస్త్రం ప్రయోగం

Ec invokes article 324 orders to end campaign in west bengal

EC invokes article 324, EC orders end of campaigning in West Bengal, EC article 324, 2019 general elections, Narendra Modi, amit shah, Mamata Banerjee, Election Commission, Election Commission of India, BJP, India, politics

Invoking Article 324 for the first time, the Election Commission on Wednesday ordered campaigning in nine West Bengal constituencies to end at 10 PM on Thursday night, a day before its scheduled deadline, in the wake of violence between BJP and TMC workers in Kolkata.

పశ్చిమ బెంగాల్ లో ప్రచారానికి ఈసీ బ్రేక్.. 324 అస్త్రం ప్రయోగం

Posted: 05/15/2019 07:54 PM IST
Ec invokes article 324 orders to end campaign in west bengal

పశ్చిమ బెంగాల్ లో క్రితం రోజున చోటుచేసుకున్న పరిణామాలపై కేంద్ర ఎన్నికల సంఘం బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించింది. స్వతంత్ర భారతీయ చరిత్రలో ఇదివరకెన్నడూ వినియోగించని అస్త్రాన్ని బయటపెట్టి.. ఎన్నికలంటే ఆశామాషీ కాదని.. రాజకీయ పార్టీలకు షాక్ ఇచ్చింది. ఈ నెల 14న పశ్చిమ బెంగాల్ లో బీజేపి జాతీయ అధ్యక్షుడు అమిత్ షా ర్యాలీలో చెలరేగిన హింసాత్మక ఘటనల నేపథ్యంలో అన్ని రాజకీయ పక్షాలకు చెంపపెట్టులాంటి నిర్ణయం తీసుకుంది. తొలిసారిగా అర్టికల్ 324ను ఎన్నికల సంఘం ప్రయోగించింది.

పశ్చిమ బెంగాల్ లో పైచేయి సాధించి తమ సత్తా చాటుకోవాలని ప్రయత్నిస్తున్న బీజేపీకి, అధికార తృణమూల్ కాంగ్రెస్ పార్టీలకు మధ్య ఆధిపత్య పోరు నేపథ్యంలో ఎన్నికల సంఘం ఈ నిర్ణయం తీసుకుంది. అమిత్ షా ర్యాలీ సందర్భంగా జరిగిన హింసాత్మక ఘటనలకు కారణం ఎవరన్నది పక్కన బెడితే.. అమాయక పార్టీ కార్యకర్తలు రక్తమోడటం సహేతుకం కాదని, ప్రాణనష్టం, అస్తినష్టం లేకుండా ఎన్నికలు సజావుగా సాగాలని నిర్ణయించిన ఈసీ.. అర్టికల్ 324ను ప్రయోగించింది. ఈ చట్టం మేరకు రేపు (గురువారం) రాత్రి పది గంటలకు బెంగాల్ లో ప్రచారానికి స్వస్తి చెప్పాలంటూ అన్ని రాజకీయ పక్షాలను ఆదేశించింది.

ఎన్నికల చరిత్రలోనే మొదటిసారిగా 324 అధికరణ చట్టాన్ని ప్రయోగించింది. ఎన్నికల సంబంధిత దుష్ప్రవర్తనను, అవాంఛనీయ ఘటనలను నివారించడానికి ఈ చట్టం ఉపయోగిస్తారు. కాగా, చివరి దశ పోలింగ్ ఈ నెల 19న జరుగనున్న నేపథ్యంలో 17వ తేదీ సాయంత్రం 5గంటల వరకు ప్రచారానికి సమయం వుంది. అయితే కోల్ కతాలో చోటుచేసుకున్న తీవ్ర ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో ఒకరోజు ముందుగానే ప్రచారానికి బ్రేకులు వేసింది ఈసీ. కేంద్ర, రాష్ట్ర అధికార పార్టీల మధ్య వున్న విభేదాలు.. అధిపత్య పోరు నేపథ్యంలో ఎలాంటి హింస చెలరేగకుండా ఈ నిర్ణయం తీసుకుంది ఈసి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Amit shah  Mamata Banerjee  Election Commission  EC article 324  BJP  India  politics  

Other Articles