TS Inter revaluation result 2019 postponed ఇంటర్ ఫలితాలతో పాటు అన్సర్ షీట్స్: బోర్డుకు హైకోర్టు అదేశం

Hyd hc directs telangana inter board to upload answer sheets on website

High Court, Globerena, students union protest inter board, students arrest intermIediate board, security intermiediate board, parents agitation intermiediate board, three level security at inter board, Telangana CM, KCR, Intermiediate results, KTR, interboard failure, Telangana, politics

The Hyderabad High Court issued a notice to Globarena Technologies Pvt Ltd while asking the Board of Intermediate Education (BIE) to upload the answer sheets of the 3,82,112 students with the marks granted on the board’s website by May 27 besides releasing the results.

ఇంటర్ ఫలితాలతో పాటు అన్సర్ షీట్స్: బోర్డుకు హైకోర్టు అదేశం

Posted: 05/15/2019 05:25 PM IST
Hyd hc directs telangana inter board to upload answer sheets on website

ఇంటర్ ఫలితాల్లో గందరగోళానికి కారణమైన గ్లోబరీనా సంస్థకు తెలంగాణ హైకోర్టు నోటీసులు జారీ చేసింది. ఫలితాల్లో నెలకొన్న పరిస్థితులపై హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. దీనిపై ఇవాళ విచారణ జరిపిన న్యాయస్థానం.. ఇంటర్ ఫలితాల విషయంలో అవకతవకలు జరిగాయని అందుకు పూర్తిగా కారణమైన గ్లోబరినా సంస్థకు పలు ఆదేశాలు జారీ చేసింది. ఈ నెల 27న ఇంటర్ ఫలితాలు ప్రకటించాలని ఇంటర్ బోర్డును అదేశించిన న్యాయస్థానం అదే రోజున జవాబు పత్రాలను కూడా విడుదల చేయాలని అదేశించింది.

ఫలితాల్లో ఫెయిల్ అయిన విద్యార్థుల రీ వేరిఫికేషన్, రీ కౌంటింగ్ పూర్తి చేశామని ఇంటర్ బోర్డు ఈ సందర్భంగా రాష్ట్రోన్నత న్యాయస్థానం దృష్టికి తీసుకువచ్చింది. మే 16వ తేదీన ఫలితాలను ప్రకటిస్తామని.. అందుకు సమ్మతించాలని కోరింది. కాగా, విద్యార్థులు సమాధాన పత్రాలను మే 27వ తేదీన అంతర్జాలంలో అందుబాటులో ఉంచుతామని బోర్డు తరపున న్యాయవాది న్యాయస్థానానికి తెలిపారు. అయితే ఫలితాలు, సమాధాన పత్రాలను ఒకేసారి ప్రకటించాలని ఇంటర్ బోర్డుకు రాష్ట్రోన్నత న్యాయస్థానం సూచించింది. తదుపరి విచారణను జూన్ 6కు వాయిదా వేస్తున్నట్లు వెల్లడించింది.

ఇటీవలే వెల్లడయిన ఫలితాలు తీవ్ర గందరగోళానికి దారి తీశాయి. మెరిట్ స్టూడెంట్స్ ఫెయిల్ కావడం..కొన్ని సబ్జెక్టుల్లో సున్నా మార్కులు రావడం..పరీక్షకు హాజరైనా..హాజరు కాలేదని..ఫెయిల్ అయినట్లు మెమెలో పేర్కొన్నారు. తీవ్రమనస్థాపానికి గురైన విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడ్డారు. దీనిపై రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు  భారీస్థాయిలో ఆందోళన చేపట్టాయి. చివరకు సీఎం కేసీఆర్ రంగ ప్రవేశం చేసి పలు ఆదేశాలు, సూచనలు చేశారు. అయితే.. ఇంటర్ ఫలితాలు తప్పుల తడక ఫలితాలతో కలత చెందిన పలువరు విద్యార్థులు బలవన్మరణాలకు పాల్పడిన క్రమంలో బాలల హక్కుల సంఘం న్యాయస్థానాన్ని అశ్రయించి పిటీషన్ దాఖలు చేయడంతో హైకోర్టు విచారణ చేపడుతోంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles