police searches on for Ravi Prakash ఎక్కడున్నావయ్యా ఓ రవిప్రకాషా..? గాలిస్తున్న పోలీసులు

Madhapur cyber crime police searching for tv9 former ceo ravi prakash

Ravi Prakash revomed as TV9 CEO, case filed on Ravi Prakash, forgery case on Ravi Prakash, Ravi Prakash, Alanda Media company, Kaushik Rao, forgery case, Cyber crime Police, former TV9 CEO, ABCL, ABCL, cybercrime cops, Telangana, Andhra Pradesh, Politics

Based on Alanda Media company secretary Kaushik Rao filed a forgery case and Data theft case cyber crime police had issued notices to TV9 former CEO Ravi Prakash, stating him to be present before him. But denying the police notices the journo absconded, now police are in search of him.

టీవీ9 వివాదం: ఎక్కడున్నావయ్యా ఓ రవిప్రకాషా..? గాలిస్తున్న పోలీసులు

Posted: 05/15/2019 12:19 PM IST
Madhapur cyber crime police searching for tv9 former ceo ravi prakash

టీవీ9 మాజీ సీఈవో రవిప్రకాష్ చట్టానికి అతీతుడా.? చట్టాలు, న్యాయం గురించి గత రెండు దశాబ్దాలుగా టీవీ తెరపై కనిపించి ఊకదంపుడు ఉపన్యాసాలు ఇచ్చిన ఆయన.. రాజకీయా నాయకులు, పారిశ్రామిక వేత్తలు, పౌరులు తప్పులు చేస్తే.. వారిపై తనదైన శైలిలో, కాయితాలపై వున్న స్రిప్టులోంచి పదాలను మరింత ఘాటు పదాలను వినియోగించి తన వాగ్ధాటితో టీవీ చూస్తున్న వీక్షకులకు సదరు వ్యక్తులపై హేయభావం కలిగేలా వ్యాఖ్యానాలు చేసే పాత్రికేయుడు.. తన దాకా వస్తే మాత్రం చట్టానికి దూరంగా ఎందుకు వెళ్తున్నారన్నది అర్థం కాని ప్రశ్న.

తన సంతకాన్ని ఫోర్జరీ చేశారని కంపెనీ సెక్రటరీ కౌశిక్ రావు.. రవిప్రకాష్ పై ఫిర్యాదు చేయడం.. ఆ తరువాత కంపెనీకి చెందిన డేటాను ఆయన తస్కరించారని మరో కేసు కూడా ఆయనపై నమోదైన నేపథ్యంలో కేసు నమోదు చేసిన పోలీసులు రవిప్రకాష్ కు నోటీసులు జారీ చేశారు. తమ ఎదుట హాజరుకావాలని అందులో పేర్కోన్నారు. అయితే పోలీసులు నోటీసులు జారీ చేసిన ఈ నెల 9న ఆయన టీవీ9 ఛానెల్ లో ప్రత్యక్షమయ్యారు. తనపై వస్తున్న వార్తలన్నీ సత్యదూరమని, తనపై అంత ఆసక్తిని కనబర్చిన మీడియాకు ధన్యవాదాలని కూడా చెప్పారు. అయితే పోలీసుల ఎదుట మాత్రం హాజరుకాలేదు.

ఈ కేసులో సీఆర్పీఎఫ్ సెక్షన్ 160 కింద రెండు సార్లు నోటీసులు ఇచ్చిన సైబరాబాద్ కమిషనరేట్ అధికారులు, రవిప్రకాశ్ నుంచి స్పందన లేకపోవడంతో, సెక్షన్ 41 కింద నోటీసులు జారీ చేస్తూ, 15వ తేదీ 11 గంటల్లోగా విచారణకు రావాలని ఆదేశించారు. ఇక ఈ గడువు కూడా నేటితో ముగియనుండగా, ఏం చేయాలన్న విషయమై ఆలోచిస్తున్న అధికారులు, అరెస్ట్ వారెంట్ ను జారీ చేసి, లుక్ అవుట్ నోటీసులు కూడా ఇవ్వాలని భావిస్తున్నారు. ఇదే సమయంలో రవిప్రకాశ్ ఆచూకీని తెలుసుకునేందుకు ప్రత్యేక బృందాలను కూడా రంగంలోకి దింపారు.

ఇక రవిప్రకాశ్ ప్రస్తుతం ముంబైలో ఉన్నారని, హైదరాబాద్ లోని ఫ్రెండ్స్ వద్ద తలదాచుకున్నారని పలు రకాల వార్తలు వస్తున్నాయి. ఆయన సెల్ ఫోన్ స్విచ్చాఫ్ కావడం, సోషల్ మీడియా ఖాతాల్లో అప్ డేట్ లేకపోవడంతో రవిప్రకాశ్ ఆచూకీపై స్పష్టత లేదు. అయితే ఎదుటి వాళ్ల విషయంలో మాత్రం చట్టం, న్యాయం, అంటూ చెప్పే పాత్రికేయుడు తన దాకా వస్తే మాత్రం ఇలా అడ్రస్ తెలియకుండా తప్పించుకుని తిరగడమేంటని పలువురు విమర్శిస్తున్నారు. అయితే రేపు ఈ నెల 16న నేషనల్ కంపెనీ లా ట్రిబ్యూనల్ లో తీర్పు వున్నందున అప్పటి వరకు తాను బయట వుంటేనే ట్రిబ్యూనల్ అదేశాలను తెలుసుకున్న తరువాత న్యాయపోరాటానికి రవిప్రకాష్ సిద్దమవుతున్నారని కూడా వార్తలు వినిపిస్తున్నాయి.

ఇక తాను అచూకీని కనిపెట్టేందుకు పోలీసులు రెడీ అవుతున్నారన్న నేపథ్యంలో రవిప్రకాష్ తెలంగాణ హైకోర్టులో నేటి ఉదయం ముందస్తు బెయిల్ కు దరఖాస్తు చేసుకోగా,  దాన్ని తిరస్కరిస్తున్నట్టు న్యాయమూర్తి ప్రకటించారు.  ఈ నేపథ్యంలో నేడు ఆయన తరఫున హైకోర్టుకు హాజరైన న్యాయవాది ముందస్తు బెయిల్ ను ఇవ్వాలని కోరుతూ పిటిషన్ దాఖలు చేశారు. తన క్లయింట్ పోలీసుల విచారణకు సహకరిస్తారని, ఆయన సంఘంలో పేరున్న వ్యక్తని, బెయిల్ ఇవ్వాలని కోరగా, ధర్మాసనం తిరస్కరించింది. వెంటనే పోలీసుల ఎదుట హాజరు కావాలని సూచించింది. మరి ఇప్పటికైనా పోలీసుల ఎదుట హాజరవుతారో లేదో వేచి చూడాల్సిందే.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles