WhatsApp wants users to upgrade app urgently వాట్సప్‌కు వైరస్.. తక్షణం అప్ డేట్ చేయండీ..

Whatsapp voice calls used to inject israeli spyware on phones

corporate dossier, whatsapp update, WhatsApp, APP, Spyware, israeli cyber intelligence, NSO Group

WhatsApp has urged its 1.5 billion users to upgrade the app after the Facebook-owned platform discovered a vulnerability that allowed a spyware to be installed on users' phones via the app's phone call function.

వాట్సప్‌కు వైరస్.. తక్షణం అప్ డేట్ చేయండీ..

Posted: 05/14/2019 08:28 PM IST
Whatsapp voice calls used to inject israeli spyware on phones

వాట్సాప్‌ యాప్.. ప్రపంచ ప్రఖ్యాత మొబైల్ మెసేజింగ్‌ యాప్‌. వందలకోట్ల మంది వాడుతున్న నెట్ వర్క్.  ఒక రకంగా చెప్పాలంటే మొబైల్ ఫోన్ వినియోగదారులు ఎస్సెమ్మెస్ సర్వీస్‌ని మర్చిపోయేలా చేసిన యాప్. అలాంటి వాట్సాప్ యాప్ వైరస్‌ బారిన పడిందని ఆ కంపెనీ ఓ ప్రకటనలో పేర్కొని యూజర్లకు షాకిచ్చింది. వాట్సాప్‌ కమ్యూనికేషన్‌ ప్రోగ్రామ్‌ ద్వారా ఓ స్పైవేర్ కొన్ని మొబైల్‌ ఫోన్లలోకి ప్రవేశించిందని వాట్సాప్ కంపెనీ వర్గాలు వెల్లడించాయి.

ఈ స్పైవెర్‌ను ఇజ్రాయెల్‌కు చెందిన ఎన్‌ఎస్‌వో గ్రూప్‌ అనే సైబర్‌ యాక్టర్‌ రూపొందించినట్లు తెలిపింది. వాట్సాప్‌ సెక్యూరిటీ వ్యవస్థలో తలెత్తిన లోపం కారణంగా ఈ స్పైవెర్ వచ్చిందని, ఈ లోపాన్ని ప్రస్తుతం సరిచేసినట్లు వాట్సాప్ కంపెనీ వెల్లడించింది. వాట్సాప్‌ వాయిస్‌ కాలింగ్‌‌లో వచ్చే మిస్డ్‌ కాల్స్‌తో ఈ స్పైవెర్ ఫోన్లలోకి ప్రవేశించినట్లు కంపెనీ ప్రతినిధులు పేర్కొన్నారు. మే మొదటివారంలోనే ఈ స్పైవెర్‌ను గుర్తించినట్లు తెలిపారు.

‘వాయిస్‌ కాలింగ్‌కు అదనపు భద్రతా ఫీచర్లను జోడిస్తున్న తరుణంలో మా బృందం ఈ లోపాన్ని గుర్తించింది. వాట్సాప్‌లోని ఈ లోపాన్ని అదనుగా చేసుకుని స్పైవెర్ యూజర్లపై దాడి చేసింది. యూజర్లకు గుర్తు తెలియని నంబరు నుంచి ఒకటి లేదా రెండు వాట్సాప్‌ వాయిస్‌ కాల్స్‌ వచ్చి ఉంటాయి. కాల్‌ చేసే సమయంలోనే స్పైవేర్ కోడ్‌ ఫోన్లోకి ప్రవేశించిందని’ వాట్సాప్‌ ప్రతినిధి ఒకరు వెల్లడించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : corporate dossier  whatsapp update  WhatsApp  APP  Spyware  israeli cyber intelligence  NSO Group  

Other Articles