Swaziland Men Ordered To Marry More Than Two Wives రాజాజ్ఞ తూచ్: ఇద్దర్ని కన్యల పెళ్లాడాలన్న అదేశాలు ఇవ్వలేదు

Swaziland king mswati denies ordering men to marry more wives

‘Marry more wives or face jail,’ Zambia newspapers, King Mswati III, Swaziland, wives, King Mswati, spokesperson, Percy Simelane, latest news, nigeria news, viral on net, social media, viral news

King Mswati of Swaziland has denied ordering the men in his country to marry more than one wife or face imprisonment. According to a statement issued by the government the government said the issue was never discussed.

రాజాజ్ఞ తూచ్: ఇద్దర్ని కన్యల పెళ్లాడాలన్న అదేశాలు ఇవ్వలేదు

Posted: 05/14/2019 06:53 PM IST
Swaziland king mswati denies ordering men to marry more wives

దేశంలోని ఈడుకొచ్చిన ప్రతి మగవాడూ కనీసం ఇద్దరు ఆడవాళ్లను పెళ్లి చేసుకోని పక్షంలో రాజాజ్ఞ ధిక్కారం కింద జైలు శిక్ష అనుభవించాల్సిందేనని స్వాజిలాండ్ రాజు మూడో మెస్వాతి అదేశాలు జారీ చేశారన్న వార్త ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. అయ్యో ఎంత అన్యాయం జరిగింది.. ఆ దేశంలో పుట్టింటే పోయేది.. ఇక్కడ పుట్టామని కొందరు మగారాయుళ్లను బాధపడేలా చేసిందీ వార్త. అంతేకాదు నీకేంటి బాసు రాజువి.. మా సంగతేంటి.. ఇక్కడ ఒక పెళ్లాంతోనే వేగలేకపోతున్నాం.. మరీ మీరు ఇద్దరు ఆపై అంటూ అదేశాలిస్తే.. మీ దేశంలో వున్న మగాళ్ల సంఖ్య మరింతగా కూడా తగ్గిపోతుందన్న కామెంట్లు కూడా ఈ వైరల్ న్యూస్ తో పాటు వైరల్ అవుతున్నాయి.

ఇక ఆడవాళ్లంటే అంత అలుసుగా వుందా.? అంటూ మహిళా సంఘాలు కూడా రాజుకు వ్యతిరేకంగా ఉద్యమించేందుకు సన్నాహలు చేస్తున్నాయి. కానీ అసలు విషయం తెలిస్తే.. మీ ఆశలు, బాధలు, ధర్నాలు అన్నింటినీ నిలిపేస్తారు. ఈ వార్తను ప్రచురించిన జాంబియా దినపత్రికలను తమ ప్రభుత్వం కానీ, రాజుగానీ ఈ మేరకు అదేశాలు జారీ చేశారా.? చేస్తే చూపించగలరా.? అంటూ సవాల్ విసిరింది. జాంబియా అబ్జర్వర్ అనే దినపత్రిక తప్పుడు కథనాన్ని ప్రచురించిందని పేర్కోన్నారు.

ఆ పత్రిక తప్పుడు వార్తకథనంతో ఈ వార్త ప్రపంచవ్యాప్తంగా సంచలనంగా మారిందని అ దేశ ప్రభుత్వ అధికార ప్రతినిధి పెర్సీ సిమ్ లేన్ ఓ పత్రికా ప్రకటనను విడుదల చేశారు. జాంబియా అబ్జర్వర్ పత్రిక ప్రతినిధికి తమకు ఈ అంశంపై అసలు చర్చే జరగలేదని ఆ ప్రకటనలో పేర్కోన్నారు. తాము ఇలాంటి అదేశాలు ఇచ్చినట్టు జారీ చేసినట్లు, అందుకు డెడ్ లైన్ విధించినట్లు ప్రతిక అధారాలతో నిరూపించాలని ప్రభుత్వం అదేశించినట్లు ప్రకటనలో పేర్కోన్నారు. అసలు ఇంతకీ ఈ తప్పుడు వార్త కథనం విశేషమేమిటీ.? వివరాలేంటి అంటే..

ఆఫ్రికాలోని స్వాజిలాండ్ కు చెందిన రాజు మెస్వాతి-3 విచిత్రమైన ఆదేశాలు జారీచేశారని.. దేశంలోని మేజర్ అయిన ప్రతీ పౌరుడు కనీసం ఇద్దరు లేదా అంతకంటే ఎక్కువ మంది మహిళలను పెళ్లి చేసుకోవాలని ఆదేశించారని అన్నారు. ఇందుకు 2019, జూన్ నెలను తుది గడువుగా నిర్ణయించారు. అంతకంటే ఎక్కువ మందినిగాని పెళ్లిచేసుకోవాల్సిందేనని అదేశించారని, ఒక వేళ ఏ మగవాడైనా ఐదుగురు అమ్మాయిలను వివాహమాడితే అతనికి ప్రభుత్వమే ఇళ్లు కట్టిస్తుందని కూడా ఆఫర్ ఇచ్చాడని కథనం రాసింది జాంబియా అబ్జర్వర్. 2019 జూన్ నాటికి ఇద్దరితో కాపురం చేయ్యకుండా కనిపిస్తే మైనారిటీ తీరిన మగవాళ్లకు యావజ్జీవ ఖైదు విధించి జైల్లో తోసిపారేస్తారని కూడా హెచ్చరించారని కథనం సారంశం.

ఇందుకు కారణం ఏంటంటే..

స్వాజిలాండ్ లో ఆడవాళ్ల సంఖ్య గణనీయంగా వుండటం.. యువకుల సంఖ్య తక్కువగా వుండటమే కారణమట. చాలామంది అతివలకు పెళ్లి కావడం లేదు. అందుకే దీన్ని ల్యాండ్ ఆఫర్ వర్జిన్స్ అని కూడా అంటున్నారు. దేశంలో పెళ్లీడు వయసున్న మగాఆడల్లో ఆడవాళ్ల సంఖ్యే ఎక్కువ అట. దేశ జనాభాలో ఆడవాళ్లు 52 శాతం. అయితే అది పాతలెక్క అని, ప్రస్తుతం 55 శాతం చేరుకుందని అంటున్నారు. ఆడపిల్లలకు పెళ్లిళ్లు కాకపోతే చాలా సమస్యలు వస్తాయని రాజు ఆలోచించి రెండు పెళ్లిళ్ల మంత్రం వేశాడని కథనంలో పేర్కోంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles