AP Cabinet meeting held at state secretariat ముగిసిన క్యాబినెట్ భేటి.. సీఎం, సీఎస్ ల మధ్య నవ్వులు

Cabinet meeting held at state secretariat in andhra pradesh

Ap Cabinet Meeting, Chief secretary, Andhra Pradesh, Nara Chandrababu Naidu, Subrahmanyam, CM Chandrababu, somireddy chandramohan reddy, fani cyclone, guarantee work, water scarcity, Andhra Pradesh, Politics

AP CM Chandrababu held a cabinet meeting at the state secretariat to discuss various issues including the relief measures in cyclone Fani-affected areas, scarcity of drinking water, effect of climatic changes, status of employment including NREGS in the state.

ముగిసిన క్యాబినెట్ భేటి.. సీఎం, సీఎస్ ల మధ్య నవ్వులు

Posted: 05/14/2019 05:52 PM IST
Cabinet meeting held at state secretariat in andhra pradesh

అమరావతిలో నిర్వహించిన ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ సమావేశం ముగిసింది. అయితే ఈ సమావేశంలో ఎలాంటి నిర్ణయాలను బయటకు వెల్లడించాడానికి వీళ్లులేదని.. ఏ నిర్ణయమైనా ఈసీ అదేశాలతోనే వెల్లడించాలన్న అంక్షలు వున్నాయి. ఇదిలావుంటూ.. ఎన్నికల ముగిసిన తరువాత ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యంపై ముఖ్యమంత్రి పలు వ్యతిరేక వ్యాఖ్యలు చేశారు. అలాంటి పరిణామాల మధ్య క్యాబినెట్ భేటి పెట్టినా సీఎస్ రారా.? అంటూ మంత్రివర్గ సమావేశానికి ఆయన ఒకరకంగా సీఎస్ పై అగ్రహంతోనే ఏర్పాటు చేశారు. అయితే భేటీ సందర్భంగా వీరిద్దరూ నవ్వుతూ మాట్లాడుకోవడం కనిపించడం సహృధ్భావ వాతావరణంలోనే భేటీ జరిగిందన్న వార్తులు వినిపిస్తున్నాయి.,

దీనికి తోడు ఫొని తుఫాన్ సమయంలో సీఎస్ ఎల్వీ సుబ్రహ్మణ్యం పనితీరుపై చంద్రబాబు హర్షం వ్యక్తం చేశారు. ఫొని తుఫాన్ సమయంలో సీఎస్ అద్భుతంగా పనిచేశారంటూ సీఎస్‌ను చంద్రబాబు అభినందించడం కూడా కొసమెరుపు. రెండు గంటల పాటు సాగిన కేబినెట్ భేటీలో ఉపాధిహామీ పథకం అమలులో దేశంలోనే ఉత్తమ రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ నిలదడంపై సంబంధిత అధికారులను అభినందించారు. 5విభాగాల్లో మొదటి స్థానంలో, 6విభాగాల్లో 2వ స్థానంలో ఏపీ నిలిచిందని చంద్రబాబుకు అధికారులు తెలిపారు.

దీంతో సంబంధిత శాఖ అధికారులను చంద్రబాబు అభినందించారు. ఇక భేటి అనంతరం మీడియాతో మాట్లాడిన మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి.. ఫ్రూట్‌ఫుల్ డిస్కషన్ జరిగిందని, ఫోని తుఫాన్ నష్టం 3కోట్ల 39లక్షలుగా అంచనా వేసినట్లు వెల్లడించారు. అలాగే అధికారులతో తమకు ఎటువంటి ఇబ్బందులు లేవని, అధికారుల సాకారం వల్లే ఐదేళ్లు అభివృద్ధి చేసినట్లు చెప్పారు. ఎన్నికల కోడ్‌ను అడ్డంపెట్టుకొని ఇబ్బందులు పెట్టాలని చూశారన్నారు. ఎన్నికల కోడ్‌ ఉన్నప్పుడు కొత్త విధాన నిర్ణయాలు మాత్రమే తీసుకోకూడదు తప్ప ప్రకృతి విపత్తులు వచ్చినప్పుడు స్పందించడం ప్రభుత్వ బాధ్యత అన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Ap Cabinet Meeting  Chief secretary  Subrahmanyam  CM Chandrababu  Andhra Pradesh  Politics  

Other Articles