Monsoon rains likely to enter Bay Islands by weekend ఆలస్యంగా ప్రవేశించనున్న నైరుతి రుతుపవనాలు

Monsoon likely to reach kerala on june 4 poised for a sluggish progress skymet

Monsoon rains may enter Bay Islands by weekend, weather update 1, monsoon rains, South-West monsoon, IMD, Monsoon, Kerala, normal rainfall, Skymet, heat wave, weather-report, telangana, Andhra Pradesh

The monsoon is likely to arrive in Kerala on June 4 but is poised for “sluggish” progress thereafter, according to private weather forecasting agency Skymet.

మరో నెల రోజులు భానుడి భగభగలు.. ఆ తరువాత..

Posted: 05/14/2019 04:16 PM IST
Monsoon likely to reach kerala on june 4 poised for a sluggish progress skymet

ప్రచండ భానుడి ఉగ్రరూపానికి దాల్చడంతో వేసవి తాపానికి ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారు. మునుపెన్నడూ లేని విధంగా ఈ సారి ఏకంగా ఉష్ణోగ్రతలు 45 డిగ్రీల నుంచి 47 డిగ్రీల వరకు నమోదవుతున్నాయి. ఓ వైపు అత్యధిక స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదు కావడం.. మరోవైపు వడగాల్పులు వృద్దులు, పిల్లల ఉసురు తీశాయి. ఈ నేపథ్యంలో స్కైమెట్ చల్లని కబరును అందించింది. తెలుగు రాష్ట్రాలలో మరో నెల రోజుల పాటు భానుడి భగభగలు తప్పవని చెప్పింది. ఇదేం చల్లని కబరు అంటున్నారా.?

మరో రెండువారాల్లో నైరుతి రుతు పవనాలు దేశంలోని ప్రకృతి సోంతరాష్ట్రమైన కేరళను పలుకరిస్తాయని స్కైమెట్ అంచనా వేసింది. ఆ తరువాత వారం పది రోజుల్లో రాష్ట్రంలోకి నైరుతి రుతుపవనాలు ప్రవేశిస్తాయని తీపికబురును అందించింది. అయితే అప్పటి వరకు ఎండలు తప్పవని చెప్పింది. ఇది ఒక్కింత చల్లని కబురే అయినా.. అనుకున్న దానికంటే నైరుతి రుతుపవనాలు కొంత అలస్యంగానే కేరళలో ప్రవేశించనున్నాయి. కేరళను తాకిన తరువాత అవి తెలగురాష్ట్రాలకు చేరుకోనున్నాయి.

జూన్ 4న రుతుపవనాలు కేరళను తాకనున్నట్లు స్కైమెట్ అధికారులు తెలిపారు. నైరుతి రాకతో ఈ ఏడాది వర్షాకాలం ప్రారంభమైనట్లు స్కైమెట్ పేర్కొంది. జులై మధ్య నాటికి దేశమంతా వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపింది. దీంతో పంట దిగుబ‌డి కూడా అధికంగా ఉంటుంద‌ని పేర్కొంది. ఆర్థిక ప్ర‌గ‌తి కూడా బాగానే ఉంటుంద‌ని ఆశాభావం వ్య‌క్తం చేశారు. దేశ‌వ్యాప్తంగా సాధార‌ణ వ‌ర్ష పాతం న‌మోద‌య్యే ప్రాంతాలు 70 శాతం క‌న్నా ఎక్కువే ఉన్న‌ట్లు స్కైమెట్ సీఈవో తెలిపారు. దేశానికి 93 శాతం వర్షపాతం ఈ నైరుతి రుతుపవనాల వల్ల కలుగనుంది. రైతాంగం ఎక్కువగా దీనిపైనే ఆధారపడి ఉంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Monsoon  Kerala  normal rainfall  Skymet  heat wave  weather-report  telangana  Andhra Pradesh  

Other Articles