Drugs case: Tollywood actors get clean chit from SIT డ్రగ్స్ కేసు: టాలీవుడ్ నటులకు సిట్ క్లీన్ చిట్..!

Tollywood drug scandal ravi teja puri jagannadh and others get clean chit by sit

sit files charge sheet in hyderabad drugs case, sit excludes tollywood people, telangana drugs case akun sabharwal, drugs case, tolltywood,cine actors, movie actress, hyderabad, Telangana excise police, akun sabharwal, latest news, Telangana, politics

The Tollywood drug bust has hit the headlines again as a Special Investigation Team formed by the Telangana government to investigate the sensational 2017 case has given clean chit to the actors allegedly involved in it.

డ్రగ్స్ కేసు: రవితేజ, తరుణ్, నవదీప్, పూరి, చార్మీ తదితరులకు ఊరట..!

Posted: 05/14/2019 02:51 PM IST
Tollywood drug scandal ravi teja puri jagannadh and others get clean chit by sit

గతంలో సంచలనం సృష్టించిన టాలీవుడ్ డ్రగ్స్ కేసు మళ్లీ తెరపైకి వచ్చింది. రమారమి రెండేళ్ల క్రితం తెలుగు రాష్ట్రాలతో పాటు యావత్ భారత దేశంలో పెను సంచలనంగా మారిన ఈ కేసులో ఎట్టకేలకు అధికారులు న్యాయస్థానంలో చార్జిషీటు దాఖలు చేశారు. ఈ కేసులో సినీరంగానికి చెందిన ప్రముఖులు చిక్కుకోవడం.. అప్పట్లో రోజుకోకరి పేరు తాజాగా బయటకు రావడం.. సినీ హీరోలు, నటుటు, దర్శకులతో పాటు నటీమణులకు కూడా ఈ కేసులో ప్రమేయం వుండటంతో తెలుగు రాష్ట్రాల ప్రజలు ఈ కేసులో ఏం జరుగుతుందన్న ఆసక్తిని కనబర్చింది.

అయితే ఈ కేసులో అసలు సూత్రధారులైన ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకన్న పోలీసులు వారిని అప్పుడే న్యాయస్థానంలో హాజరుపర్చగా, వారికి సుమారుగా ఐదు నెలల తరువాత బెయిల్ లభించింది. నాంపల్లి కోర్టు వీరికి బెయిల్ మంజూరు చేసింది. అయితే ఈ కేసులో పోలీసులు చార్జిషీటు దాఖలు చేయకపోవడంతో కాల్ివన్ మాస్కేరన్హాస్ అనే నిందితుడి్న న్యాయస్థానం బెయిల్ మంజూరు చేసింది. నగరంలోని బడాబాబులు చదివే పలు కార్పోరేట్ పాఠశాలలకు చెందిన సుమారు 200 మంది విద్యార్థులను డ్రగ్స్ రాకెట్ ముఠా తమ రవాణాకు వినియోగిస్తున్నారని తెలిసి.. ఎక్సైజ్ శాఖ ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ అకున్ సబర్వాల్ ఈ కేసును ఛాలెంజ్ గా తీసుకున్నారు.

ఆయన ఈ కేసు టేకప్ చేయడంతో ఒక్కక్కటిగా కూపీ లాగి విద్యార్థుల తల్లిదండ్రులకు కూడా హెచ్చరికలు జారీ చేశారు. ఆ తరువాత డ్రగ్స్ రాకెట్ తీగలాడంతో టాలీవుడ్ లింకులు బయటకు వచ్చాయి. దీంతో టాలీవుడ్ కు చెందిన హీరోలు, హీరోయిన్స్, దర్శకులు మొత్తం 62 మంది ఉన్నారు. అప్పట్లో వీరి నుంచి గోళ్లు, కేశముల నమూనాలు సేకరించి పరీక్షల నిమిత్తం పంపారు. అంతేకాదు ఈ కేసులో మరికొందరు అగ్రకథానాయలకు చెందిన సంతానం లింకులు కూడా బయటపడ్డాయని అప్పట్లో వార్తలు వచ్చాయి. ఈ కేసును దర్యాప్తు చేస్తున్న అధికారి అకున్ సబర్వాల్ అకస్మాత్తుగా సెలవుపై కూడా వెళ్తున్నట్లు వార్తలు వినిపించాయి.

అకున్ సబర్వాల్ లీవ్ పై వెళ్తున్న వార్తలతో ప్రభుత్వానికి డ్యామేజ్ జరిగే చర్యలను వెనువెంటనే దిద్దుకున్న ప్రభుత్వం ఆయన సెలవును రద్దు చేసి.. కేసు దర్యాప్తును మరో చేయాల్సిందిగా అదేశించింది. అయితే రోజుకో కొత్త పేరు వెలుగులోకి రావడం.. దీంతో టాలీవుడ్ పరిశ్రమలోని పెద్దల నుంచి తీవ్రస్థాయిలో ప్రభుత్వం ఒత్తడిని ఎదుర్కోవడంతో ఇక ఈ కేసు విషయంలో తెలంగాణ సీఎం కేసీఆర్.. చెక్ పెట్టారు. మాదకద్రవ్యాలను తీసుకునే వారిని మానసిక రోగులుగా అభివర్ణించిన ఆయన డ్రగ్స్ సరఫరా చేసేవారిపై మాత్రం చర్యలు తీసుకోక తప్పదని అన్నారు.

అయితే ఆ తరువాత పరిణామాల నేపథ్యంలో అకున్ సభర్వాల్ ను ఆ శాఖ నుంచి తప్పించింది ప్రభుత్వం. కేసీఆర్ అదేశాలకు భిన్నంగా ఆ తరువాత ఎక్సైజ్ శాఖ అధికారులు వ్యవహరించడంతో ఈ కేసులో నిందితులు కూడా బెయిల్ లభించింది. ఇక ఇప్పటికే దాఖలైన నాలుగు ఛార్జిషీట్ ల్లో టాలీవుడ్ ప్రముఖల పేర్లను ఎక్సైజ్ అధికారులు చేర్చలేదు.    ఇందుకు సంబంధించి మొత్తం 12 కేసులు నమోదు చేసిన ఎక్సైజ్ శాఖ ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్), ఇందులో నాలుగు కేసుల్లో ఛార్జిషీట్ దాఖలు చేసింది. మరో 8 కేసుల్లో ఛార్జిషీట్ ను సిట్ దాఖలు చేయనుంది. అయితే ఇది కూడా సీఎం కేసీఆర్ అదేశాల మేరకు జరుగుతుందా.? అన్న అనుమానాలు మాత్రం వినిపిస్తున్నాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles