Pawan Kalyan visits MP’s Family members ఎస్పీవై రెడ్డి ఆశయాలను కొనసాగిస్తాం: పవన్ కల్యాణ్

Pawan kalyan pays tributes to spy reddy visits mp s family members

pawan kalyan, janasena, Pawan Kalyan SPY Reddy, Pawan Kalyan SPY Reddy nandyal, SPY Reddy JanaSena, SPY Reddy nandyal, SPY Reddy, nandyal parliamentary constituency, andhra pradesh, politics

Nandyal: Jana Sena Party chief Pawan Kalyan meets the family members of the party’s Late Nandyal MP SPY Reddy who passed away recently, during his visit to the leader’s residence to pay his condolences, in Andhra Pradesh’s Nandyal

ఎస్పీవై రెడ్డి ఆశయాలను కొనసాగిస్తాం: పవన్ కల్యాణ్

Posted: 05/11/2019 08:15 PM IST
Pawan kalyan pays tributes to spy reddy visits mp s family members

నంద్యాల మాజీ ఎంపీ, దివంగత ఎస్పీవై రెడ్డి ఆశయాలను కొనసాగిస్తామని జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. 15 ఏళ్లుగా ఆయనతో అనుబంధం ఉందని, ఆయన వ్యక్తిత్వం బాగా నచ్చిందని చెప్పారు. ఆయన ఏ పార్టీలో ఉన్నా.. అందరికీ సుపరిచిత వ్యక్తేనని కొనియాడారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో నంద్యాల లోక్‌సభ స్థానం నుంచి జనసేన తరఫున పోటీ చేసిన ఎస్పీవై రెడ్డి.. అనారోగ్యంతో బాధపడుతూ కొద్ది రోజుల కిందట కన్నుమూసిన సంగతి తెలిసిందే. శనివారం (మే 11) నంద్యాలలో ఎస్పీవై రెడ్డి నివాసానికి వెళ్లిన పవన్ కళ్యాణ్.. ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించారు.

ఎస్పీవై మృతికి పవన్ సంతాపం తెలిపారు. వారి కుటుంబ సభ్యులతో మాట్లాడారు. ఇంటి ఆవరణలో ఉన్న ఎస్పీవై రెడ్డి సమాధి వద్ద పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఎస్పీవై రెడ్డి కుటుంబానికి జనసేన పార్టీ అండగా ఉంటుందని, వారిని గుండెల్లో పెట్టుకొని చూసుకుంటుందని భరోసా ఇచ్చారు. రూపాయికి పప్పు, రొట్టె; రూపాయికి మజ్జిగ; కేవలం రూపాయి అద్దెతో సాగునీటి సరఫరాకు పీవీసీ పైపు, బిందు సేద్యానికి సగం ధరకే సామగ్రి అందించడం మామూలు విషయం కాదని అన్నారు.

సామాన్యుల అలోచనకు కూడా అందని విధంగా వాటిని అమలు చేసి.. ప్రజల మన్నన్నలను అందుకున్న వ్యక్తి ఒక ఎస్పీవై రెడ్డి మాత్రమేనని పవన్ కొనియాడారు. ఒక పారిశ్రామికవేత్త అలా చేయడం గొప్ప విషయమన్నారు. అందుకే ఆయన ప్రజల మనసుల్లో చెరగని ముద్ర వేశారని తెలిపారు. ఆయన ఆశయాలను కొనసాగిస్తామని తెలిపారు. పవన్ వెంట నాదెండ్ల మనోహర్, మాదాసు గంగాధరం, రామ్మోహన్ రావుతో పాటు కర్నూలు జిల్లా జనసేన నేతలు ఉన్నారు. ఎస్పీవై రెడ్డి మూడుసార్లు నంద్యాల ఎంపీగా ప్రజలకు సేవ చేశారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : SPY Reddy  Pawan Kalyan  Nandyal lok sabha  Janasena  AP Elections 2019  andhra pradesh  politics  

Other Articles