Rahul helps 'fix' his helicopter in Himachal's Una నెట్టింట్లో రాహుల్ హెలికాప్టర్ వీడియో, ఫోటోలు వైరల్

Rahul gandhi posts picture of himself fixing his helicopter wins praises online

congress, elections, elections 2019, helicopter, Himachal Pradesh, Lok Sabha Elections, Lok Sabha elections 2019, May 23rd, Rahul Gandhi, Rahul Gandhi fixes helicopter, rahul gandhi helicopter, Una, Politics

Rahul Gandhi, who has been busy campaigning for the ongoing Lok Sabha elections, posted a picture of himself on Instagram which showed him trying to fix something on his helicopter. His chopper broke down in the Una region of Himachal Pradesh

ITEMVIDEOS: నెట్టింట్లో రాహుల్ హెలికాప్టర్ వీడియో, ఫోటోలు వైరల్

Posted: 05/11/2019 02:56 PM IST
Rahul gandhi posts picture of himself fixing his helicopter wins praises online

కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ అధ్యక్ష పగ్గాలను చేపట్టిన తరువాత పార్టీకి పూర్వ వైభవం తీసుకువచ్చే విధంగా ప్రయత్నాలు చేస్తున్నాడు. వర్కింగ్ ప్రెసిడెంట్ నుంచి పూర్తిగా పార్టీ బాధ్యతలను తీసుకున్న రాహుల్ లో ఏమాత్రం గర్వం రాలేదు.. అలా అని అసాధరణ వ్యక్తిగా కాకుండా అతి సామాన్యుడిగా.. జనంలో తాను ఒకరు అన్న వ్యవహార తీరుతో తన పార్టీలోని నేతలే కాదు.. విభిన్న రాజకీయ పక్షనేతలను కూడా అకట్టుకుంటున్నాడు. సంకీర్ణ ప్రభుత్వాన్ని కేంద్రంలో ఏర్పాటు చేయాల్సి వస్తే.. అందుకు తగిన సమర్థత వున్న నేతగా కూడా నిరూపించుకుంటున్నాడు.

అయితే ఆయన నాయకుడే కాదు.. ఆయనలోని మరో కోణం వెలుగులోకి వచ్చింది. జనంలోకి దూసుకెళ్లటం, వాళ్లతో మాట్లాడటం, ప్రొటోకాల్ ను పక్కన పెట్టి మరీ జనంలో మమేకం అవుతూ వచ్చారు. ఇటీవలి ఓ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల సభకు హాజరయ్యేందుకు వెళ్తున్న రాహుల్ విమానం గాల్లో వుండగా అనేక సార్లు కుదుపులకు గురైంది. దీంతో తానే ఫైలెట్ వున్న కాక్ పిట్ లోకి వెళ్లి.. పరిస్థితి తెలుసుకుని వారికి కూడా సూచనలిచ్చి.. సేఫ్ ల్యాండింగ్ కు దోహపడిన విషయం మనకు తెలిసిందే. లేటెస్ట్ గా హెలికాఫ్టర్ రిపేర్ చేస్తూ కనిపించారు.

హిమాచల్ ప్రదేశ్‌లోని ఉనాలో రాహుల్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. తిరిగి ఢిల్లీ బయలుదేరారు. అంతలోనే హెలికాఫ్టర్ లో సాంకేతిక సమస్య తలెత్తింది. పైలెట్లు, ఇతర సిబ్బంది కంగారు పడ్డారు. రాహుల్ మాత్రం కూల్ గా ఉన్నారు. హెలికాఫ్టర్ లో కూర్చున్న ఆయన కిందకు దిగారు. టెక్నికల్ టీంతో కలిసి రిపేర్ చేయటం మొదలుపెట్టారు. కింద పడుకుని మరీ హెలికాఫ్టర్ డోర్లకు సంబంధించిన స్క్రూల్ లను సరి చేశారు. టెక్నికల్ సిబ్బందికి తన వంతు సాయం అందించారు. రాహుల్ తన ఇన్ స్ట్రాగ్రామ్‌లో ఓ ఫొటోను పోస్ట్ చేశారు.

అందరూ కలిసి తలో చేయ్యేసి.. ‘గుడ్ టీం వర్క్’ గా పనిచేయడం వల్లే హెలికాప్టర్ లో తలెత్తిన సమస్యను త్వరగా ఫిక్స్ చేయడం సాధ్యపడిందని ఆయన స్వయంగా ఇన్ స్టాగ్రామ్ పోస్టులో తెలిపారు.  రాహుల్ గాంధీ తన ఇన్ స్టాగ్రామ్ అకౌంట్ ద్వారా పోస్టు చేసిన ఈ వీడియోకు లక్షల సంఖ్యలో లైక్స్ రాగా, వేలాది కామెంట్లు వచ్చాయి. పార్టీకే కాదు.. హెలికాఫ్టర్ కు కూడా రిపేరు చేస్తున్నారని కొందరు అంటే.. రాహుల్ లో మెకానిక్ కోణం కూడా ఉందా అని ఆశ్చర్యం వ్యక్తం చేశారు మరికొందరు. 2019 లోక్ సభ ఎన్నికల్లో ఏడో దశ పోలింగ్ హిమాచల్ ప్రదేశ్ లో మే 19 నుంచి జరుగనున్నాయి. మే 23న ఎన్నికల ఫలితాలను ప్రకటించనున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : rahul gandhi  helicopter  Una  Lok Sabha elections 2019  Himachal Pradesh  Politics  

Other Articles