టీవీ9 తెలుగుకు కొత్త సీఈవో.. కొత్త సీఓఓల నియామకం.. ABCL replaces Ravi Prakash with mahendra mishra

Abcl appoints new ceo and coo to tv9 telugu channel

TV9 Telugu channel, alanda media, ABCL, Mahendra Mishra, new CEO of TV9, Mahendra Mishra Tv9, ravi prakash, gottipati singa rao, TV9 telugu COO

Associated broadcasting limited board of directors held a meeting today and replaces Ravi prakash with Mahendra mishra as the new CEO of TV9 Telugu channel.

టీవీ9 తెలుగుకు కొత్త సీఈవో.. కొత్త సీఓఓల నియామకం..

Posted: 05/10/2019 05:36 PM IST
Abcl appoints new ceo and coo to tv9 telugu channel

టీవీ 9 గ్రూపు ఛానెల్స్ కు ఆజ్యం పోసిన టీవీ 9 తెలుగు ఛానెల్ వ్యవస్థాపక సీఈవో రవిప్రకాష్ కు అసోసియేటెడ్ బ్రాడ్ కాస్టింగ్ లిమిటిడ్ బోర్డు ఆఫ్ డైరెక్టర్లు పదవి నుంచి ఇవాళ అధికారికంగా తొలగించారు. ఆయన స్థానంలో కొత్త సీఈవోను నియమించింది ఏబిసిఎల్ డైరెక్టర్ల బోర్డు... మహేంద్ర మిశ్రాను టీవీ9కు సీఈవో (చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్‌)గా నియమిస్తూ నిర్ణయం తీసుకుంది. కొద్దిసేపటి క్రితం సమావేశమైన డైరెక్టర్లు.. రవి ప్రకాష్‌ను టీవీ9 సీఈవో పదవి నుంచి తొలగిస్తూ చేసిన తీర్మానాన్ని ఆమోదించారు.

మరోవైపు గొట్టిపాటి సింగారావును సీవోవో (చీఫ్‌ ఆపరేటింగ్ ఆఫీసర్‌)గా నియమిస్తూ ఏబీసీఎస్ డైరెక్టర్లు బోర్డు తీర్మానం చేసింది. మహేంద్ర మిశ్రా టీవీ9 సీఈవోగా వెంటనే బాధ్యతలు తీసుకున్నారు. కాగా, మహేంద్ర మిశ్రా ప్రస్తుతం టీవీ9 కన్నడ ఎడిటర్ గా వ్యవహరించడంతో పాటు కన్నడ ఛానెల్ సీఈవోగా కూడా వ్యవహరిస్తున్నారు. అలాగే గొట్టిపాటి సింగారావు.. గతంలో మా టీవీలో కీలక బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం 10 టీవీ సీఈవోగా ఉన్నారు గొట్టిపాటి సింగారావు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles