Hyderabadi stabbed to death in London by Pakistani లండన్ లో పాకిస్తానీ చేతిలో హైదారాబాద్ యువకుని హత్య

Hyderabad youngster stabbed to death in london by pakistani

Hyderabad youth, pakistani, Nadeemuddin, Hyderabad youth murder, Hyderabad old city, Noor Khan bazaar, sushma swaraj, External Affairs Minister, Telangana, P

Nazimuddin from Noorkhan Bazar of the old city in Hyderabad was stabbed to death allegedly by Pakistani in London, UK. He was working in a supermarket for the last six years and his wife is a medical graduate.

లండన్ లో పాకిస్తానీ చేతిలో హైదారాబాద్ యువకుని హత్య

Posted: 05/10/2019 12:39 PM IST
Hyderabad youngster stabbed to death in london by pakistani

సప్త సముద్రాలు దాటి..  పోట్టకూటి కోసం డాలర్లలో సంపాదించాలన్న ఆశతో వెళ్లిన ఓ భారతీయ యువకుడు లండన్ లో దారుణ హత్యకు గురయ్యాడు. తాను పనిచేస్తున్న ఓ టెస్ కో అనే కెఫ్ పార్కింగ్ ఏరియాలోనే విగతజీవిగా మారడం అతని కుటుంబసభ్యులను తీవ్ర అందోళనకు గురిచేసింది. నజీముద్దీన్‌ హత్య చేశారన్న సమాచారంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. హైదరాబాద్‌లోని నూర్‌ఖాన్‌ బజార్‌కు చెందిన మొహ్మద్‌ నజీముద్దీన్‌ గడచిన ఆరేళ్లుగా లండన్‌లోనే నివాసం ఉంటున్నారు.

నజీముద్దీన్‌ భార్య కూడా అక్కడే డాక్టర్‌గా పనిచేస్తున్నారు. గురువారం అతను కెఫ్ మూసినవేసిన తరువాత కూడా ఇంటికి రాకపోవడంతో.. అనుమానాం వచ్చిన భార్య కెఫ్ కు ఫోన్ చేసింది. దీంతో అక్కడి సెక్యూరిటీ గార్డులు అయన కోసం వెతకగా, ఆయన శవం కెఫ్ పార్కింగ్ ప్రాంతంలో లభ్యమైంది. దీంతో అసలేం జరిగిందని అతని భార్య ఆరా తీయగా, గుర్తు తెలియని వ్యక్తులు కెఫేకు వచ్చి అతనిపై దాడిచేసి చంపేశారని పోలీసులకు సమాచారం అందింది. అయితే అతన్ని ఎందుకు చంపారు.. హత్య చేయాల్సిన అవసరం ఎవరికుంది అన్న వివరాలు తెలియాల్సి వుంది.

సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని నిందితుని కోసం వేట ప్రారంభించారు. కాగా, కెఫ్ లో పనిచేస్తున్న సహోద్యోగి అయిన పాకిస్తానీ తన కుమారుడ్ని దారుణంగా హత్య చేశాడని మృతుడి తండ్రి అరోపిస్తున్నారు. పాకిస్తానీ సహోద్యోగి తనను ఇప్పటికే పలు మార్లు హెచ్చరించాడని, తమ కుమారుడు అక్కడి కస్టమర్లను చక్కగా డీల్ చేస్తున్న విధానంతో మనస్సులో ప్రతీకారాన్ని నింపుకున్న పాకిస్తానీ.. తన మనుషులనే కస్టమర్లుగా పంపించి తన కొడుకును హత్య చేయించాడని అరోపిస్తున్నారు. ఈ మేరకు తన కుమారుడు తనకెు ఫోన్ లో మాట్లాడుతూ విషయాలను చెప్పాడని ఆయన పేర్కోన్నాడు. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles