smriti irani gets shocking reply by crowd స్మృతి ఇరానీకి మైండ్ బ్లాక్ చేసిన ప్రజలు..

Smriti irani suprised by the crowd reply in madhya pradesh

Smriti Irani suprised by the crowd reply in Madhya Pradesh, Smriti Irani shocked by crowd replyl, Smriti Irani, Lok sabha elections, farm loan waivers, agrarian crisis, Kamal Nath, Congress, BJP, Madhya Pradesh, Politics

In a video posted first by the MP Congress Twitter account and then reposted widely, Union Minister Smriti Irani could be heard asking if the loans had been waived as promised. “Yes,” responded many in the crowd enthusiastically.

ITEMVIDEOS: కేంద్రమంత్రి స్మృతి ఇరానీకి మైండ్ బ్లాక్ చేసిన ఎంపీ ప్రజలు..

Posted: 05/09/2019 08:06 PM IST
Smriti irani suprised by the crowd reply in madhya pradesh

ఎన్నికల ప్రచారంలో రాజకీయ నేతలకు అప్పుడప్పుడూ ఇబ్బందికరమైన పరిస్థితి ఎదురవుతూ ఉంటాయన్నది కాదనలేని వాస్తవం. మొన్నామధ్య కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ భోపాల్ లో సభ పెట్టి.. దేశ ప్రజల బ్యాంకు అకౌంట్లలో రూ.15లక్షలు వేస్తామని ఎన్నికల హామీని ఇచ్చి.. ప్రధాని అయిన నరేంద్రమోడీ ఐదేళ్లలో ఏ ఒక్కరి ఖాతాలోనైనా డబ్బులు వేశారా.? అన్న ప్రశ్నకు బదులుగా ఓ యువకుడు వచ్చి అదే వేదికపై మోడీ సర్జికల్ స్ట్రైక్స్ చేశాడని దేశానికి అదే కావాలని కాంగ్రెస్ నేతలతో పాటు కార్యకర్తలకు కూడా షాక్ ఇచ్చిన విషయం తెలిసిందే.

తాజాగా కేంద్ర మంత్రి, బీజేపీ నేత స్మృతీ ఇరానీ ఇదే రకమైన పరిస్థితిని ఎదుర్కొన్నారు. సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆమె మధ్యప్రదేశ్ లోని భోపాల్ పార్లమెంటు నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. అవకాశం లభించినప్పుడల్లా అమె నేరుగా కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీని టార్గెట్ చేస్తారన్న విషయం తెలిసిందే. ఇదే పంథాను మధ్యప్రదేశ్ లో కూడా అమలుపర్చి.. అక్కడి ప్రజల అభిప్రాయాన్ని తీసుకుని వారి నుంచే వచ్చే సమాధానంతోనే వ్యతిరేకతను కూడగట్టుకోవాలని ప్రయత్నించా అబాసుపాలయ్యారు.

అసలేం జరిగిందంటే.. భోపాల్లోని స్థానిక అశోక్ నగర్ లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మాట్లాడుతూ.. ‘కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్ గాంధీ.. మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలలో హామీ ఇచ్చినట్లుగా రాష్ట్ర ప్రభుత్వం నుంచి మీకు రుణమాఫీ అందిందా?’ అని ప్రశ్నించారు. దీంతో ప్రజలంతా ‘అందింది’ అని ముక్తకంఠంతో జవాబిచ్చారు. ప్రజల నుంచి అనుకోని స్పందన ఎదురుకావడంతో స్మృతి విస్తుపోయారు. అనంతరం తేరుకుని తన ప్రసంగాన్ని ముగించి అక్కడి నుంచి వెళ్లిపోయారు. కాగా, ఈ వ్యవహారంపై కాంగ్రెస్ పార్టీ స్పందిస్తూ.. ‘బీజేపీ చెప్పే అబద్ధాలను ఇప్పుడు ప్రజలే నేరుగా తిప్పికొడుతున్నారు’ అని ట్వీట్ చేసింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles