Woman Thrashes 'Fake' ACB Officer With Slippers నకిలీ ఏసీబి అధికారికి చెప్పుతో బుద్ది చెప్పిన మహిళ

Slipper in hand woman thrashes impostor who tried to steal rs 50 000

woman beats man with slipper, woman hits man with slipper video, jamshedpur woman hits man video, acb, fake ACB officer, Anti-Corruption Bureau (ACB), woman cheated, Jamshedpur woman cheated, jamshedpur news, woman, fake acb officer, woman beats man with slipper, jamshedpur, mango street, viral video, crime

A woman who accused a man of posing as an Anti-Corruption Bureau officer and asking her for money was filmed beating him up on a Jamshedpur street. The woman in uniform stood and watched.

ITEMVIDEOS: నడిబజారులో నకిలీ ఏసీబి అధికారికి చెప్పుతో బుద్ది చెప్పిన మహిళ

Posted: 05/08/2019 06:25 PM IST
Slipper in hand woman thrashes impostor who tried to steal rs 50 000

పైన దగా, కింద దగా, కుడి ఎడమల దగా దగా అని మహాకవి శ్రీశ్రీ వెల్లడించినట్లు.. మనిషిని మనిషి దోచుకునే రోజులు ఈ మధ్యకాలంలో అధికమయ్యాయి. తాజాగా ఓ వ్యక్తి తాను అవినీతి నిరోధక శాఖ అధికారిగా చెలామణి అవుతూ.. ప్రజల వద్ద నుంచి లంచాలు వసూలు చేస్తున్నాడు. దీంతో ఓ మహిళకు సాయం చేస్తానని చెప్పి అమెను వేధించడంతో నకిలీ అధికారికి నడిబజారులో సదరు మహిళ చెప్పుతో బుద్ది చెప్పింది. అతని గుట్టు తెలియడంతో అమె రుద్రకాళీగా మారింది. దేహశుద్ది చేసిన అనంతరం పోలీసులకు అప్పగించింది.

ఈ ఘటన జార్ఖండ్ లో జరిగింది. తనకు తానుగా ఏసీబి అధికారినంటూ చెప్పుకుంటూ సమస్యలను పరిష్కారిస్తానని నమ్మబలికిన ఘట్ శీలకు చెందిన ఫణీంద్ర అనే వ్యక్తిని.. పరియస్థుల ద్వారా చేరుకుంది రాఖీ వర్మ అనే మహిళ. వ్యక్తిగత సమస్య విషయంలో పరిష్కారం కోసం సహాయం చేయాలని కోరింది. దీంతో అమెకు సాయం చేస్తానంటూ హామీఇచ్చిన ఫణీంధ్ర మాథ్యూ రూ.50వేలు లంచం అడిగాడు. దీంతో అమెకు కాసింత అనుమానం కలిగింది. ఆ తరువాత ఫణీంధ్ర మాధ్యూ నుంచి పనిచేసి పెట్టాలా వద్దా అని వేధింపులు ప్రారంభమయ్యాయి.

దీంతో తనకు మేలు జరుగుతుందని వెళ్తే.. కీడు జరుగుతుందేంటి అన్న అలోచనలో పడిన రాఖీ వర్మ.. చుట్టుపక్కల ప్రాంతాల వారితో ఈ విషయం గురించి చర్చించి పోలీసులను ఆశ్రయించింది. ముందస్తు ప్రణాళిక ప్రకారం.. లంచం డబ్బు ఇచ్చేందుకు ఓ ప్రాంతానికి రమ్మని నకిలీ అధికారిని రాఖీవర్మ పిలిపించింది. డబ్బుపై ఆశతో అక్కడికి వచ్చిన ఫణీంద్రను ఆమె  చెప్పుతో చితకబాదగా.. అప్పటికే అక్కడికి వచ్చిన పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : woman  fake acb officer  woman beats man with slipper  jamshedpur  mango street  viral video  crime  

Other Articles