legal proceedings on theaters hiking rates ‘మహర్షి’ టికెట్ ధరల పెంపుపై తెలంగాణ సర్కార్ సీరియస్

Telangana government taking legal proceedings on hiking theater rates

Maharshi, Maharshi advance booking, Maharshi ticket prices hiked, Maharshi collection record, Maharshi box office collection, Talasani srinivas yadav, Mahesh babu, Maharshi, Dil Raju, Theatre Managments, High Court, Allari naresh, Pooja Hegde, Dil Raju, C Ashwini Dutt, Prasad V Potluri, Director Vamshi Paidipally, Vamsi Paidipally, tollywood, Telangana, politics

Telangana Cinematography Minister Talasani Srinivas Yadav is serious on Hyderabad Theater Managments and Maharshi film producers for hiking the ticket rates with out information to the government.

‘మహర్షి’ టికెట్ ధరల పెంపుపై తెలంగాణ సర్కార్ సీరియస్

Posted: 05/08/2019 04:41 PM IST
Telangana government taking legal proceedings on hiking theater rates

తెలంగాణలో మరోసారి థియేటర్ టికెట్ ధరల పెంపు విషయంపై పెద్ద దుమారం రేగింది. ఈ నెల 9 వ తేదీన టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబు కెరీర్ లోనే మైలురాయిలా నిలిచే ఆయన 25వ చిత్రం..రిలీజ్ కాబోతున్న నేపథ్యంలో రోజుకు ఐదు షోలతో పాటు టికెట్ల ధరల పెంపుకు కూడా ప్రభుత్వం అనుమతిని మంజూరు చేసిందని వస్తున్న వార్తల్లో నిజం లేదని స్వయంగా రాష్ట్ర సినీమాటోగ్రఫీ శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. థియేటర్ యాజమాన్యం తీసుకున్న నిర్ణయంతో ఆ శాఖా మంత్రే విస్మయానికి గురయ్యారు.

మహర్సి సినిమా విడుదల నేపథ్యంలో తాము ఎవరికీ ఎలాంటి అనుమతులు మంజూరు చేయలదేని తెలిపారు. ఇక ఐదు షోలు వేసుకునేందుకు కూడా ఎవరూ ప్రభుత్వ అనుమతి పోందలేదని ఆయన స్వయంగా వెల్లడించడంతో ఈ సినిమా రిలీజ్ కి కొన్ని గంటల ముందు వివాదంలో చిక్కుకుంది. థియేటర్ యజమానుల తీరు వివాదానికి  దారితీసింది. ప్రభుత్వం పేరు చెప్పి ఏకపక్షంగా టికెట్ల ధరలు పెంచడం రచ్చగా మారింది. దీనిపై తెలంగాణ ప్రభుత్వం సీరియస్ అయ్యింది.  

కాగా, సినిమా విడుదల నేపథ్యంలో సినిమా నిర్మాతలు హైకోర్టుకు వెళ్లి అనుమతులు తెచ్చుకున్నారని సమాచారం వెలుగుచూసింది. రెండు వారాల పాటు  ప్రతిరోజు ఐదు షోలతో పాటు టికెట్ ధరల పెంపుకు కూడా హైకోర్టు నిర్మాతలకు అనుమతిని మంజూరు చేసిందని సమాచారం. అయితే ఈ విషయంపై మంత్రి తలసాని సినిమా థియేటర్ యాజమాన్యాలపై ఫైర్ అయ్యారు. హైకోర్టు ఉత్తర్వులపై ప్రభుత్వానికి సమాచారం ఇవ్వకుండా టికెట్ ధరలు పెంచడం ఏంటని ఆయన యాజమాన్యాలను నిలదీశారు.

రాష్ట్రోన్నత న్యాయస్థానం ఇచ్చిన అనుమతుల కాఫీలను నిర్మాతలు, సినిమా థియేటర్ల యాజమాన్యాలు సంబంధిత అధికారులకు సమాచారం ఇచ్చారా లేదా అని ఆరా తీశారు. టికెట్స్ ధరలు పెంచుకోవడానికి ప్రభుత్వం అనుమతి ఇవ్వలేదని, దీనిపై లీగల్ గా ప్రొసీడ్ అవుతున్నట్టు తలసాని తెలిపారు. టికెట్ల ధరల పెంపు అనేది ప్రభుత్వ నిర్ణయం అని మంత్రి స్పష్టం చేశారు. 79 థియేటర్లు టికెట్ ధరలు పెంచినట్టు తమ దృష్టికి వచ్చిందని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles