Man wears Donald Trump mask to commit robbery డోనాల్డ్ ట్రంప్ మాస్క్ వేసుకుని బంగారం దోపిడీ..

Man wears donald trump mask to commit robbery video goes viral

US president, American President, donald trump, donald trump mask, man wears donald trump mask, robbery, australia, donald trump theft, australia theft, Angus & Coote jewellery store, Queensland police, viral video, robbery, social media, video viral, trending, Crime

A video of a man wearing Donald Trump’s face mask and looting a shop in Queensland, Australian has gone viral on social media. The CCTV footage shows the burglar standing outside a shopping centre and smashing the glass of the store.

డోనాల్డ్ ట్రంప్ మాస్క్ వేసుకుని బంగారం దోపిడీ..

Posted: 05/07/2019 09:43 PM IST
Man wears donald trump mask to commit robbery video goes viral

ఆస్ట్రేలియాలో ఓ దొంగ దోపిడీకి స్కెచ్ వేశాడు. ముఖం కనిపిస్తే ఇట్టే పట్టేస్తారు కదా.. దీంతో గట్టిగానే ముందు జాగ్రత్త తీసుకున్నాడు. ముఖం కనిపించకుండా ఉండేందుకు ఏకంగా అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ మాస్క్ పెట్టుకున్నాడు. వెంటనే రంగంలోకి దిగిపోయాడు. ఆస్ట్రేలియా దేశం క్యూన్స్ ల్యాండ్ ప్రాంతంలోని ఓ బంగారం షాప్ ను టార్గెట్ చేశాడు. రాత్రి సమయంలో తీరిగ్గా షాపు దగ్గరకు వెళ్లాడు. అద్దాలు పగలగొట్టాడు. షాపులోకి ప్రవేశించాడు.

బంగారం వాచీలు మెరుస్తూ ఉన్నాయి. అందినకాడికి దోచేశాడు. కౌంటర్ లో ఉన్న డబ్బు కూడా తీసుకున్నాడు. తన వెంట తెచ్చుకున్న బ్యాగుల్లో సర్దుకుని.. తీరిగ్గా వెళ్లిపోయాడు. పోతూపోతూ షాపులో ఉన్న ఖరీదైన షూస్ కూడా వేసుకుని వెళ్లాడు. దోపిడీ సమయంలో ఈ దొంగ చాలా తెలివిగా వ్యవహరించాడు. అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ మాస్క్ పెట్టుకోవటమే కాదూ.. ట్రంప్ లాగే ప్రవర్తించాడు. అచ్చం అలాగే నడుస్తూ వింత వేషాలు వేశాడు. ఈ ఘటన 2019, మే 6వ తేదీ రాత్రి జరిగింది.

ట్రంప్ మాస్క్ వేసుకుని దొంగతనం చేయటంపై చిత్రమైనా కామెంట్స్ వస్తున్నాయి నెటిజన్ల నుంచి. డబ్బుల కోసం ట్రంప్ చేయించాడా ఏంటీ అని ఒకరు అంటే.. ఫేక్ న్యూస్ అని మరొకరు కామెంట్ చేస్తున్నారు. ట్రంప్ ముసుగులో దోపిడీలు ఎలా చేయాలో ప్రపంచానికి చెప్పాడు అని ఒకరు అంటే.. వీడు ట్రంప్ లకే ట్రంప్ అంటూ జోక్స్ పేలుస్తున్నారు. ప్రస్తుతం ఈ దొంగను పట్టుకునేందుకు ఆస్ట్రేలియా పోలీసులు.. సీసీ కెమెరాలు అన్నింటినీ పరిశీలిస్తున్నారు. ఎక్కడెక్కడ తిరిగాడు.. ఎక్కడి నుంచి వచ్చాడు అనే ఎంక్వయిరీ స్టార్ట్ చేశారు. ఈ ట్రంప్ దొంగ దొరుకుతాడో లేదో చూడాలి..

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles