SC Rejects Opposition Plea To Increase VVPAT Verification వీవీప్యాట్ లెక్కింపు రివ్యూ పిటీషన్ తిరస్కరణ..

Top court rejects opposition s request to increase evm paper trail count

General Elections 2019, TDP, BJP, YSRCP, Chandrababu, YS Jagan, Congress, Assembly Elections, Supreme Court, Electronic Voting Machine, EVM, VVPAT, voter verifiable paper trail machine, Lok Sabha elections 2019, elections 2019, Politics

The Supreme Court today rejected a plea by 21 opposition parties that asked for counting of at least 25% per cent EVM paper trail machines - instead of only five - in every assembly segment. This was the second time the top court turned down their plea.

వీవీప్యాట్ లెక్కింపు రివ్యూ పిటీషన్ తిరస్కరణ.. పోరాడుతామన్న విపక్షాలు

Posted: 05/07/2019 01:08 PM IST
Top court rejects opposition s request to increase evm paper trail count

సార్వత్రిక ఎన్నికల ఫలితాల్లో 50శాతం వీవీప్యాట్ స్లిప్పుల‌ను తప్పనిసరిగా లెక్కించేలా కేంద్ర ఎన్నికల సంఘానికి ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ చంద్రబాబు నేృతృత్వంలో 21 విపక్ష పార్టీల నేతలు దాఖలు చేసిన రివ్యూ పిటిషన్ ను దేశసర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు తిర‌స్క‌రించింది. ఈ అంశంలో గతంలో ఇచ్చిన ఆదేశాలను మార్చే ఉద్దేశం తమకు లేదని న్యాయస్థానం స్పష్టం చేసింది. రివ్యూ పిటిషన్ పై కేవలం నిమిషంలో వాదనలు ముగించిన న్యాయస్థానం తీర్పును వెలువరించింది.

అయితే గతనెల (ఏఫ్రీల్) 8వ తేదీన తాము వెలువరించిన తీర్పు ప్రకారం ప్ర‌తి అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గంలో కేవ‌లం 5 వీవీప్యాట్ స్లిప్పుల‌ను, ప్రతీ పార్లమెంటరీ నియోజకవర్గంలో 35 వీవీప్యాట్ స్లిపులను మాత్ర‌మే ఈవీఎంల‌లో పోలైన ఓట్లతో లెక్కించాలని అదేశాలను పాటించాలని అదేశించింది. అయితే వీటిలో ఎక్కడైన తేడా కనిపిస్తే మాత్రం ఆ నియోజకవర్గం పూర్తి వీవీప్యాట్ స్లిపులను లెక్కించాలని అత్యున్నత న్యాయస్థానం అదేశించింది. గతంలోనూ ఇదే తీర్పును వెలువరించగా, దానిపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ సుప్రీంకోర్టులో రివ్యూ పిటీషన్ ను ప్రతిపక్షాలు దాఖలు చేశాయి.

సుప్రీంకోర్టు తీర్పు అనంతరం మాట్లాడిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు వీవీ ప్యాట్ స్లిప్పుల లెక్కింపు వ్యవహారంలో సుప్రీంకోర్టు నిర్ణయాన్ని గౌరవిస్తామని చంద్రబాబు అన్నారు. కోర్టు నిర్ణయాన్ని గౌరవిస్తూనే న్యాయం కోసం పోరాటం కొనసాగిస్తామన్నారు. న్యాయం జరిగే వరకు పోరాటం ఆపేది లేదని చంద్రబాబు స్పష్టం చేశారు. 50శాతం వీవీ ప్యాట్ స్లిప్పుల లెక్కింపు విషయంలో మళ్లీ ఈసీ దగ్గరికి వెళతామని చంద్రబాబు చెప్పారు. తమ డిమాండ్ ప్రజల కోసం, ప్రజాస్వామ్య పరిరక్షణ కోసమే అన్నారు.

ఎన్నికలను ఈసీ పారదర్శకంగా నిర్వహించాలని చంద్రబాబు కోరారు. ఈసీకి జవాబుదారితనం ఉండాలన్నారు. ఈవీఎం, వీవీప్యాట్ లో వ్యత్యాసాలు ఉంటే ఆ నియోజకవర్గం ఓట్లు మొత్తం లెక్కించాలని చంద్రబాబు డిమాండ్ చేశారు. ప్రజాస్వామ్యంలోని అన్ని పద్ధతుల్లో దీనిపై పోరాటం కొనసాగిస్తామని చంద్రబాబు తెలిపారు. కొంత సమయం పట్టినా విశ్వసనీయత, ట్రాన్సపరెన్సీ ముఖ్యం అని అన్నారు. వీవీ ప్యాట్ల వ్యవహారంలో తమకు సహకరించిన వారికి చంద్రబాబు ధన్యవాదాలు చెప్పారు. 21 పార్టీల నేతలు ఒక్కటిగా ఉన్నామన్నారు. న్యాయం సాధించే వరకు కలిసే ఉంటామన్నారు. సుప్రీంకోర్టు అపెక్స్ బాడీ అని, దాని నిర్ణయాన్ని అంతా గౌరవించాలని చంద్రబాబు అన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles