Case against Anantha MP JC Diwakar Reddy ఈసీ అదేశాలతో.. అనంత ఎంపీ జేసీ దివాకర్ రెడ్డిపై కేసు..

Ap ceo orders action against anantha mp jc diwakar reddy

GopalaKrishna Dwivedi jc diwakar reddy, ananthapuram collector jc diwakar reddy, andhra pradesh CM Chandrababu, TDP president chandrababu, EC to take note on CPI RamaKrishna note, chandrababu, TDP, YS Jagan, YSRCP, sensational satire, andhra pradesh, politics

AP Chief Election Officer GopalaKrishna Dwivedi orders Ananthapur collector to take action against MP and senior TDP Leader JC Diwakar Reddy as he made vouge allegations that it is very high task to compete in elections.

ఈసీ అదేశాలతో.. అనంత ఎంపీ జేసీ దివాకర్ రెడ్డిపై కేసు..

Posted: 05/03/2019 05:48 PM IST
Ap ceo orders action against anantha mp jc diwakar reddy

అనంతపురం పార్లమెంటు నియోజకవర్గంతో పాటు తాడిపత్రి అసెంబ్లీ నియోజకవర్గంలో తన కుమారులు తొలిసారిగా ఎన్నికల బరిలో దింపిన అనంతపురం ఎంపీ, టీడీపీ సీనియర్ నేత జేసీ దివాకర్ రెడ్డికి ఎన్నికల కమీషన్ షాక్ ఇచ్చింది. ఈ సారి ఆయన ప్రత్యక్షంగా ఎన్నికల బరిలోకి దిగకపోయినా.. ఎన్నికల కోడ్ అమల్లో వుండగానే.. ఎన్నికల ఖర్చులు చాలా భారీగా పెరిగిపోయాయని, పార్లమెంటు స్థానానికి పోటీ చేయాలంటే అభ్యర్థికి ఏకంగా యాభై కోట్ల రూపాయాలు అవసరమని ఆయన చేసిన వ్యాఖ్యలపై ఎన్నికల సంఘం సీరియస్ అయ్యింది.

అనంతపురం ఎంపీ, తాడిపత్రి ఎమ్మెల్యే స్థానాల బరిలో నిలిచిన తమ కొడుకులకు కూడా అలాంటి పరిస్థితే ఎదురైందని టీడీపీ సీనియర్ నేత, అనంతపురం ఎంపీ జేసీ దివాకర రెడ్డి కుండ బధ్దలు కొట్టినట్టు ఇటీవల వ్యాక్యలు చేశారు. ఎన్నికల నేపథ్యంలో డబ్బు ఏరులై పారిందని, నియోజకవర్గానికి ఏకంగా 50 కోట్ల రూపాయల చొప్పున ఖర్చు చేశామని చేసిన వ్యాఖ్యలు ఆయనకు ఇబ్బందులు తెచ్చిపెట్టాయి. అయితే జెసి దివాకర్ రెడ్డి చేసిన వ్యాఖలపై పోలీసులు కేసు నమోదు చేయాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ సహా వైసీపీ నేతలు కూడా ఈసీని కలసి పిర్యాదు చేశారు.

జెసి దివాకర్ రెడ్డి వ్యాఖలకు సంబంధించిన వీడియో క్లిప్లింగ్స్, పేపర్ కటింగ్స్ ను సిఇవో గోపాలకృష్ణ ద్వివేది కి అందజేశాయి. ఫిర్యాదును స్వీకరించిన అధికారులు జేసీ ఎన్నికల నియమావళిని ఉల్లంఘించి మాట్లాడడం నిజమేనని నిర్ధారించారు. ఆయనపై చర్యలు తీసుకోవాలంటూ కలెక్టర్‌కు ఆదేశాలు జారీ చేశారు. జేసి దివాకర్ రెడ్డిపై చర్యలకు ఉపక్రమించాలని ఈసీ జిల్లా కలెక్టర్ కు అదేశాలు జారీ చేసింది. ఈసీ అదేశాలతో రంగంలోకి దిగిన జిల్లా యంత్రాంగం.. జేసీ ఎన్నికల నియమావళిని ఉల్లంఘించి మాట్లాడడిన వ్యవహరంలో ఆయనపై కేసు నమోదు చేశారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles