TTD released 67,737 arjitha seva tickets for August month టీటీడీ ఆర్జిత సేవా ఆగస్టు కోటా టికెట్ల విడుదల

Ttd released 67 737 arjitha seva tickets for august month

ttd august arjitha seva tickets, ttd online arjitha seva tickets, ttd seva tickets, ttd arjitha seva tickets, ttd august arjitha seva tickets electronic dip, ttd suprabhata seva tickets, ttd kalyanostavam seva tickets, tirumala tirupati devastanam, TTD, lord venkateshwara, arjitha seva, electronic dip, andhrapradesh

The Tirumala Tirupati Devasthanams released about 67,737 tickets of arjitha sevas being performed in the temple of Lord Venkateswara in the month of august for online booking on April 3 at 11 a.m.

టీటీడీ ఆర్జిత సేవా ఆగస్టు కోటా టికెట్ల విడుదల

Posted: 05/03/2019 02:58 PM IST
Ttd released 67 737 arjitha seva tickets for august month

కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీవారికి ఆర్జిత సేవల కోసం నిత్యం లక్షలాది మంది భక్తులు ఎదురుచూస్తుంటారు. కాగా ఇలా ఎదురుచూసే భక్తకోటి కోసం తిరుమల తిరుపతి దేవస్థానం ప్రతీ నెల తొలి శుక్రవారం రోజున విడుదల చేసే ఆర్జిత సేవా టికెట్లను ఆగస్టు నెల కోటాలో కింద ఇవాళ విడుదల చేసింది. వివిధ అర్జిత సేవలకు సంబంధించిన మొత్తం 67,737 టికెట్లను విడుదల చేసింది. సుప్రభాతం మొదలుకుని దీపాలంకరణ, అర్జిత బ్రోహోత్సవాలు  సహా పలు సేవా టికెట్లను భక్తులు అన్ లైన్ విధానంలో తీసుకోవచ్చు.

కాగా, మొత్తం 67, 737 టికెట్లలో ఆన్‌లైన్‌ లాటరీ విధానంలో (ఎలక్ట్రానిక్ డిప్ విధానంలో) 11,412 టికెట్లు కేటాయించనున్నట్లు పేర్కొంది. ఈ సేవల కోసం లక్షలాధి మంది భక్తులు పోటీ పడుతున్న క్రమంలో వాటిన్నింటినీ పరిగణలోకి తీసుకునే దేవస్థానం.. వారం రోజుల వరకు అందరి ధరఖాస్తులను తీసుకుని ఆ తరవాత నిర్ధిష్ట సంఖ్యలో టికెట్లను ఎంపిక చేస్తోంది. మొత్తం టికెట్లను దేవస్థానం వెబ్‌సైట్లో అందుబాటులో ఉంచింది. అత్యధికంగా సహస్ర దీపాలంకరణ సేవ టికెట్లు ఉన్నాయి. ఈ సేవ కోసం మొత్తం 15,600 టికెట్లు కేటాయించారు.

ఆన్‌లైన్‌ లాటరీ విధానంలో కేటాయించే టికెట్లలో సుప్రభాత సేవకు 8,117, నిజపాద దర్శనానికి 2,875, అష్టదళ పద్మారాధనకు 180, తోమాల సేవకు 120, అర్చనకు120 టికెట్లు కేటాయించారు. ఇక సాధారణ పద్ధతి కోసం 56,325 టికెట్లను కేటాయించారు. ఇందులో దీపాలంకరణ సేవకు 15,600, వసంతోత్సవానికి 14,300, కల్యాణోత్సవానికి 13,300, ఆర్జిత బ్రహ్మోత్సవానికి 7,425, ఊంజల్‌ సేవకు 4,200 టికెట్లు, విశేషపూజకు 1,500 టికెట్లు కేటాయించారు. లాటరీ విధానంలో కేటాయించే టికెట్లు పొందేందుకు పేర్ల నమోదుకు నాలుగు రోజుల సమయం ఇచ్చారు. గడువు పూర్తయ్యాక లాటరీ తీసి టికెట్లు కేటాయిస్తారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles