Police lathi charge on Janasena activists at Intermiediate board ముట్టడికి వచ్చిన జనసైనికులపై పోలీసుల లాఠీచార్జ్..

Police lathi charge on janasena activists at intermiediate board

pawan kalyan on Intermiediate students suicide, pawan kalyan on inter students parents agitation, pawan kalyan on intermiediate board officials, pawan kalyan CM KCR, pawan kalyan Inter marks goof -up, pawan kalyan Intermiediate results, pawan kalyan on Globarina, pawan kalyan interboard failure, Pawan Kalyan, Pragati Bhavan, Janasena, Intermiediate students, students suicides, CM KCR, Inter marks goof -up, Intermiediate results, Globarena, Telangana, politics

As a part of call from telangana opposition parties for chalo Intermiediate board, Janasena activists in large number were on the way, but the police foiled their attempt by lathi charge on them

ఇంటర్ బోర్డు ముట్టడికి వచ్చిన జనసైనికులపై పోలీసుల లాఠీచార్జ్..

Posted: 04/29/2019 03:17 PM IST
Police lathi charge on janasena activists at intermiediate board

తెలంగాణ ఇంటర్ పరీక్ష ఫలితాలు, తదనంతర పరిణామాల నేపథ్యంలో విపక్ష పార్టీలు ఇచ్చిన ఛలో ఇండర్మీడియట్ బోర్డు పిలుపుతో పెద్ద సంఖ్యలో తరలివచ్చిన జనసైనికులపై పోలీసులు లాఠీచార్జీతో విరుచుకుపడ్డారు. ఇంటర్మీడియట్ బోర్డు ముట్టడిలో భాగంగా కార్యాలయం వరకు వచ్చిన జనసేన కార్యకర్తలను, అభిమానులపై పోలీసులు లాఠీచార్జ్ చేసి వారిని చెదరగొట్టారు. దీంతో కొంతసేపు అక్కడ ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. తెలంగాణ ప్రభుత్వం ఇంటర్ బోర్డు ఘటనపై న్యాయవిచారణకు అదేశించాలని డిమాండ్ చేస్తూ జనసేన అందోళన చేపట్టింది.

జనసేన పార్టీ తెలంగాణ ఇన్ చార్జ్ శంకర్ గౌడ్ ఆధ్వర్యంలో పార్టీ కార్యకర్తలు భారీ ఎత్తున తరలివచ్చారు. పోలీసులు వారిని అడ్డుకున్న వేళ వాగ్వాదం జరిగింది. కార్యకర్తలను తరలించే ప్రక్రియలో భాగంగా పోలీసులు తమ లాఠీలకు పనిచెప్పాల్సి వచ్చింది. కాగా, తమపై లాఠీ చార్జ్ చేయడాన్ని శంకర్ గౌడ్ తీవ్రంగా ఖండించారు. పోలీసులను చూసి తాము వెనుకడుగు వేసే ప్రసక్తే లేదని, ఇంటర్ విద్యార్థులకు న్యాయం జరిగేంత వరకూ తాము పోరాడతామని స్పష్టం చేశారు.

ఇంటర్ బోర్డు ఫలితాల అవకతవకలపై సాంకేతిక నిపుణులతో కూడిన త్రిసభ్య కమిటీ ఇచ్చిన నివేదిక కూడా దోషులను కాపాడే ప్రయత్నం చేస్తోందని అయన ఆరోపించారు. ఆత్మహత్యలకు పాల్పడిన విద్యార్థులకు ప్రభుత్వం ఎలా న్యాయం చేస్తోంది. వారి ప్రాణాలను తిరిగి తీసుకురాగలదా..? అని ప్రశ్నించారు. గత పది రోజులుకు పైగా ఎంతో మానసిక అందోళనలో కృంగిపోతున్న లక్షలాది విద్యార్థులకు ఎలా ఆవేదనను దూరం చేస్తారని నిలదీశారు. ఇంటర్ వ్యవహారంలో సమగ్ర న్యాయవిచారణకు ప్రభుత్వం అదేశించి తమ చిత్తశుద్దిని నిరూపించుకోవాలని సూచించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles