CBI summons to Sujana Chowdary సుజనా చౌదరికి సీబీఐ సమన్లు.. సంబంధం లేదన్న టీడీపీ నేత

Tdp leader sujana chowdary responds on cbi summons

CBI summons to Sujana Chowdary, Central Bureau of Investigation, 2017 bank fraud case, CBI Bangalore officials, Andhra Bank, Andhra Pradesh, Politics

The Central Bureau of Investigation has issued a notice to senior TDP leader Sujana Chowdary in a 2017 bank fraud case. Chowdary was asked to appear before the CBI Bangalore branch officials on Friday.

సుజనా చౌదరికి సీబీఐ సమన్లు.. సంబంధం లేదన్న టీడీపీ నేత

Posted: 04/25/2019 08:06 PM IST
Tdp leader sujana chowdary responds on cbi summons

కేంద్ర మాజీ మంత్రి, టీడీపీ నేత సుజనా చౌదరికి సీబీఐ నోటిసులు జారీ చేసింది. బ్యాంకుల వద్ద రుణాలు తీసుకుని మోసం చేసిన కేసులో ప్రశ్నించే నిమిత్తం సుజనా చౌదరిని సీబీఐ తమ ఎదుట విచారణ నిమిత్తం హాజరుకావాలని అదేశిస్తూ నోటీసులు పంపింది. 2017లో ఆంధ్రా బ్యాంకును రూ.71 కోట్ల మేర మోసం చేసిన కేసు నిమిత్తం సీబీఐ బెంగళూరు బ్రాంచ్ ఆయనకు సమన్లు జారీ చేసినట్టు సమాచారం. ఈ కేసు విచారణ నిమిత్తం తమ ముందు హాజరు కావాలంటూ సుజనా చౌదరికి సీబీఐ సమన్లు జారీ చేసింది. శుక్రవారం మధ్యాహ్నం బెంగళూరు సీబీఐ అధికారుల ముందు సుజనా చౌదరి హాజరు కానున్నట్టు తెలుస్తోంది.

కాగా, సీబిఐ నోటీసులపై సుజనా చౌదరి కూడా స్పందించారు. ఈ మేరకు ఓ ప్రెస్ నోట్ విడుదల చేశారు. సీబీఐ జారీ చేసిన సమన్లు బెస్ట్ అండ్ క్రాంప్టన్ కంపెనీకి చెందినవని, ఈ కంపెనీతో తనకు ఎటువంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. 2014 నుంచి ఏ కంపెనీలోనూ ఎగ్జిక్యూటివ్, నాన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ హోదాల్లో లేనని అన్నారు. 2003 నుంచి 2014 వరకు మూడు లిస్టెడ్ కంపెనీల్లో నాన్ ఎగ్జిక్యూటివ్ హోదాలో ఉన్నానని అన్నారు. ఆ మూడు కంపెనీలు సుజనా యూనివర్శల్ ఇండస్ట్రీస్, స్పెండ్లిడ్ మెటల్ ఫ్రొడక్ట్స్, నియాన్ టవర్స్ అని చెప్పిన సుజనా చౌదరని, తదుపరి చర్యలకు సిద్ధంగా ఉన్నట్టు తెలిపారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles