Death toll rises to 360 in sri lanka శ్రీలంకలో పేలిన మరో బాంబు.. చర్చిలన్నీ మూసివేత

Sri lanka bombings another blast heard in pugoda town of colombo

Sri Lanka blasts, sri lanka, easter sunday, Sri Lanka tourism, sri lanka bomb blast, colombo, sri lanka news, sri lanka blast, colombo sri lanka, bomb blast today, sri lanka attack, srilanka bomb blast live, sri lanka blast live updates, Easter-blast, Blasts-in-Sri-Lanka, Thawheed Jamaat, terror attack, sri lanka blasts, colombo chruch blasts, Crime

A blast was heard on Thursday from vacant land behind the magistrates court in the town of Pugoda, 40 km (25 miles) east of the capital Colombo, police and local residents said.

శ్రీలంకలో పేలిన మరో బాంబు.. చర్చిలన్నీ మూసివేత

Posted: 04/25/2019 02:35 PM IST
Sri lanka bombings another blast heard in pugoda town of colombo

ఈస్టర్ పర్వదినాన్ని పురస్కరించుకుని ద్వీప దేశం శ్రీలంకలో ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాద సంస్థ జరిపిన ఘోరకళితో స్థానికులు భీతావాహ పరిస్థితుల్లోకి నెట్టబడినా.. ఇంకా అదేశంలో బాంబు పేలుళ్లు మాత్రం ఆగడం లేదు. ప్రస్తుతం భయం గుప్పిట్లో బిక్కుబిక్కుమంటూ బతుకుతోన్న శ్రీలంకేయులు ఎప్పుడు ఏ క్షణంలో ఎక్కడ బాంబు దాడులు పేలుతాయోనన్న భయాందోళనకు గురవుతున్నారు. నేషనల్ తౌహీద్ జమాత్(ఎన్టీజే) అనే అతివాద సంస్థ.. అంతర్జాతీయ ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాద సంస్థతో కలసి ఈస్టర్ రోజున సృష్టించిన మారణకాండలో ఏకంగా 359 మంది చనిపోయిన విషయం తెలిసింది.

అదివారం ఉదయం చర్చీలను టార్గెట్ చేసి ఆరు బాంబులను, ఆత్మాహుతి దాడులతో పేల్చిన ఉగ్రవాదు.. అదే రోజు మధ్యాహ్నం రాజధాని కొలంబోలోని పర్యాటకులు నివసించే లగ్జరీ హోటళ్లను కూడా టార్గెట్ చేసి బాంబులను పేల్చారు, ఆ తరువాత ఒక బాంబును నిర్వీర్యం చేస్తుండగా పేలింది. ఇక బుధవారం శ్రీలంక  రాజధాని కొలంబోలో ఓ సినిమా థియేటర్‌ వద్ద మరో బాంబు పేలింది. దుండగులు మోటారు బైక్‌లో పెట్టిన బాంబు పేల్చారు. అయితే ఎవరికీ ఎటువంటి ప్రమాదం జరగకపోవడంతో అధికారులు, పోలీసులు, భద్రతా బలగాలు ఊపిరి పీల్చుకున్నాయి. ఈ నేపథ్యంలో ఎప్పుడు ఏం జరుగుతుందో అన్న భయం లంక వాసుల్లో నెలకొంది.

 ముఖ్యంగా కొలంబో లాంటి కీలక పట్టణాల్లో ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావడానికే జంకుతున్నారు. తాజాగా కొలంబోలో ఈరోజు మరోసారి పేలుడు సంభవించింది. భద్రతాబలగాలు రాజధానిలోని అడుగడుగున జల్లెడ పడుతుండగా, పుగోడ మెజిస్ట్రేట్ కోర్టు వద్ద పేలుడు జరిగిందని పోలీస్ శాఖ అధికార ప్రతినిధి రువాన్ గుణశేఖర తెలిపారు. ఈ ఘటనలో అధికారులు, ప్రజలు ఎవరూ గాయపడలేదన్నారు. ప్రజలెవరూ భయపడవద్దని సూచించారు. శ్రీలంకలో ఉగ్రపేలుళ్లకు సంబంధించి  ఇప్పటివరకూ 60 మంది అనుమానితులను అరెస్ట్ చేశామన్నారు.

శ్రీలంకలోని చర్చీలన్ని మూసివేత..

ఉగ్రమూకలు సృష్టించిన మారణకాండతో 359 మంది అమాయకులు ప్రాణాలు కోల్పోయిన నేపథ్యంలో శ్రీలంక క్రైస్తవ మతపెద్దలు కీలక నిర్ణయం తీసుకున్నారు. దేశవ్యాప్తంగా ఉన్న క్యాథలిక్ చర్చిల్లో ప్రార్థనలను నిలిపివేస్తున్నట్లు ప్రకటించారు. ఈ విషయమై సీనియర్ మతబోధకుడు ఒకరు మీడియాతో మాట్లాడుతూ.. చర్చిల వద్ద భద్రతను పెంపొందించాల్సిన అవసరం ఉందని తెలిపారు. అందులో భాగంగా రక్షణ ఏర్పాట్లను కల్పిస్తున్నామన్నారు. అందుకే కొద్దిరోజుల పాటు ఇటువైపుగా ప్రజలను అనుమతించబోమని స్పష్టం చేశారు. రక్షణ శాఖ సూచన మేరకే చర్చిలను కొద్దిరోజులు మూసివేస్తున్నామని తేల్చిచెప్పారు. ప్రజలంతా ఈ ఆదివారం ఇళ్ల దగ్గరే ప్రార్థనలు చేసుకోవాలని సూచించారు. తాము చెప్పేవరకూ ప్రజలు చర్చిలకు రావొద్దని కోరారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : terror attack  sri lanka blasts  colombo chruch blasts  Thawheed Jamaat  Crime  

Other Articles

Today on Telugu Wishesh