Janasena activists protest at pragati bhavan on Inter board goof-up ఇంటర్ బోర్డు తప్పిదాలపై ప్రగతిభవన్ ను ముట్టడించిన జనసేన

Janasena activists protest at pragati bhavan on inter board goof up

pawan kalyan on Intermiediate students suicide, pawan kalyan on inter students parents agitation, pawan kalyan on intermiediate board officials, pawan kalyan CM KCR, pawan kalyan Inter marks goof -up, pawan kalyan Intermiediate results, pawan kalyan on Globarina, pawan kalyan interboard failure, Pawan Kalyan, Pragati Bhavan, Janasena, Intermiediate students, students suicides, CM KCR, Inter marks goof -up, Intermiediate results, Globarina, Telangana, politics

After Janasena party chief Pawan Kalyan has responded for the first time regarding the over Inter students suicide and Board officials negligence today party activists had protested at Telangana CM Official Residence Pragati Bhavan demanding to justification to Inter students.

ఇంటర్ బోర్డు తప్పిదాలపై ప్రగతిభవన్ ను ముట్టడించిన జనసేన

Posted: 04/25/2019 01:43 PM IST
Janasena activists protest at pragati bhavan on inter board goof up

తెలంగాణ ఇంటర్ బోర్డు వ్యవహారంలో యావత్ రాష్ట్ర విద్యార్థి లోకం భగ్గుమంటోంది. ఇంటర్ ఫలితాల అవకతవకల కారణంగా పలువురు విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడటం, మరెందరికో అన్యాయం జరగడంపై వారు తీవ్ర అందోళన వ్యక్తం చేస్తున్నారు. అటు విద్యార్థులు ఇటు వారి తల్లిదండ్రులు కూడా ఇంటర్ బోర్డు కార్యాలయానికి చేరుకుని తీవ్రస్థాయిలో నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. వీరికి అనేక విద్యార్థి సంఘాలు, రాజకీయ పార్టీలు మద్దతు పలికాయి. జనసేన అధినేత పవన్ కల్యాణ్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. పిల్లల ఆత్మహత్యలకు రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత వహించాలని అన్నారు.

విద్యార్థుల భవిష్యత్తుతో ఇంటర్ బోర్డు అధికారులు అటలాడుతున్నారని.. వారి బంగారు భవిష్యత్తును అగమ్యగోచరంగా మార్చారని ఆయన ఆందోళన వ్యక్తం చేసిన నేపథ్యంలో ఇవాళ జనసేన కార్యకర్తలు పెద్ద సంఖ్యలో నిరసనను వ్యక్తం చేశారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారిక నివాసమైన ప్రగతి భవన్ వద్దకు చేరుకున్నారు. ప్రగతి భవన్ ను ముట్టడించేందుకు ప్రయత్నించారు. 19 మంది విద్యార్థులు ఆత్మహత్యలకు తెలంగాణ ప్రభుత్వానిదే బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. ఈ వ్యవహారంలో దోషులను కఠినం శిక్షించాలని జనసేన కార్యకర్తలు డిమాండ్ చేశారు.

ఆత్మహత్యలు చేసుకున్న విద్యార్థుల కుటుంబాలకు నష్టపరిహారం ప్రకటించాలని జనసేన నేతలు డిమాండ్ చేశారు. చేతికందిన బిడ్డలను ఇంటర్ బోర్డు తప్పిదాల కారణంగా కోల్పోయిన తల్లిదండ్రులకు ఎలా న్యాయ చేస్తారని వారు నిలదీశఆరు. వారికి తాము అండగా నిలుస్తామని జనసేనికులు పేర్కోన్నారు. ఇంటర్ బోర్డు అధికారుల తప్పిదాల వల్ల నష్టపోయిన మిగిలిన విద్యార్థులకు న్యాయం జరిగేలా చూడాలని కోరారు. కాగా ప్రగతి భవన్ ముట్టడికి యత్నించిన జనసేన శ్రేణులను అరెస్ట్ చేసిన పోలీసులు, గోషామహల్ స్టేడియానికి తరలించారు. ఇంటర్ పరీక్షా ఫలితాల్లో అవకతవకలు చోటుచేసుకోవడంతో ఇప్పటివరకూ 21 మంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles

 • Rahul gandhi back chidambaram says govt misusing power to character assassinate

  చిదంబరం విషయంలో.. కేంద్రం అధికార దుర్వినియోగం: రాహుల్

  Aug 21 | ‘ఐఎన్ఎక్స్ మీడియా’ కేసులో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి చిదంబరం అరెస్ట్ కు రంగం సిద్ధమైంది. ఢిల్లీ హైకోర్టు ఆయనకు ముందస్తు బెయిల్ మంజూరు చేసేందుకు నిరాకరించడంతో చిదంబరం అజ్ఞాతంలోకి... Read more

 • Inx media scam chidambaram might be arrested at any time

  ఏ క్షణంలోనైనా మాజీ కేంద్రమంత్రి చిదంబరం అరెస్టు.?

  Aug 21 | ప్రస్తుతం అజ్ఞాతంలో ఉన్న మాజీ కేంద్రమంత్రి చిదంబరాన్ని ఏ క్షణంలోనైనా సీబిఐ, ఈడీ అధికారులు అదుపులోకి తీసుకునే అవకాశం వుందన్న వార్తలు రాజకీయవర్గాల్లో చర్చనీయాంశంగా మారుతున్నాయి. దేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టులో ఆయనకు ఇవాళ... Read more

 • Vietnamese bikini airline comes to india from december ticket prices from rs 9

  భారత్ లోకి బికిని ఎయిర్ లైన్స్.. 22 వరకు గోల్డన్ డేస్ ఆఫర్..

  Aug 21 | భారత దేశ నుంచి మరో దేశం తమ విమాన సర్వీసులను ప్రారంభించేందుకు సన్నాహాలను పూర్తి చేసింది. వియత్నాంకు చెందిన వియత్ జట్ ఎయిర్ లైన్స్.. ఇండియా నుంచి తమ దేశంలోని ముఖ్యనగరమైన హో చి... Read more

 • Inx media scam chidambaram petition may not get cleared for hearing in sc

  చిదంబరం ముందస్తు బెయిల్ పిటీషన్ 23కు వాయిదా

  Aug 21 | ప్రస్తుతం అజ్ఞాతంలో ఉన్న చిదంబరం ఆ అజ్ఞాతం వీడక తప్పదనిపిస్తోంది. ఐఎన్ఎక్స్ మీడియా కేసులో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత చిదంబరానికి మరో షాక్ తగిలినట్టయింది. చిదంబరానికి ముందస్తు బెయిల్ ఇచ్చేందుకు ఢిల్లీ హైకోర్టు... Read more

 • Andhra cm refuses to perform lighting ceremonial lamp during us event

  ITEMVIDEOS: ఏపీ సీఎం వైఎస్ జగన్ పై బీజేపి మత విమర్శలు..

  Aug 21 | అగ్రరాజ్యం అమెరికా పర్యటనలో ఉన్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్.. అక్కడి ఓ కార్యక్రమాన్ని జ్యోతి ప్రజ్వళన చేసి ప్రారంభించేందుకు నిరాకరించారన్న వార్తల నేపథ్యంలో ఆయను నెట్ జనులు ట్రాల్ చేస్తున్నారు. జ్యోతి ప్రజ్వలన... Read more

Today on Telugu Wishesh