CM expresses shock over suicide by inter students ఇంటర్ విద్యార్ధులకు సీఎం కేసీఆర్ ఊరట.. ఫ్రీ రీ-వాల్యుయేషన్..

Telangana inter result goof up kcr steps in to control damage waives revaluation fee

parents agitation pragati Bhavan, security beefed-up pragati bhavan, Pragati Bhavan, CM KCR, Official Residence, inter students suicide, Inter marks goof -up, Globarina, protests intermIediate board, security intermiediate board, parents agitation intermiediate board, three level security at inter board, interboard failure, KCR, Telangana CM, K Chandrashekhar Rao, Telangana inter result, Telangana exams, BIE, Telangana, politics

Telangana Chief Minister K Chandrashekhar Rao on Wednesday directed the officials of the Board of Intermediate Education (BIE) to arrange for re-verification and re-counting of the answer sheets of the nearly 3.28 lakh failed students without charging the prescribed fee.

ఇంటర్ విద్యార్ధులకు సీఎం కేసీఆర్ ఊరట.. ఫ్రీ రీ-వాల్యుయేషన్..

Posted: 04/24/2019 05:49 PM IST
Telangana inter result goof up kcr steps in to control damage waives revaluation fee

ఇంటర్ ఫలితాల వివాదంపై ముఖ్యమంత్రి కేసీఆర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇంటర్ పరీక్షలు తప్పిన మూడు లక్షల 28 వేల విద్యార్థులందరి పేపర్లను ఉచితంగా రీ వెరిఫికేషన్, రీ కౌంటింగ్ చేయాలని ఆదేశించారు. పాసైన విద్యార్థులు పాతపద్ధతి ప్రకారమే ఫీజు చెల్లించి రీ వెరిఫికేషన్, రీ కౌంటింగ్ చేసుకోవాలని సూచించారు. ఈ ప్రక్రియను సాధ్యమైనంత త్వరగా పూర్తి చేయాలని సీఎం ఆదేశించారు. ఈ మేరకు ఇంటర్ ఫలితాల గందరగోళంపై ప్రగతి భవన్ లో సీఎం సమీక్ష సమావేశం నిర్వహించారు.

ఈ సమావేశంలో ప్రభుత్వ ప్రధాన సలహాదారు రాజీవ్ శర్మ, విద్యా శాఖ మంత్రి జగదీశ్వర్ రెడ్డి, విద్యా శాఖ కార్యదర్శి జనార్ధన్ రెడ్డి, ఇంటర్ బోర్డు కార్యదర్శి అశోక్ కుమార్‌, సీఎంవో కార్యదర్శులు రాజశేఖర్ రెడ్డి, భూపాల్ రెడ్డితో పాటు పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ రీ వెరిఫికేషన్, రీ కౌంటింగ్, సప్లమెంటరీ పరీక్షల నిర్వహణ బాధ్యతను విద్యాశాఖ కార్యదర్శి జనార్ధన్ రెడ్డికి అప్పగించారు. ఈ ప్రక్రియను వీలైనంత త్వరగా ముగించి విద్యార్థులు విద్యాసంవత్సరం కోల్పోకుండా చూడాలన్నారు.

ఇక మరోవైపు అడ్వాన్డ్స్ సప్లిమెంటరీ పరీక్షలను కూడా త్వరితగతిన నిర్వహించాలని ఆయన అధికారులను అదేశించారు. భవిష్యత్ లో ఎలాంటి ఇబ్బందులు రాకుండా వ్యూహం ఖరారు చేయాలని ఆదేశించారు. వివాదాలకు తావు లేకుండా అన్ని రకాల పరీక్షల నిర్వహణకు స్వతంత్య్ర సంస్థను ఏర్పాటు చేసే అంశాన్ని పరిశీలించాలని.. దీనిపై త్వరలో నివేదిక ఇవ్వాలని అధికారులను ఆదేశించినట్లు సమాచారం. ఇంటర్ విద్యార్థులు ఆత్మహత్య చేసుకోవడం పట్ల కేసీఆర్ తీవ్ర దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. ఎవరూ ఆత్మహత్యలకు పాల్పడవద్దని విజ్ఞప్తి చేశారు. పరీక్షల్లో ఫెయిల్ అయితే జీవితంలో ఫెయిల్ అయినట్లు కాదని సీఎం కేసీఆర్ అన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : KCR  Telangana CM  K Chandrashekhar Rao  Telangana inter result  Telangana exams  BIE  Telangana  politics  

Other Articles