Petrol, Diesel Prices Will be Hiked by Rs 5-10 after polls ఎన్నికలు ముగియగానే పెట్రోబాంబ్ కు మోడీ సర్కార్ రెడీ: కాంగ్రెస్

Petrol diesel prices will be hiked by rs 5 10 on may 23 by modi government says congress

modi sarkar Petro Bomb, modi sarkar dissel Bomb, US threats to impose sanctions Iranian oil, PM Modi mute spectator, increase in petrol price, increase in dissel price, general elections 2019, bjp, congress, diesel price hike, petrol price hike, lok sabha elections 2019, narendra modi, Randeep Surjewala

The Congress claimed that PM Modi will hike petrol and diesel prices by Rs 5-10 after Lok Sabha elections. Congress made the claim in the wake of the US threats to impose sanctions on India and other countries for buying Iranian oil. Hitting out at PM Modi, the party said he was acting as "mute spectator".

ప్రధాని మోడీ చేతిలో పెట్రోబాంబ్.. ఎన్నికలు ముగియగానే..: కాంగ్రెస్

Posted: 04/24/2019 02:31 PM IST
Petrol diesel prices will be hiked by rs 5 10 on may 23 by modi government says congress

దేశంలో సార్వత్రిక ఎన్నికలు ముగిసీముగియగానే ఇంకా ఫలితాలు కూడా వెలువడక ముందే మోడీ సర్కార్ దేశ ప్రజలపై పెట్రోబాంబును వేసేందుకు సిద్దమైందని కాంగ్రెస్ బాంబులాంటి వార్తను పేల్చింది. మే 23వ తేదీ కూడా రాకముందే పెట్రో ధరలు అమాంతం ప్రజలపై రుద్దడం ఖాయమని అందుకు అంతర్జాతీయ పరిణామాలు కారణమైనా.. ఆ విషయంలో ప్రధాని నరేంద్రమోడీ మాత్రం మౌనమునిగా వ్యవహిరిస్తున్నారని.. నిశబ్ద ప్రేక్షకుడి పాత్రను వదిలి తాము అరోపిస్తున్న విషయాలపై నిజనిజాలేంటో దేశ ప్రజలకు తెలియజెప్పాలని కాంగ్రెస్ అధికార ప్రతినిధి రణదీప్ సూర్జేవాలా డిమాండ్ చేశారు.

ఎన్నికల నేపథ్యంలోనే.. అన్ని విడతల ఎన్నిలకు పూర్తయ్యేవరకు పెట్రోల్, డీజిల్ ధరలు పెంచొద్దని ఆయిల్ కంపెనీలను ప్రధాని మోదీ ఆదేశించారని కాంగ్రెస్ పార్టీ ఆరోపించింది. మే 23న దేశవ్యాప్తంగా లోక్‌సభ, కొన్ని రాష్ట్రల్లో అసెంబ్లీ, ఉపఎన్నికల ఫలితాలు వెలువడనున్న నేపథ్యంలో సడిచప్పుడు కాకుండా పెట్రో ధరలను పెంచేందుకు మోడీ ప్రభుత్వం సమాయత్తం అయ్యిందని సూర్జేవాలా అరోపించారు. అయితే ఇది గతంలో మాదిరిగా పైసల రూపంలో కాకుండా ఏకంగా ఎనమిది నుంచి పది రూపాయల మేర పెంచుతుందని కూడా సూర్జేవాలా చెప్పుకోచ్చారు.

ఈ విషయాన్ని దేశప్రజలకు తెలియకుండా కేంద్రం మౌనంగా వ్యవహరిస్తూ వారిని మోసగిస్తోందని సూర్జేవాలా అరోపించారు. దీనికి కారణం ఇరాన్ నుంచి చమురు దిగుమతులు నిలిపేయకుంటే. భారత్ సహా చైనా, జపాన్, దక్షిణ కోరికాయ టర్కీ లాంటి పలు దేశాలపై ఆంక్షలు విధిస్తామంటూ.. అమెరికా హెచ్చరించిందని కూడా ఆయన తెలిపారు. ఈ నేపథ్యంలో క్రూడాయిల్ ధరలు అమాంతం పెరిగిపోయాయన్నారు. ఏకంగా గత అరు మాసాల్లో ఎన్నడూ లేని విధంగా అంతర్జాతీయ మార్కెట్లో క్రూడ్ అయిల్ ధరలు పెరిగాయన్నారు. దీని ప్రభావంతో డాలర్ తో రూపాయి మారకం విలువ కూడా 69.61కి చేరిందన్నారు.  
 
తన సాహసాలను ప్రతిరోజూ కథలు కథలుగా చెప్పుకునే ప్రధాని నరేంద్ర మోదీ ఎందుకు మౌనంగా ఉండిపోయారు? ప్రజలను మభ్యపెట్టి ఓట్లు సొంతం చేసుకునేందుకే ఆయన పెట్రో ఆంక్షలు, ధరలపై నోరు మెదపడం లేదు. మే 23 వరకూ ధరలు పెంచొద్దంటూ ఆయన ఆయిల్ కంపెనీలను ఆదేశించారని కాంగ్రెస్ పార్టీ ప్రతినిధి రణ్‌దీప్ సింగ్ సూర్జేవాలా ఓ ట్వీట్‌లో పేర్కొన్నారు. దేశప్రజల ఓట్ల కోసం పెట్రో ధరల పెంపు విషయాన్ని దాచిన మోడీకి అదే ప్రజలు తగిన గుణపాఠం చెప్పాలని.. అంతర్జాతీయ మార్కెట్ లో చోటుచేసుకుంటున్న పరిణామాలపై విద్యావంతులైనవారు అవగాహనలేని సామాన్య ప్రజలకు తెలియజేయాలని ఆయన కోరారు. అప్పుడే మభ్యపెట్టి ఓట్లు అడుగుతున్న నేతలకు ప్రజలు తగిన గుణపాఠం చెబుతారని సూర్జేవాలా అభిప్రాయపడ్డారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : bjp  congress  diesel price hike  petrol price hike  lok sabha elections 2019  narendra modi  

Other Articles