Yanamala Ramakrishnudu fires on AP CS ప్రభుత్వ పథకాలపై సీఎస్ సమీక్ష.. యనమల సీరియస్..

Yanamala ramakrishnudu fires on chief secretary lv subramanyam

Yanamala Ramakrishnudu, General Elections 2019, TDP, Assembly Elections, AP Chief secretary, LV Subramanyam, Elections, Assembly Elections, pasupu- kumkuma, crop investment scheme to farmers, pensions, vijayawada, Andhra Pradesh, Politics

Yanamala Ramakrishnudu fires on Chief secretary LV Subramanyam for raising false allegation on chandrababu naidu government budget allocations

ప్రభుత్వ పథకాలపై సీఎస్ సమీక్ష.. యనమల సీరియస్..

Posted: 04/24/2019 01:39 PM IST
Yanamala ramakrishnudu fires on chief secretary lv subramanyam

ఆంధ్రప్రదేశ్ ఐఎఎస్ అధికారుల సమావేశం గత రాత్రి అనుకున్నంత మేర సక్సెస్ కాకపోవడం.. కేవలం 9 మంది మాత్రమే ఈ సమావేశానికి హాజరుకావడంతో.. తన సత్తా ఎంటో చూపాలను భావించిన రాష్ట్రప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం ఇవాళ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. రాష్ట్ర ఎన్నికల కౌంటింగ్ కు సంబంధించి జరుగుతున్న ఏర్పాట్లపై ఆయన సమీక్ష నిర్వహించారు. అమరావతిలో జరిగిన ఈ కార్యక్రమానికి రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి గోపాలకృష్ణ ద్వివేది, డీజీపీ ఆర్పీ ఠాకూర్, హోంశాఖ కార్యదర్శి అనురాధ హాజరయ్యారు.

అలాగే జిల్లాల నుంచి కలెక్టర్లు, ఎస్పీలు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షా సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్రమంతటా స్ట్రాంగ్ రూమ్ ల వద్ద పరిస్థితుల గురించి సీఎస్ సుబ్రహ్మణ్యం అధికారులను అడిగి వివరాలను తెలుసుకున్నారు. కౌంటింగ్ కోసం అన్ని ఏర్పాట్లను పూర్తి చేయాలనీ, ఎలాంటి ఇబ్బందులు ఎదురుకాకుండా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. ఏపీలో సంక్షేమ పథకాల అమలుపై సీఎస్ సమీక్ష నిర్వహించడంపై మంత్రులు మండిపడుతున్న నేపథ్యంలో సీఎస్ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించడం గమనార్హం.

కాగా, పసుపు-కుంకుమ, పింఛన్లు, రైతులకు పెట్టుబడి సాయం వంటి పేదల పథకాలకు నిధుల విడుదలపై సమీక్ష నిర్వహించడాన్ని ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు తప్పుపట్టారు. ఈ పథకాల అమలుకు బడ్జెట్ లో నిధులు లేవని చెప్పడంపై యనమల అభ్యంతరం వ్యక్తం చేశారు. అన్నదాతా సుఖీభవ పథకానికి రూ.5,000 కోట్లు, పసుపు-కుంకుమ పథకానికి రూ.4,000 కోట్లు బడ్జెట్ లో కేటాయించామని గుర్తుచేశారు. ఈ పథకాలతో పాటు పింఛన్ల కేటాయింపు విషయాన్ని బడ్జెట్ లో స్పష్టంగా పేర్కొన్నామన్నారు.

ఎన్నికల కోడ్ రాకముందే రైతులు, మహిళలకు చెక్కులు అందజేశామని యనమల తెలిపారు. బడ్జెట్ లో ఉన్న ఈ పథకాలు ఎన్నికల కోడ్ కిందకు రావని ఇప్పటికే కోర్టులు స్పష్టం చేశాయని యనమల అన్నారు. ఈ వ్యవహారంలో వైసీపీ నేతలు కోర్టుల్లో వేసిన పిటిషన్లు తిరస్కరణకు గురయ్యాయని గుర్తుచేశారు. రాష్ట ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం ప్రభుత్వ పథకాలపై సమీక్ష నిర్వహించడం సరికాదని.. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి హోదాలో వున్న ఆయన రాజకీయ నేతగా ప్రభుత్వంపై విమర్శలు చేయడం కూడా సముచితం కాదని యనమల అన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles