Inter Students and Parents extends protest to Pragati Bhavan ప్రగతి భవన్ కు విస్తరించిన ఇంటర్ బోర్డు నిరసనలు.. పలువురి అరెస్ట్

Students and parents attempts to stage protests before pragati bhavan

parents agitation pragati Bhavan, security beefed-up pragati bhavan, Pragati Bhavan, CM KCR, Official Residence, inter students suicide, Inter marks goof -up, Intermiediate results, Globarina, protests intermIediate board, security intermiediate board, parents agitation intermiediate board, three level security at inter board, Telangana CM, KCR, Intermiediate results, KTR, interboard failure, Telangana, politics

Students and Parents, who are staging protests since the results were out in front of Telangana Board Of Intermediate Education office, had extended their protest to CM KCR official Residence Pragati Bhavan at Begumpet in Hyderabad alleging intermediate results goof-up.

ప్రగతి భవన్ కు విస్తరించిన ఇంటర్ బోర్డు నిరసనలు.. పలువురి అరెస్ట్

Posted: 04/24/2019 12:48 PM IST
Students and parents attempts to stage protests before pragati bhavan

తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డ్ అధికారులు హడావిడిగా విడుదల చేసిన ఇంటర్ ఫలితాలు.. విద్యార్థుల ప్రాణాలను బలితీసుకుంటున్నాయి. బోర్డు అధికారుల మధ్య అవగాహన, గ్లోబరినా సంస్థపై వస్తున్న అరోపణలనే రాష్ట్రంలోని 18 మంది అమాయక విద్యార్థులను ఆత్మహత్యలు చేసుకోనేందుకు పురిగోల్పాయి. దీంతో గత నాలుగు రోజుల నుంచి తమకు న్యాయం చేయాలని అటు విద్యార్థులు ఇటు వారి తల్లిదండ్రులు ప్రతి రోడు ఇంటర్ బోర్డు కార్యాలయానికి వచ్చి.. అక్కడ తమ నిరసనను కొనసాగిస్తున్నారు. కాగా తాజాగా ఈ నిరసనల సెగను ఇవాళ ప్రగతి భవన్ కు విస్తరించాయి.

నిన్నటివరకూ బోర్డు కార్యాలయం ఎదుట ధర్నాలకు దిగిన విద్యార్థి సంఘాలు, తల్లిదండ్రులు, విద్యార్థులు ఇవాళ ఎస్ఎఫ్ఐ విద్యార్థి సంఘం అధ్వర్యంలో సీఎం క్యాంప్ ఆఫీస్ ముట్టడికి బయలుదేరారు. ఈ సమాచారం అందుకున్న పోలీసులు భద్రతను కట్టుదిట్టం చేశారు. అందోళనకారులను పంజాగుట్ట రాజీవ్ గాంధీ విగ్రహం వద్దే అడ్డుకున్న పోలీసులు, పలువురిని బలవంతంగా అరెస్ట్ చేశారు. విద్యార్థుల సమస్యలను పరిష్కరించాలని తాము శాంతియుతంగా ధర్నాలు చేస్తుంటే, ప్రభుత్వం అక్రమంగా అరెస్ట్ లు చేయిస్తోందని ఈ సందర్భంగా విద్యార్థి సంఘం నేతలు ఆరోపించారు.

ఇదిలావుండగా ఇంటర్ బోర్డ్ వద్ద పోలీసుల పహారా కొనసాగుతోంది. మూడంచెల భద్రతను ఏర్పాటు చేసిన పోలీసులు, ఆ చుట్టుపక్కల ప్రాంతాలకు విద్యార్థులు, వారి తల్లిదండ్రులను అనుమతించడం లేదు. మరోవైపు రీవాల్యుయేషన్ కు దరఖాస్తు గడువును రెండు రోజుల పాటు పొడిగిస్తూ నిన్న ఇంటర్మీడియట్ బోర్డు నిర్ణయం తీసుకుని ప్రకటించింది. కాగా రీ వాల్యూయేషన్ కోసం ధరఖాస్తు చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నా.. ఇంటర్ బోర్డు వైబ్ సైట్ సరిగ్గా పనిచేయడం లేదని విద్యార్ధులు అరోపిస్తున్నారు. ఈ క్రమంలో సైట్ పునరుద్దరించేందుకు కూడా అధికారులు చర్యలు తీసుకున్నారు. కాగా, ఇది ప్రభుత్వ వైఫల్యమేనని.. ఆత్మహత్యలకు పాల్పడిన 18 మంది విద్యార్థుల మరణాలు ప్రభుత్వ హత్యలేనని విపక్షాలు తీవ్ర అరోపణలు చేస్తున్నాయి.

వారం రోజుల తరువాత స్పందించిన ముఖ్యమంత్రి

ఇంటర్ పరీక్ష ఫలితాల్లో నెలకొన్న గందరగోళంపై ముఖ్యమంత్రి కేసీఆర్ ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది. సుమారు వారం రోజుల తరువాత ఈ అంశంపై ఆయన స్పందించి ఇంటర్ బోర్డు అధికారులపై మండిపడ్డారని సమాచారం. ఇంటర్ బోర్డు వద్ద విద్యార్థులు, విద్యార్థుల తల్లిదండ్రులు రైతు సమస్యను సోషల్ మీడియా పోస్టులో చూసి స్పందించిన ముఖ్యమంత్రి.. 18 మంది విద్యార్థులు ప్రాణాలు పోతున్నా.. పది లక్షల మంది విద్యార్థులు భవిష్యత్తుతో ముడిపడిన అంశంలో ఎందుకు స్పందించడం లేదని మీడియా ముఖంగా ప్రశ్నిస్తున్న క్రమంలో ఆయన ఎట్టకేలకు స్పందించారు.

ఈ వ్యవహారంలో వెంటనే విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని విద్యాశాఖ మంత్రి జగదీశ్ రెడ్డిని ఆదేశించారు. మరోవైపు ప్రభుత్వం నియమించిన కమిటీ విచారణపై కూడా ఆయన ఆరా తీశారు. విచారణ ఎక్కడి వరకు వచ్చింది? ప్రాథమికంగా ఏం తేలింది? అనే విషయాలను కేసీఆర్ అడిగి తెలుసుకున్నారు. ఇంటర్ మార్కుల్లో పలు అవకతవకలు చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. 900లకు పైగా మార్కులు సాధించిన విద్యార్థులు సైతం కొన్ని సబ్జెక్టులలో ఫెయిల్ కావడం కలకలం రేపుతోంది. పలువురు విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడ్డారు.

తాజాగా బయటపడ్డ ఇంటర్ అధికారుల మరో లీలా.!

తెలంగాణ ఇంటర్‌ బోర్డు లీలలు బయటపడుతున్న కొద్దీ మతిపోతోంది. లక్షలాది మంది విద్యార్థుల జీవితాలతో ముడిపడివున్న జవాబుపత్రాల మూల్యాంకనం, మార్కుల జాబితా తయారీలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన బోర్డు పదుల సంఖ్యలో విద్యార్థుల మరణాలకు, వేలాది మంది విద్యార్థులు ఫెయిల్‌ కావడానికి కారణమయ్యిందన్న తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటోంది. ఈ విషయంలో హైకోర్టు కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇప్పటికే మంచిర్యాల జిల్లాకు చెందిన ఓ విద్యార్థిని తొలి సంవత్సరం జిల్లా టాపర్ గా నిలిస్తే రెండో సంవత్సరంలో సున్నా మార్కులు స్కోరు చేసుకన్న ఘటన వెలుగుచూసింది.

ఇక పరీక్షలే రాయని ఓ విద్యార్థిని పాసైనట్టు ఫలితాలు వెల్లడి కావడం కూడా రచ్చరచ్చగా మారింది. ఇక తాజాగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు చెందిన ఓ విద్యార్థికి 17 మార్కులే రాగా, పాస్‌ అయినట్టు ప్రకటించినట్లు వెలుగు చూడడంతో పలువురు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. కొత్తగూడెంలోని ఓ కళాశాలలో ఇంటర్‌ మొదటి సంవత్సరం చదువుతున్న సాత్విక్ కు గణితం 1(ఎ)లో 17 మార్కులు మాత్రమే వచ్చాయి. వాస్తవంగా పాస్‌ మార్కులు 27. కానీ అతను పాస్‌ అయినట్టు బోర్డు ప్రకటించడం విశేషం.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles

 • Pakistan prime minister imran khan shows up when searching for bhikari

  పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్.. బికారియేనా.?

  Aug 19 | జమ్మూకాశ్మీర్ లో ప్రత్యేక ప్రతిపత్తిని తొలగించి ఆ ప్రాంతవాసులకు కూడా యావత్ భారత దేశ ప్రజలు అనుభివిస్తున్న స్వేచ్ఛా వాయువును అందించింది కేంద్ర ప్రభుత్వం. దీంతో పాటు పారిశ్రామీకరణకు దూరంగా వున్న ఈ ప్రాంతాన్ని... Read more

 • Minor girl in mumbai married off forced into flesh trade by mother raped by brother

  కుటుంబ పోషణ కోసం పైళ్లైన కూతురితో వ్యభిచారం

  Aug 19 | ఎలాంటి అలమరికలు లేకుండా ఉరుకులు. పరుగులు తీయాల్సిన వయస్సులో అమె పాలిట కన్నతల్లే కసాయిగా మారింది. తన బిడ్డ జోలికి ఎవరైనా వస్తే వారిని నిలువరించే తల్లులు వున్న ఈ సమాజంలో.. ఇలాంటి తల్లి... Read more

 • Ips officer booked for kicking pregnant lady who suffered miscarriage

  కోర్టు అదేశాలతో.. గర్భిణిని తన్నిన మహిళా ఎస్పీపై క్రిమినల్ కేసు..

  Aug 19 | పోలీసులకు నిందితులను అదుపులోకి తీసుకుని వారిని న్యాయస్థానంలో హాజరుపర్చాల్సిన బాధ్యత వున్నా.. దానిని అధిగమించి వారు పరారీలో వున్న నిందితుల అచూకీ కనుక్కునే సమయంలో నిందితుల సంబంధికులపై చేయి చేసుకోవడం, వారిని అకారణంగా ఠాణాలకు... Read more

 • 8 die as mini goods carrier plunges into well in tiruchi

  ఆటో టైరు పేలడంతో ఘోర ప్రమాదం.. 8 మంది మృతి

  Aug 19 | తమిళనాడులో ఘోర రోడ్డప్రమాదం సంభవించింది. గూడ్స్ కారియర్ అటోలో ప్రయాణికులను ఎక్కించుకుని వెళ్తున్న ఆటో టైరు పేలడంతో ఈ దుర్ఘటన సంభవించింది. వేగంగా వెళ్తున్న ఆటో టైరు పేలడంతో అదుపుతప్పి రోడ్డు పక్కనున్న బ్యారికేడ్... Read more

 • Arun jaitley continues to be critical on life support

  అరుణ్ జైట్లీ ఆరోగ్యం మరింత విషమం.. ఎయిమ్స్ కు బీజేపి నేతలు

  Aug 18 | కేంద్ర మాజీ మంత్రి, బీజేపీ నేత అరుణ్ జైట్లీ ఆరోగ్యం మరింత విషమించింది. ఆయన కిడ్నీలు, ఊపిరితిత్తులు కూడా సక్రమంగా పనిచేయడం లేదని వైద్యులు అంటున్నారు. పరీక్షలు నిర్వహించి ఆయన అవయవాలు ఎలా పనిచేస్తున్నాయో... Read more

Today on Telugu Wishesh