Bike-borne miscreants drag a man after snatching Rs 2.5 lakh బిహార్ మార్కు చోరీ: వ్యక్తిని కిలోమీటర్ లాక్కెళ్లిన దోంగలు..

Man gets dragged behind bike after two thieves snatch his bag in bihar

Bihar mark snacthing, Rs 3 lakhs, three motorcycle-borne miscreants, bike-borne miscreants, social media, viral video, video viral, Hajipur, Bihar, Crime

A video of the incident is being heavily circulated on social media which shows two miscreants on a bike, riding at high speed while a man clings on to his bag, thus being dragged by the vehicle.

ITEMVIDEOS: బిహార్ మార్కు చోరీ: వ్యక్తిని కిలోమీటర్ లాక్కెళ్లిన దోంగలు..

Posted: 04/23/2019 07:51 PM IST
Man gets dragged behind bike after two thieves snatch his bag in bihar

బీహార్ ను నిన్నమొన్నటి వరకు గుండారాజ్ అని అభివర్ణించేవాళ్లు. నిరక్షరాస్యత, నిరుద్యోగంతో అక్కడి యువత అధికంగా సంఘ వ్యతిరేక కార్యకాలపాలకు పాల్పడటంతో ఇలాంటి పేరు వచ్చిందని ఇప్పుడిప్పుడే ఆ పరిస్థితులు మారుతున్నాయని అంటున్నారు రాజకీయ పరిశీలకులు. ఎంతగా పరిస్థితులు మారినా.. అప్పడప్పడు మాత్రం అక్కడ జరిగే పలు ఘటనలు బీహార్ మార్కును మాత్రం చాటుతుంటాయి. ఎంతలా అంటే కనీసం కనికరం కూడా లేకుండా అక్కడి దోంగలు చేసే చోరీలకు ఈ ఘటన ఓ నిదర్శనం.

బ్యాంకులో లక్షల నగదు డ్రా చేశాడో యువకుడు. రూ. 2.5 లక్షల నగదును బ్లాక్ బ్యాగులో పెట్టుకుని మెల్లగా బయటకు వచ్చాడు. అటు ఇటు చూశాడు. కానీ, అక్కడే మాటు వేసిన ఇద్దరు దొంగలు అతన్ని మెల్లగా వెంబడించారు. డబ్బుల బ్యాగుతో వెళ్తున్న యువకుడిని అడ్రస్ అడుగుతున్నట్టు మాటల్లో పెట్టారు. ఇంతలో వెనుక నుంచి ఇద్దరు దొంగలు బైక్ పై దూసుకొచ్చారు. యువకుడి చేతిలో బ్యాగును కొట్టేశారు. అయినప్పటికీ అతడు ఆ బ్యాగును వదల్లేదు. దాదాపు కిలోమీటరు వరకు బైక్ వెనుక వేలాడుతూ బ్యాగును అలానే పట్టుకున్నాడు.

దొంగలు బైక్ పై మరింత స్పీడ్ గా దూసుకెళ్తూ అతడ్ని ఈడ్చుకోని వెళ్లారు. ఈ ఘటన బీహార్ లోని హజిపూర్ ప్రాంతంలో ఇవాళ జరిగింది. దీనికి సంబంధించి వీడియో అక్కడి సీసీ కెమెరాల్లో రికార్డు అయింది. 10 సెకన్ల నిడివి ఉన్న ఈ వీడియోలో దొంగల బైక్ వెనుక బ్యాగు పట్టుకుని యువకుడు వేలాడుతుండగా.. ఈడ్చుకెళ్లడం చూడవచ్చు. అయితే బీహార్ లో ఇలాంటి ఘటన జరగడం తొలిసారి కాదు. గతంలో ఇక్కడ ఎన్నో చోరీ ఘటనలు వెలుగుచూశాయి. ఏప్రిల్ 2న ఈస్ట్ చాంపరన్ జిల్లాలో ఓ వ్యక్తి నుంచి దొంగలు రూ. 3 లక్షలు దోచుకెళ్లారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles