High Court To Order Revaluation of All Failed Students? ‘‘పరీక్ష్ తప్పిన విద్యార్ధులందరికీ రీ-వాల్యూయేషన్.?’’

Hc ordered inter board officials to come with detailed report on revaluation of all failed students

High Court, Revaluation, Inter Exams, Ashok, Janardhan Reddy, Failed Students, Additional Advocate General, Minister jagadeeshwar reddy, Telangana Educational minister, politicalizising inter issue, intermIediate board, security intermiediate board, parents agitation intermiediate board, three level security at inter board, Telangana CM, KCR, Intermiediate results, KTR, interboard failure, Telangana, politics

Telangana High Court is likely to order the revaluation of all the students who failed in the recent Intermediate Examinations in the State. The Court has asked the Additional Advocate General about the time that is needed for revaluation of all those who failed.

విద్యార్థుల పరీక్షా పత్రాల రీవాల్యూయేషన్ కు అదేశించనున్న హైకోర్టు.?

Posted: 04/23/2019 07:01 PM IST
Hc ordered inter board officials to come with detailed report on revaluation of all failed students

తెలంగాణ ఇంటర్ ఫలితాల వ్యవహారంపై రాష్టోన్నత న్యాయస్థానం హైకోర్టు సీరియస్ అయ్యింది. ఇంటర్ ఫలితాలలో అనేక అవకతవకలు జరిగాయన్న నేపథ్యంలో విద్యార్థుల జీవితాలతో ఆటలాడొద్దని న్యాయస్థానం ఘాటుగా స్పందించింది. ఈ క్రమంలో పరీక్ష తప్పిన 3 లక్షల మంది విద్యార్థుల జవాబు పత్రాలను రీ-వాల్యుయేషన్ చేసే విషయమై నిర్ణయాన్ని తెలపాలని ఇంటర్ బోర్డును ఆదేశించింది. ఇంటర్ ఫలితాల్లో అవకతవకలు జరిగాయంటూ బాలల హక్కుల సంఘం నేతృత్వంలో దాఖలైన పిటిషన్ పై ఇవాళ హైకోర్టు విచారణ చేపట్టింది.

ఈ ఏడాది 9.70 లక్షల మంది విద్యార్థుల పరీక్ష రాశారని.. ఇప్పటి వరకు 16 మంది విద్యార్థులు చనిపోయారని.. అయినా, ఇప్పటి వరకు ఇంటర్ బోర్డ్ స్పందించడం లేదన్న పిటిషనర్ తరపు న్యాయవాది వాదించారు. ఇంటర్ ఫలితాలపై జరిగిన అవకతవకలపై జ్యూడిషియల్ ఎంక్విరీ జరిపించాలని కోర్టును కోరారు. 50 వేల మంది విద్యార్థులు, వారి తల్లిదండ్రులు రోడ్డుపైకి వచ్చి ఆందోళనలు చేస్తున్నారని పిటిషనర్ తరపు న్యాయవాది దామోదర్ రెడ్డి వాదించారు. కాగా, ఇంటర్ ఫలితాలలో వచ్చిన ఆరోపణలపై త్రిసభ్య కమిటీ వేశామని అడిషనల్ ఏజీ రామచందర్‌రావు కోర్టు దృష్టికి తీసుకువచ్చారు.

పిటీషనర్ తరపు న్యాయవాది దామోదర్ రెడ్డి వాదనలు విన్న న్యాయస్థానం.. న్యాయవిచారణతో విద్యార్థులకు తక్షణ న్యాయం జరగదని అభిప్రాపడింది. దీంతో జ్యుడీషియల్ ఎంక్విరీ పరిష్కారం కాదని తెలిపిన హైకోర్టు.. విద్యార్థులకు న్యాయం జరగాలని, వారి విద్యా సంవత్సరం కూడా వృదా కాకుండా చూడాల్సిన బాధ్యత తమపై వుందని తెలిపింది. ఇంటర్ బోర్డులో ఉన్న లోపల్ని ఎత్తి చూపండి అని సూచించింది. మరోవైపు, ఇంటర్ పరీక్షల్లో తలెత్తిన తప్పుల్ని సరిచేస్తామని, వారంలోపు సమస్య పరిష్కారం చేస్తామని ప్రభుత్వ అడిషనల్ అడ్వకేట్ జనరల్ వాదించారు.

విద్యార్థుల సమస్యలకి పరిష్కారం చూపుతామని చెప్పిన ఆయన.. రీ-వాల్యుయేషన్, రీ-కౌంటింగ్ కు ప్రతీఏడాది సుమారుగా 25 వేల వరకు వచ్చేవని, కానీ ఈ ఏడాది కేవలం 9 వేల దరఖాస్తులు మాత్రమే వచ్చాయని తెలిపారు. పరీక్షలు రాసిన విద్యార్థుల్లో ప్రతీ ఏడాది 30 శాతానికి పైగా విద్యార్థులు ఫెయిల్ అవుతున్నారని వివరణ ఇచ్చారు. పరీక్షలు తప్పిన విద్యార్థులు సుమారుగా మూడు లక్షల మంది వున్నారని, వీరి పేపర్ల రీవాల్యూయేషన్ కు ఎంత సమయం పడుతుందని న్యాయస్థానం ప్రభుత్వ అడిషనల్ అడ్వకేట్ జనరల్ ను ప్రశ్నించింది. రీవాల్యుయేషన్ కు రెండు నెలల సమయం పడుతుందని ఆయన బదులివ్వడంతో న్యాయస్థానం అసంతృప్తి వ్యక్తం చేసింది.

9.70 లక్షల మందికి పేపర్ వాల్యుయేషన్‌కి 2 నెలల సమయం పడితే.. మరి 3 లక్షల మందికి ఎంత సమయం పడుతుందని హైకోర్టు ప్రశ్నించింది.. 3 లక్షల మందికి 10 రోజులు సమయం సరిపోతుందని హైకోర్టు అభిప్రాయపడింది. వాళ్లంతా భవిష్యత్ ఉన్నవాళ్లు.. డాక్టర్లు, ఇంజినీర్లు కావాల్సినవాళ్లు అంటూ నేరుగా వాదనలు వినిపించారు ఇంటర్ బోర్డు సెక్రటరీ అశోక్. అయితే, గతం, భవిష్యత్‌ కాదు.. ఇప్పుడు పరిష్కారం ఏంటి? చెప్పండి అని హైకోర్టు ప్రశ్నంచింది. దీనిపై సోమవారం వరకు కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది హైకోర్టు. ఇంటర్ ఫలితాల్లో ఫెయిలైన 3 లక్షల మంది విద్యార్థుల పేపర్లు రీ వాల్యుయేషన్ పై ఇంటర్ బోర్డ్ నిర్ణయం తెలపాలని హైకోర్టు ఆదేశించింది. ఈ కేసులో తదుపరి విచారణను సోమవారానికి హైకోర్టు వాయిదా వేసింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles