Sri Lanka mourns as investigation into deadly blasts continues లంక పేలుళ్లు జరిపింది మేమే: ఇస్లామిక్ స్టేట్

Isis claims responsibility for sri lanka bombings that killed over 300

colombo terror attack, sri lanka blasts, colombo chruch blasts, suicide bombs, christchurch, defence minister, New zealand, Mosques, Sri-Lanka-Easter-attack, sri-lanka-bomb-blasts, sri-lanka-blasts, sri-lanka-attack, Easter-blast, Blasts-in-Sri-Lanka, Thawheed Jamaat, terror attack, sri lanka blasts, colombo chruch blasts, Crime

Sri Lanka Blast: A statement on ISIS's official al-Amaq news agency made the claim on the encrypted messaging app Telegram saying the suicide bombers were "fighters of the Islamic State".

న్యూజీలాండ్ మసీదుల్లో జరిగిన కాల్పులకు ప్రతీకారంగానే..

Posted: 04/23/2019 05:59 PM IST
Isis claims responsibility for sri lanka bombings that killed over 300

క్రైస్తవుల అత్యంత పవిత్రమైన ఈస్టర్ పర్వదినం రోజున స్థానికంగా వున్న చర్చీలకు వెళ్లి ప్రార్థనలు జరిపిన భక్తులపై ఆత్మహుతి దాడులతో విరుచుకుపడి పచ్చటి పండగ రోజును నెత్తురిధారాలతో ఘోరకళి సృష్టించింది తామేనంటూ అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థ ఇస్లామిక్ స్టేట్ ప్రకటించింది. ఓ వైపు చర్చీలు, మరోవైపు పర్యాటకులు సేదతీరే లగ్జరీ హోటళ్లలపై మానవబాంబులతో విరుచుకుపడింది తామేనని ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాద సంస్థ ప్రకటించింది. తన అమాక్ సమాచార సంస్థ ద్వారా ఐఎస్ శ్రీలంకలో పేలుళ్లు జరిపింది తామేనని తెలిపింది.

శ్రీలంకలో న్యూజిలాండ్ లోని మసీదుల్లో జరిగిన దాడులకు ప్రతీకారంగానే ఇస్లామిక్‌ ఉగ్రవాదులు శ్రీలంకలో ఆత్మహుతి దాడులు జరిపారని శ్రీలంక రక్షణశాఖ సహాయ మంత్రి రువాన్‌ విజేవర్దనే తెలిపారు. ఇవాళ పార్లమెంట్ లో మాట్లాడుతూ ఆయ‌న ఈ మారణఖాండ వెనుకు ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులు వున్నారని తెలిపారు. న్యూజీలాండ్ క్రైస్ట్ చ‌ర్చ్ దాడుల‌కు ప్రతీకారంగా ఇస్లామిక్ ఉగ్రవాదులు లంకలో పేలుళ్లకు పాల్పడిన‌ట్లు తెలుస్తోంద‌న్నారు. ప్రస్తుతం కొనసాగుతున్న దర్యాప్తులో ప్రాథమికంగా తేలిందని పేర్కొన్నారు.

కాగా దేశ ర‌క్షణ వ్యవ‌స్థలో లోపాలు ఉన్నట్లు ఆయ‌న అంగీక‌రించారు. అన్ని ఉగ్ర సంస్థల‌ను రూపుమాపేందుకు చ‌ర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. క్రైస్ట్ చర్చ్ లోని రెండు మసీదుల్లో జరిగిన ఉన్మాది కాల్పుల్లో 50 మంది మరణించిన సంగతి తెలిసిందే. కాగా, ఈస్టర్ రోజున శ్రీలంకలో జ‌రిగిన వ‌రుస పేలుళ్లలో మృతిచెందిన వారి సంఖ్య 321కి చేరుకున్నది. వీరిలో 38 మంది విదేశీయులు వుండగా, ఈ దారుణ మారణఖాండలో 10 మంది భారతీయులు కూడా అసువుల బాసారు. పేలుళ్లలో మృతిచెందిన వారికి సామూహిక ఖ‌న‌నం చేస్తున్నారు. గాయపడినవారిలో 375మంది ఇంకా ఆస్పత్రుల్లోనే ఉండి చికిత్స పొందుతున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles