proffessor Nageshwar arrest at Telangana Intermiediate Board ప్రోఫెసర్ నాగేశ్వర్ అరెస్ట్.. మంత్రుల క్వార్టర్స్ ముట్టడికి ఏఐఎస్ఎఫ్ యత్నం..

Proffessor nageshwar arrest at telangana intermiediate board

Proffessor Nageshwar Rao, Proffessor Nageshwar protest inter board, Proffessor Nageshwar arrested intermIediate board, security intermiediate board, parents agitation intermiediate board, three level security at inter board, Telangana CM, KCR, Intermiediate results, KTR, interboard failure, Telangana, politics

Former MLC and Osmania University Proffessor Nageshwar Rao, who supported Intermiediate students and parents agitation in marks goof-up issue and came down to inter board and protested was arrested by police and taken to begumbazar police station.

ప్రోఫెసర్ నాగేశ్వర్ అరెస్ట్.. మంత్రుల క్వార్టర్స్ ముట్టడికి ఏఐఎస్ఎఫ్ యత్నం..

Posted: 04/23/2019 02:45 PM IST
Proffessor nageshwar arrest at telangana intermiediate board

తెలంగాణలో ఇంటర్ ఫలితాల వ్యవహారంలో భారీ అవకతవకలు చోటుచేసుకున్న నేపథ్యంలో హైదరాబాద్ లోని నాంపల్లిలో ఉన్న ఇంటర్ బోర్డు కార్యాలయానికి విద్యార్థులు వారి తల్లిదండ్రులు పెద్ద సంఖ్యలో తరలివస్తూ అందోళనకు దిగుతున్న విషయం తెలిసిందే. కాలంతో పాటు సమసిపోతుందిలే అని భావించిన అధికారుల తీరుకు భిన్నంగా ఈ వ్యవహారం రోజురోజుకు మరింతగా రాజుకుంటుంది. ఈ నేపథ్యంలో పలువురు విద్యార్థులు, వారి తల్లిదండ్రులు  విద్యార్థి సంఘాలు, రాజకీయ పార్టీలు బాధిత విద్యార్థులకు సంఘీభావాన్న తెలుపుతూ అందోళనకు దిగుతున్నాయి. తాజాగా వీరికి మద్దతుగా ప్రొఫెసర్ నాగేశ్వరరావు సైతం ధర్నాకు దిగారు.

ఇంటర్ విద్యార్ధులకు బంగారు భవితను తెలంగాణ ప్రభుత్వం కాలరాస్తుందని.. వారికి తక్షణం న్యాయం చేయాలని ఆయన డిమాండ్ చేశారు. విద్యార్థులకు న్యాయం చేస్తామని చబుతున్న ప్రభుత్వం ఏ విధంగా న్యాయం చేస్తారన్న ప్రకటనలో మాత్రం క్లారిటీ ఇవ్వడం లేదని దీంతో.. విద్యార్థులు మరింత అందోళనకు గురవుతున్నారని ఆయన అన్నారు. జాతీయ పరీక్షలతో పాటు ఇటు ఎంసెట్ సహా ఇతర పోటీ పరీక్షలకు సిద్దం కావాల్సిన ఇంటర్ విద్యార్థులు.. ఇంటర్ బోర్డు అధికారుల నిర్లక్ష్యం నేపథ్యంలో మానసిక క్షోభను అనుభవిస్తూ వాటికి ఎలా ప్రిపేర్ అవుతారని ఆయన ప్రశ్నించారు.

అందోళనకు దిగిన ప్రోఫెసర్ నాగేశ్వర్ ను పోలీసులు వెంటనే అరెస్ట్ చేసి బేగంబజార్ పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఈరోజు ఇంటర్ బోర్డు కార్యాలయం ముట్టడికి విద్యార్థి సంఘాలు ప్రయత్నించడంతో పోలీసులు మూడంచెల భద్రతను ఏర్పాటుచేశారు. ఈ సందర్భంగా ఆందోళనకారులకు, పోలీసులకు మధ్య తోపులాట చోటుచేసుకుంది. మరోవైపు బంజారాహిల్స్‌లోని మంత్రుల క్వార్టర్స్‌ ముట్టడికి ఏఐఎస్‌ఎఫ్‌  ప్రయత్నించింది. ఇంటర్ పరీక్షా ఫలితాల బాధ్యతలను చేపట్టిన గ్లోబరీనా ప్రైవేట్ లిమిటెడ్ ఐటీ సొల్యూషన్స్ ను బ్లాక్ లిస్ట్ లో పెట్టాలని విద్యార్థుల తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles