Two more Indians died in Coombo శ్రీలంక పేలుళ్ల ఘటనలో మరో ఇద్దరు భారతీయుల మృతి

High commission in colombo confirms deaths of two more indians

bomb blast in sri lanka today, colombo blast, colombo news, pray for sri lanka, sri lanka attack, Sri Lanka attack 2019, sri lanka blast, sri Lanka blasts 2019, sri lanka bomb blast, Sri Lanka bomb blasts 2019, sri lanka latest news, srilanka attack,srilanka, Sushma-Swaraj, Sri-Lankan-Tamils, Sri-Lanka-Easter-attack, sri-lanka-bomb-blasts, sri-lanka-blasts, sri-lanka-attack, Easter-blast, Blasts-in-Sri-Lanka, Thawheed Jamaat, sri lanka blasts, terror attack, Crime

Indian High Commission in Colombo confirms deaths of two more Indians in sri lanka blasts. A day after the blasts taken palce indian high commissioner sasy vemurai Tulsiram and SR Nagaraj had died in the blast. MeanWhile Sri Lanka's minister of tourism says 39 foreign tourists were killed in the Easter Sunday attacks on churches and hotels, while another 28 were wounded.

శ్రీలంక పేలుళ్ల ఘటనలో మరో ఇద్దరు భారతీయుల మృతి

Posted: 04/22/2019 06:36 PM IST
High commission in colombo confirms deaths of two more indians

వరస బాంబు పేలుళ్లతో వణికిపోతున్న శ్రీలంక వెన్నులో వణుకుపుట్టేలా కొలంబోలో మరోసారి బాంబు పేలుడు చోటుచేసుకుంది. ఇవాళ మధ్యాహ్నం ఓ చర్చి వద్ద పేలుడు సంభవించింది. ఆగి ఉన్న వ్యానులో అమర్చిన బాంబు ఒక్కసారిగా పేలింది. బాంబు ఉందని తెలిసి ప్రత్యేక టాస్క్‌ ఫోర్స్‌ దళాలు దాన్ని నిర్వీర్యం చేసే లోపే పేలిపోయింది. పవిత్రమైన ఈస్టర్‌ డే రోజున శ్రీలంకలో ముష్కరమూకలు మారణహోమానికి తెగబడ్డగా, భద్రతా దళాలు వాటిని బాంబుల కోసం వెతకసాగాయి.

ఈ క్రమంలో ఓ కొలంబో విమానాశ్రయం సమీపంలో బాంబును నిర్వీర్యం చేసిన దళాలు.. కొచ్చి కేడ్ లోని సెయింట్ ఆంథోనీస్ చర్చి వద్ద ఉన్న వ్యానులో ఉంచిన బాంబు వుందని భద్రతా బలగాలు సమాచారం అందుకున్నాయి. బాంబు ఉందని తెలిసి ప్రత్యేక టాస్క్‌ ఫోర్స్‌ దళాలు దాన్ని నిర్వీర్యం చేసే లోపే పేలిపోయింది. ఈ పేలుడుకు సంబంధించిన పూర్తి వివరాలు, ప్రాణనష్టం జరిగిందా, లేదా అనేది తెలియాల్సి ఉంది.

పేలుళ్ల అనంతరం అధికారులు భద్రతా చర్యలను అప్రమత్తం చేశారు. అణువణువూ గాలిస్తున్నారు. కొలంబోలోని ప్రధాన బస్ స్టేషన్ వద్ద 87 డిటోనేటర్లను గుర్తించి నిర్వీర్యం చేశారు. అంతకుముందు విమానాశ్రయం వద్ద అమర్చిన బాంబును గుర్తించి నిర్వీర్యం చేశారు. తనిఖీల్లో భాగంగా వీటిని గుర్తించామని, సమయానికి గుర్తించకపోయి ఉంటే మరో దారుణం జరిగి ఉండేదని పోలీసులు చెబుతున్నారు. కొలంబోలోని చాలా ప్రాంతాల్లో ఉగ్రవాదులు బాంబులు అమర్చినట్లుగా అనుమానిస్తున్నారు. సోమవారం రాత్రి నుంచి ఎమర్జెన్సీ విధించినట్లు తెలుస్తోంది.

కాగా, శ్రీలంకలో ఉగ్రదాడుల నేపథ్యంలో దేశ వ్యాప్తంగా ఎమర్జెన్సీ విధించారు. ఈరోజు అర్ధరాత్రి నుంచి అత్యయిక పరిస్థితి విధిస్తున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. రేపు సంతాప దినంగా ప్రకటించింది. ఇదిలావుండగా, శ్రీలంక బాంబుపేలుళ్ల ఘటనలో మరో ఇద్దరు భారతీయులు మృతిచెందారని శ్రీలంకలోని భారత హై కమీషన్ వెల్లడింది. వారిని వెమురాయ్ తులసిరామ్, ఎస్ఆర్ నాగరాజులుగా ఇండియన్ అంబస్సీ గుర్తించింది. దీంతో మొత్తం 39 మంది విదేశీ పర్యాటకులు శ్రీలంక బాంబు పేలుళ్ల ఘటనలో అసువులు బాసినట్లు శ్రీలంక ప్రభుత్వవర్గాలు తెలిపాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : bomb blast in sri lanka today  colombo blast  sri lanka blasts  terror attack  Crime  

Other Articles