Rahul Gandhi’s Nomination for Amethi Valid, Says EC సుప్రీంకు రాహుల్ 22 పేజీల లేఖ.. నామినేషన్ కు లైన్ క్లియర్

Rahul gandhi expresses regret over his remarks on rafale verdict in sc

amethi nomination, congress, election commission, Rahul Gandhi, Supreme court, rafale row, chowkidar chor hai, uttar-pradesh-lok-sabha-elections-2019, Rahul Gandhi sensational comments, Uttar pradesh, politics

The returning officer (RO) of Amethi on Monday set aside objections on Congress president Rahul Gandhi's nomination papers filed for the seat and held the document valid after scrutinising allegations of discrepancies over citizenship and other issues.

సుప్రీంకు రాహుల్ 22 పేజీల లేఖ.. నామినేషన్ కు లైన్ క్లియర్

Posted: 04/22/2019 03:14 PM IST
Rahul gandhi expresses regret over his remarks on rafale verdict in sc

ప్రధానమంత్రి నరేంద్ర మోడీని 'చౌకీదార్‌ చోర్‌' అని విమర్శించడం పట్ల దేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు జారీ చేసిన నోటీసులపై కాంగ్రెస్ చీఫ్ రాహల్ గాంధీ లిఖితపూర్వక వివరణ ఇచ్చారు. చౌకీధార్ చోర్ హై అంటూ తాను చేసిన వ్యాక్యలను సంబంధిత పార్టీలు వాటికి అనుకూలంగా మార్చుకున్నాయని ఆయన తన లిఖితపూర్వక సమాధానంలో పేర్కోన్నారు.  తన వ్యాఖ్యలు కోర్టు ఉల్లంఘన పరిధిలోకి రావని అన్నారు. కోర్టును రాజకీయాల్లోకి లాగే ఉద్దేశం తనకు లేదని స్పష్టం చేశారు. ఈమేరకు 22 పేజీలతో కోర్టుకు వివరణ ఇచ్చారు.

కాగా, చౌకీధార్ చోర్ హై అంటూ రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో ఆయన నేరుగా దేశఅత్యున్నత న్యాయస్థానానికి క్షమాపణలు చెప్పారని వస్తున్న వార్తల్లో వాస్తవం లేదని తెలుస్తోంది. రాఫెల్ ఒప్పందం కేసులో విపక్షాలు సమర్పించిన రివ్యూ పిటీషన్ ను సుప్రీంకోర్టు విచారణకు స్వీకరించిన నేపథ్యంలో తాను చేసిన వ్యాఖ్యలను వారు తమకు అనుకూలంగా మార్చుకున్నారని రాహుల్ లేఖలో పేర్కోన్నారు. అంతేకానీ తాను న్యాయస్థానం కూడా ఇలా అభిప్రాయపడిందంటూ ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదని ఆయన తన లేఖలో వివరించారు.,

రాఫెల్ యుద్ధ విమానాల కొనుగోలు విష‌యంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు విషయంలో రాహుల్ గాంధీ ప్రధాని నరేంద్రమోడీని ‘చౌకీదార్ చోర్’ అని వ్యాఖ్యానించారని బీజేపి ఎంపీ మీనాక్షి లెఖీ సుప్రీం కోర్టులో పిటిషన్ వేసిన విషయం తెలిసిందే. రాహుల్ ఉద్దేశపూర్వకంగానే ప్రధానిపై ఈ వ్యాఖ్యలు చేసారని పిటీషన్ లో ఆమె తెలిపారు. ఈ అంశంపై సుప్రీం వివ‌ర‌ణ కోరింది. దీనిపై రాహుల్ సుప్రీంకోర్టుకు ఇవాళ వివరణ ఇస్తూ ఏకంగా 22 పేజీల లేఖ రాశారు.

రాహుల్ నామినేషన్ కు లైన్ క్లియర్

రాహుల్ గాంధీ నామినేషన్ పై సందేహాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో ఆయన దాఖలు చేసిన నామినేషన్ చెల్లతుందని అమేథీ రిటర్నింగ్ ఆఫీసర్ ప్రకటించారు. రాహుల్ గాంధీ  విద్యార్హతలు, సిటిజన్ షిప్ పై పలువురు వ్యక్తం చేసిన సందేహాలపై ఈ సందర్భంగా  రాహుల్ తరపు న్యాయవాది కేసీ కౌషిక్ అమేధీలో మాట్లాడుతూ... రౌల్ విన్సీ ఎవరో, ఎక్కడి నుంచి వచ్చాడో తనకు తెలియదన్నారు.  రాహుల్ గాంధీ 1995లో కేంబ్రిడ్జి యూనివర్శిటీ నుంచి M.Phil పూర్తి చేశారని.. ఆ సర్టిఫికెట్ కాపీని తాను అటాచ్ చేశానని అన్నారు. రాహుల్ గాంధీ భారత్ లో జన్మించారు. ఆయనకు భారతీయ పాస్ పోర్ట్ ఉంది. ఆయనకు వేరే ఏ దేశ పౌరసత్వం లేదని కూడా పేర్కోన్నారు. ఆయన ఓటర్ ఐడీ, ఇన్ కమ్ ట్యాక్స్ ఇలా అన్నీ భారత్ లోనే ఉన్నాయని తెలిపారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles