Shedule released for 3-phase ZPTC, MPTC elections ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలకు మ్రోగిన నగరా..!

Election fever in telangana as shedule released for 3 phase local bodies polls

Telangana ZPTC MPTC Elections, Telangana ZPTC Elections, Telangana ZPTC Election Schedule, Telangana MPTC Elections, Telangana MPTC Election Schedule, Telangana local body elections, Nagireddy, local bodies election commissioner, ZPTC Elections, MPTC Elections, local body election schedule, Telangana, politics

The notifications for the 5,800-odd MPTC posts and 583 ZPTC posts had been issued by the Telangana State Election Commission. The upcoming MPTC and ZPTC polls will be the fourth round of elections that have been held in the state within a year’s time

ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలకు మ్రోగిన నగరా..!

Posted: 04/20/2019 08:20 PM IST
Election fever in telangana as shedule released for 3 phase local bodies polls

తెలంగాణలో జిల్లా పరిషత్, మండల పరిషత్ ఎన్నికలకు సంబంధించిన షెడ్యూలు శనివారం (ఏప్రిల్ 20) విడుదలైంది. రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ నాగిరెడ్డి ఎన్నికల షెడ్యూలను ప్రకటించారు. షెడ్యూలు ప్రకారం మూడు విడతల్లో.. మే 6న తొలి విడత, మే 10న రెండో విడత, మే 14న మూడో విడత ఎన్నికలు నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు . మే 27న ఓట్ల లెక్కింపు చేపడతామని నాగిరెడ్డి తెలిపారు. రాష్ట్రంలో మొత్తం 539 జడ్పీటీసీ స్థానాలు ఉండగా... ఒక స్థానానికి మాత్రం ఎన్నికలు జరగడం లేదని ఆయన అన్నారు. దీంతో తెలంగాణలోని మొత్తం 538 జెడ్పీటీసీ, 5817 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి.

షెడ్యూలు ఇలా..
* మొదటి విడత ఎన్నికల నోటిఫికేషన్ ఏప్రిల్ 22న విడుదల కానుండగా.. మే 6న ఎన్నికల పోలింగ్ జరగనుంది. మొత్తం 212 జెడ్పీటీసీ, 2365 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి.
* రెండో విడత ఎన్నికల నోటిఫికేషన్‌ ఏప్రిల్‌ 26న విడుదల కానుంది. మొత్తం 199 జడ్పీటీసీ, 2109 ఎంపీటీసీ స్థానాలకు మే 10న ఎన్నికలు నిర్వహించనున్నారు.
* ఇక మూడో విడత ఎన్నికల నోటిఫికేషన్‌ ఏప్రిల్‌ 30న విడుదల కానుంది. మూడో విడతలో భాగంగా 124 జడ్పీటీసీలు, 1343 ఎంపీటీసీ స్థానాలకు మే 14న పోలింగ్‌ నిర్వహించనున్నారు.

ఆన్‌లైన్ ద్వారా నామినేషన్ల సమర్పణ..
ఈసారి ఆన్‌లైన్‌లో విధానంలోనూ నామినేషన్ దాఖలుచేసే అవకాశాన్ని ఎన్నికల సంఘం కల్పించింది. ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్థులు ఆన్‌లైన్‌లోనూ నామినేషన్ దాఖలు చేయవచ్చు. అయితే ఆ తర్వాత అభ్యర్థులు తమ నామినేషన్ హార్డ్‌కాపీలను రిటర్నింగ్ అధికారికి ఖచ్చితంగా సమర్పించాల్సి ఉంటుంది.

40 ఎంపీటీసీ స్థానాల్లో నో ఎలక్షన్..

సర్పంచ్, వార్డు మెంబర్లు కూడా ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో పోటీచేయవచ్చని.. అయితే, ఫలితాల తర్వాత వారు తమ పదవులకు రాజీనామా చేయాల్సి ఉంటుందని నాగిరెడ్డి తెలిపారు. 40 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు నిర్వహించడం లేదన్నారు. మహబూబ్ నగర్ జిల్లా... జడ్చర్ల లోని 15 ఎంపీటీసీ స్థానాలకు వచ్చే ఏడాది మే నెలలో టర్మ్ ముగిస్తుందని.. భద్రాచలం జిల్లాలోని బుర్గంపాడులో 11 ఎంపీటీసీ స్థానాలకు వచ్చే ఏడాది జులైతో టర్మ్ ముగుస్తుందని.. లీగల్ కారణాల వల్ల ములుగులోని 14 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు నిర్వహించడం లేదని క్లారిటీ ఇచ్చారు. ఎన్నికల భద్రత కోసం 26 వేల మంది భద్రతా సిబ్బందిని నియమించినట్లు నాగిరెడ్డి తెలిపారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles