KTR, YS Jagan wishes chandrababu చంద్రబాబుకు మోడీ, జగన్, కేటీఆర్, పరుచూరి, శుభాకాంక్షలు..

Pm modi wishes chandrababu naidu birthday prays for his long life

PM Narendra Modi,Chandrababu Naidu,Chandrababu Naidu birthday,PM Modi news,PM Modi Twitter,PM Modi tweets, General Elections 2019, TDP, BJP, YSRCP, Chandrababu, YS Jagan, Congress, Assembly Elections, vijayawada, Andhra Pradesh, Politics

Prime Minister Narendra Modi today tweeted birthday wishes and prayed for the long and healthy life of BJP's erstwhile ally Chandrababu Naidu as the Andhra Pradesh Chief Minister turned 69.

చంద్రబాబుకు వెల్లువెత్తిన జన్మదిన శుభాకాంక్షలు..

Posted: 04/20/2019 11:29 AM IST
Pm modi wishes chandrababu naidu birthday prays for his long life

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు 70వ వసంతంలోకి అడుగుపెట్టిన సందర్భంగా ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. ప్రధాని నరేంద్ర మోదీ, వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి సహా పలువురు కీలక నేతలు చంద్రబాబుకు శుభాకాంక్షలు తెలియజేశారు.

ఇక చంద్రబాబు వారసుడిగా తనయుడు, ఏపీ ఐటీ మంత్రి, టీడీపీ నేత నారా లోకేశ్ తన తండ్రికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ‘ఓ విజనరీగా, ధైర్యవంతుడైన వ్యక్తి అయిన మిమ్మల్ని తండ్రిగా పొందినందుకు నేనెంతో అదృష్టవంతుడిని. మీరు ప్రపంచానికి ఓ విజనరీగా మాత్రమే కాదు.. ఓ భర్తగా, తండ్రిగా, తాతగా మాపై అమితమైన ప్రేమ కురిపించారు. దేవాన్ష్ తో నాలుగేళ్ల పిల్లాడిలా పరిగెత్తారు. రాబోయే రోజుల్లో మీరు ఇంతే ఉత్సాహంతో, శక్తిమంతంగా ఉండాలని ఆ భగవంతుడిని కోరుకుంటున్నా. పుట్టినరోజు శుభాకాంక్షలు నాన్న’ అని ట్వీట్ చేశారు.


తాజాగా టీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ‘చంద్రబాబు గారికి హార్థిక జన్మదిన శుభాకాంక్షలు. మీకు ప్రశాంతమైన, ఆరోగ్యకరమైన జీవితాన్ని ప్రసాదించాలని భగవంతుడిని కోరుతున్నా. సమాజ సేవలో మీరు మరెన్నో సంవత్సరాలు గడపాలని ఆకాంక్షిస్తున్నా' అంటూ కేటీఆర్ ట్వీట్ చేశారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : PM Modi  Chandrababu  YS Jagan  KTR  birthday wishesh  General Elections 2019  TDP  vijayawada  Politics  

Other Articles