"Make Comedy Film On PM Modi": Urmila Matondkar ప్రధాని మోడీ బయోపిక్ పై ఊర్మిళ సంచలన వ్యాఖ్యలు

Biopic joke make comedy film on him urmila matondkar attacks pm modi

Urmila Matondkar took a savage dig at PM Modi, Urmila Matondkar attacks PM Modi, Urmila Matondkar, Mumbai North, Congress candidate, PM Modi, BJP, Biopic, comedy film, Maharashtra, politics

Actor-turned-politician Urmila Matondkar took a savage dig at PM Modi, saying he didn't deserve a biopic as he failed to deliver anything as the head of the government. she further said a comedy film should be made on the PM.

ప్రధాని మోడీ బయోపిక్ పై ఊర్మిళ మటోండ్కర్ సంచలన వ్యాఖ్యలు

Posted: 04/19/2019 12:12 PM IST
Biopic joke make comedy film on him urmila matondkar attacks pm modi

సినీరంగం నుంచి రాజకీయాల్లోకి వచ్చి.. ముంభైలోని ఉత్తర లోక్ సభ స్థానం నుంచి ఎన్నికల బరిలో నిలిచి.. తన ప్రాణాలకు ముప్పు వుందని, తాను పోటీ చేస్తున్న నేపథ్యంలో తనపై దాడి చేసేందుకు ముష్కరమూకలు యత్నించాయని నటి ఊర్మిళ మటోండ్కర్ ఇటీవల పోలీసులకు సమాచారం అందించారు. తనకు రక్షణ కూడా కల్పించాలని అమె కోరారు. ఈ ఘటనతో అమె కాసింత వెనక్కు తగ్గారన్న వార్తల నేపథ్యంలో అమె నేరుగా ప్రధాన మంత్రి నరేంద్రమోడీని ఢికొట్టేందుకు రెడ్డీ అయ్యారు.

దేశప్రజల సంక్షేమానికి ఏం చేశారని ఆయన తన బయోపిక్ చిత్రాన్ని తీసుకుంటున్నారని అమె ధ్వజమెత్తారు.అంతటితో అగకుండా ప్రధాని బయోపిక్ పెద్ద జోక్ అంటూ విమర్శించారు. కేంద్రంలోని ప్రభుత్వానికి అధినేతగా వుంటూ దేశప్రజలకు ఆయన చేసిన గత ఎన్నికల హామీలు ఏమయ్యాయని ఆమె ప్రశ్నించారు. ప్రధాని మంత్రి నరేంద్రమోడీపై బయోపిక్ చిత్రం బదులుగా ఒక కామెడీ చిత్రాన్ని రూపోందించాలని అమె పేర్కోన్నారు. 56 ఇంచుల వెడల్పు ఛాతి వుందని ప్రకటించుకునే ప్రధాని తన హాయంలో అన్ని విధాలుగా పాలనలో విఫలమయ్యారని అమె విమర్శించారు.

దేశప్రజలు ఆయనకు ముఫ్పై ఏళ్లలో లేని మెజారిటీని కల్పించి గత పర్యాయం ప్రభుత్వాన్ని అందిస్తే.. ఆయన దేశ ప్రజలకు ఏం సాధించిపెట్టారని అమె నిలదీశారు. సంకీర్ణ ప్రభుత్వాల మధ్య దేశానికి కాంగ్రెస్ చేసిన మేలులో కనీసం ఐదుశాతం కూడా ప్రధాని నరేంద్రమోడీ హయాంలో ప్రజలకు ఒనగూరలేదని ఆమె విమర్శించారు. ప్రధాని నరేంద్రమోడీ హాయంలో ఆయన మాయమాటల్లో చిక్కకున్న  అన్ని వర్గాల దేశప్రజల ఎదో జరుగుతుందని ఆశించారని..  వారితో పాటు పేదలకు, మధ్యతరగతి వర్గానికి, రైతులకు, యువతకు, మహిళల ఆశలన్నీ అడియాశలయ్యాయని అమె ఫైర్ అయ్యారు.

గత ఎన్నికల సమయంలో ప్రధానమంత్రి అభ్యర్థిగా నరేంద్రమోడీ చేసిన ఎన్నికల వాగ్గాలనాలపై ఒక కామెడీ చిత్రాన్ని తీస్తే తప్పకుండా దేశప్రజలు అదరిస్తారని అమె అన్నారు. ప్రజాస్వామ్యంలో ప్రధాని మోడీ బయోపిక్ పెద్ద జోక్ అని అమె వ్యంగస్త్రాలు సంఘించారు. దేశంలో పేదరికం పెరిగడానికి ఆయన పాలన కారణమని విమర్శించారు. దేశ ప్రజల మధ్య వర్గ, వైశమ్యాలను పెంచిపోషించారని దుయ్యబట్టారు. నిత్యావసర సరుకుల ధరలు ఆకాశానంటుతున్నాయని, ఇంధన ధరలు మునుప్పెన్నడూ లేని స్తాయి చేరిన విషయాన్ని కూడా ఊర్మిళ మటోండ్కర్ ఊటంకించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Urmila Matondkar  Mumbai North  Congress candidate  PM Modi  BJP  Biopic  comedy film  Maharashtra  politics  

Other Articles