MP contestant maganti roopa injured in road accident ఫిల్మ్ నగర్ రోడ్డు ప్రమాదంలో మాగంటి రూపకు గాయాలు

Murali mohan daughter in law maganti roopa injured in road accident

cinema actor murali mohan, producer murali mohan, jayabheri group of companies chairman murali mohan, murali mohan daughter in law maganti roopa, rajamundry MP contestant maganti roopa, maganti roopa, injured, Raod accident, film nagar, hyderabad, Telangana, Andhra Pradesh, Politics, Crime

cinema actor, producer jayabheri group of companies chairman murali mohan daughter in law, rajamundry MP contestant from TDP party, maganti roopa injured in accident at film nagar in hyderabad today morning

ఫిల్మ్ నగర్ రోడ్డు ప్రమాదంలో మాగంటి రూపకు గాయాలు

Posted: 04/19/2019 10:34 AM IST
Murali mohan daughter in law maganti roopa injured in road accident

హైదరాబాద్ లో ఇవాళ ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో సీనియర్ సినీనటుడు, నిర్మాత, రాజమండ్రి పార్లమెంటు సభ్యుడు మురళీమోహన్ కోడలు మాగంటి రూప గాయపడ్డారు. ఆమె ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురికావడంతో అమె గాయపడ్డారు. హైదరాబాద్ శంషాబాద్ విమానాశ్రయం సమీపంలో ఆమె ప్రయాణిస్తున్న కారును ఎదురుగా వస్తున్న మరోకారు ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగినట్లు సమాచారం. ఈ ఘటనలో రూపకు గాయాలు కాగా అమెను హుటాహుటిన నగరంలోని అపోలో అసుపత్రికి తరలించారు.

మాగంటి రూప తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం లోక్‌సభ నియోజకవర్గ టీడీపీ అభ్యర్థిగా పోటీ చేశారు. గత ఎన్నికల్లో ఈ స్థానం నుంచి మురళీమోహన్ గెలవగా.. ఆయన పోటీకి దూరంగా ఉండటంతో ఆ సీటును ఆయన కోడలికి టీడీపీ అధిష్ఠానం కేటాయించింది. మురళీమోహన్ తల్లి వసుమతిదేవి (100) గురువారం ఉదయం విశాఖపట్నంలో అనారోగ్యంతో మృతిచెందారు. ఆమె అంత్యక్రియలు ఈరోజు రాజమహేంద్రవరంలో నిర్వహించనున్నారు. రూప ఆ కార్యక్రమానికి వెళ్తుండగానే ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : maganti roopa  injured  Raod accident  film nagar  hyderabad  Telangana  Crime  

Other Articles