EC cancels election to Vellore Lok Sabha seat వేలూరు లోక్‌సభ నియోజకవర్గ ఎన్నిక నిలిపివేత

Ec cancels polls for vellore parliamentary constituency citing reports of cash seizure

lok sabha election 2019, general election 2019, election 2019, election commission, vellore election cancelled, vellore election cancel, election commission, president, ramnath kovind, vellore parliamentary constituency, DMK, Tamil Nadu, politics

Elections in Tamil Nadu's Vellore Lok Sabha constituency were cancelled after huge cash was recovered from a warehouse belonging to a DMK candidate.

వేలూరు లోక్‌సభ నియోజకవర్గ ఎన్నిక నిలిపివేత

Posted: 04/16/2019 09:57 PM IST
Ec cancels polls for vellore parliamentary constituency citing reports of cash seizure

తమిళనాడులోని వేలూరు లోక్‌సభ నియోజకవర్గానికి గురువారం జరగాల్సిన ఎన్నికను నిలిపేస్తూ కేంద్ర ఎన్నికల సంఘం సంచలన నిర్ణయం తీసుకుంది. ఆ మేరకు కేంద్ర ఎన్నికల సంఘం చేసిన సిఫార్సుకు రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ మంగళవారం సాయంత్రం ఆమోదం తెలిపారు. వేలూరు నియోజకవర్గంలో ధన ప్రవాహాన్ని దృష్టిలో ఉంచుకుని అక్కడ ఎన్నికను నిలిపివేస్తూ వేస్తూ నిర్ణయం తీసుకున్నారు.

ఇటీవల అక్కడ డీఎంకే నేతకు చెందిన సిమెంట్ గేడౌన్‌లో దాదాపు రూ.10 కోట్ల నగదును ఎన్నికల సంఘం అధికారులు సీజ్ చేశారు. నియోజకవర్గంలో ధన ప్రవాహం ఎక్కువగా ఉండడంతో అక్కడ పారదర్శకంగా ఎన్నికలు నిర్వహించలేని పరిస్థితి నెలకొంది. దీంతో ఆ నియోజకవర్గ ఎన్నికను నిలుపుదల చేయాలని ఈ నెల 14న రాష్ట్రపతి కోవింద్‌కు ఎన్నికల సంఘం సిఫార్సు చేసింది.

నియోజకవర్గంలో ఎన్నికలు పారదర్శకంగా జరిగే అవకాశం లేకపోవడంతో గురువారం అక్కడ జరగాల్సిన ఎన్నికను నిలిపివేత చేస్తూ రాష్ట్రపతి నిర్ణయం తీసుకున్నారు.  మరో విడతలో ఈ నియోజకవర్గానికి ఎన్నికలు నిర్వహించనున్నారు. తమిళనాడులోని 39 లోక్‌సభ నియోజకవర్గాలకు ఈ నెల 18న ఒకే విడతలో ఎన్నికలు జరగాల్సి ఉంది. ఈసీ తాజా నిర్ణయంతో వేలూరు మినహా మిగిలిన 38 నియోజకవర్గాల్లో మాత్రమే ఎన్నికలు నిర్వహించనున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles