Case registered against Kodela బూత్ క్యాప్చరింగ్: కొడెల సహా 22 మందిపై కేసు

Ysrcp leaders files case against speaker kodela

YSRCP, Kodela Siva Prasada Rao, TDP, Inimetla village, booth capturing, Rajupalem police station, AP Elections 2019, Andhra Pradesh Assembly Elections 2019, Andhra Pradesh, politics

To the incident that happened at Inimetla village, a case has been filed against TDP leader and Speaker Kodela Siva Prasada Rao. The case has been filed at Rajupalem police station in Guntur district.

ITEMVIDEOS: బూత్ క్యాప్చరింగ్: కొడెల సహా 22 మందిపై కేసు

Posted: 04/16/2019 06:39 PM IST
Ysrcp leaders files case against speaker kodela

బూత్ క్యాప్చరింగ్ చేశారన్న అభియోగాల నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్, సత్తెనపల్లి టీడీపీ అభ్యర్థి కోడెల శివప్రసాద్‌పై కేసు నమోదైంది. రాజుపాలెం పోలీసు స్టేషన్ లో ఆయనకు వ్యతిరేకంగా వైసీపీ శ్రేణులు పిర్యాదు చేయడంతో కొడెల సహా 22 మంది అనుచరగణంపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఏప్రిల్ 11న పోలింగ్ రోజున కోడెల.. పోలింగ్ బూత్ ఆక్రమణకు పాల్పడ్డారని ఆయనతో పాటు 22 మందిపై  ఐపీసీ సెక్షన్‌ 131, 132, 188, 143, 341, 448, 506, ఆర్‌/డబ్ల్యూ 149 తదితర ఎనిమిది సెక్షన్ల కింద కేసు నమోదయ్యాయి.

బూత్ క్యాప్చరింగ్ కేసులో కోడెలను 7వ నిందితునిగా చేర్చారు. సత్తెనపల్లి నియోజకవర్గంలోని ఇనిమెట్లలో పోలింగ్‌ బూత్‌ ఆక్రమణకు పాల్పడిన కోడెల శివప్రసాదరావు, అతని అనుచరులపై తక్షణమే కేసు నమోదు చేయాలని వైసీపీ నేతలు డిమాండ్ చేశారు. ఇనిమెట్లలో కోడెలపై దాడి అంటూ టీడీపీ నాయకులు తప్పుడు ఫిర్యాదు చేశారని వారు మండిపడ్డారు. ఏప్రిల్ 11న పోలింగ్ సందర్భంగా సత్తెనపల్లి నియోజకవర్గంలోని ఇనిమెట్లలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. తనపై వైసీపీ నేతలు దాడి చేశారని కోడెల ఆరోపించారు.

కోడెల బట్టలు చిరిగేలా వైసీపీ వాళ్లు దాడి చేశారని టీడీపీ నాయకులు మండిపడ్డారు. వైసీపీ వాదన మరోలా ఉంది. కోడెల పోలింగ్ బూత్ ను ఆక్రమించారని, పోలింగ్ బూత్ లోకి వెళ్లి చాలాసేపు తలుపులు మూసుకున్నారని, దీంతో ఆగ్రహం చెందిన స్థానికులు కోడెలపై తిరగబడ్డారని చెబుతున్నారు. కోడెలపై దాడి కేసులో వైసీపీ అభ్యర్థి అంబటి రాంబాబు సహా పలువురు నేతలపై పోలీసులు ఇప్పటికే కేసు నమోదు చేశారు. పలువురు అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : YSRCP  Kodela Siva Prasada Rao  TDP  AP Assembly Elections 2019  Andhra Pradesh  politics  

Other Articles