IT raids at premises of 2 Karnataka CM aides ఎన్నికల వేళ.. కర్ణాటకలో ఐటీ దాడుల కలకలం..

I t raids on close aides of 3 ministers in mandya hassan underway

kannada actor darshan, darshan farm house, I-T raids, Karnataka ministers, Hassan, mandya, money laundering case, CS Puttaraju, Revanna, karnataka politics

The Income Tax department conducted raids on close aides of three Karnataka ministers, including CS Puttaraju and Revanna, in connection with money laundering case.

ఎన్నికల వేళ.. కర్ణాటకలో ఐటీ దాడుల కలకలం..

Posted: 04/16/2019 04:56 PM IST
I t raids on close aides of 3 ministers in mandya hassan underway

కర్ణాటకలో సార్వత్రిక ఎన్నికలలో ప్రచారపర్వం ఇవాళ సాయంత్రానికి ముగియనున్న నేపథ్యంలో ఎన్నికల సంఘం పొలింగ్ కు అన్ని ఏర్పాటు చేస్తున్న క్రమంలో.. మరోవైపు ఐటీ దాడులు కలకలం రేపుతున్నాయి. ఈ నెల 18న కర్ణాటకలో సార్వత్రిక ఎన్నికలు జరగనున్న క్రమంలో సరిగ్గా సమయం చూసుకుని, అదాయపన్ను శాఖ అధికారులు దాడులు నిర్వహించారు. సీఎం కుమారస్వామితో పాటు ఆయన సోదరులు మంత్రులు రేవణ్ణ, పుట్టరాజు సహా వారి అనుంగు అనుచరుల ఇళ్లపై కూడా ఏకకాలంలో దాడులు నిర్వహించారు.

మాండ్య, హాసన్ నియోజకవర్గాల్లో అదాయపన్నుశాఖ అధికారులు సోదాలు నిర్వహించారు. జేడీఎస్, కాంగ్రెస్ అభ్యర్థుల ఇళ్లలో తనిఖీలు చేపట్టారు. మందిర్, మదిర్ ప్రాంతాల్లోని నేతల ఇళ్లలో ఐటీ అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఓటర్లకు పంచడానికి పెద్ద ఎత్తున డబ్బు సిద్ధం చేశారన్న సమాచారం రావడంతో దాడులు చేపట్టారు. గతంలోనే ఓ పర్యాయం మంత్రి రేవణ్ణ పుట్టణ్ణ ఇంట్లో సోదాలు నిర్వహించారు. ప్రస్తుతం రేవణ్ణ పుట్టణ్ణతోపాటు ఆయన అనుచరులు, బంధువుల ఇళ్లలో అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు.

ఓటర్లకు అధికంగా డబ్బులు పంచుతున్నారన్న సమాచారంతో ఐటీ అధికారులు తనిఖీలు చేపట్టారు. ఉదయం 6 గంటల నుంచి దాడులు నిర్వహిస్తున్నారు. దేవేగౌడ మనువడు వంద కోట్ల రూపాయలను తన అనుచరుల ఇళ్లలో దాచి పెట్టాడని...అలాగే సుమలత రూ. 50 కోట్లు పంచేందుకు అక్కడున్నట్లు ఉదయం సమాచారం అందడంతో అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. హాసన్ లో మూడు చోట్ల ఐటీ సోదాలు నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది.

అయితే ఐటీ దాడులు కక్ష్యపూరితంగా జరుగుతున్నాయని జేడీఎస్, కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు. దేవేగౌడ మనుమళ్లు నిఖిల్ గౌడ, ప్రజ్వల్.. మాండ్య, హాసన్ నియోజకవర్గాల నుంచి బరిలో నిలిచారు. అయితే వీరి గెలుపును ప్రతిష్టాత్మకంగా తీసుకున్న అధికార పార్టీ వారిని గెలిపించుకునేందుకు సర్వశక్తులను ఓడ్డుతోంది. మరోవైపు మాండ్య నుంచి కాంగ్రెస్ నుంచి టికెట్ ఆశించి భంగపడ్డ మాజీ మంత్రి, కాంగ్రెస్ నేత అంబరీష్ సతీమణి సుమలత స్వతంత్ర అభ్యర్థిగా బరిలో నిలిచారు. మాండ్య, హాసన్ నియోజకవర్గాల్లో నేటితో ప్రచారం ముగియనుంది.

ఇదిలావుండగా నిన్న కూడా ఐటీ అధికారులు దాడులు కొనసాగాయి. కన్నడ స్టార్ హీరో దర్శన్ కు చెందిన మైసూరు జిల్లా టి.నరసీపురలో ఉన్న దర్శన్ ఫాంహౌస్ పై నిన్న ఐటీ అధికారులు దాడులు నిర్వహించారు. ఫాంహౌస్ లో ఉన్న అన్ని ప్రాంతాల్లో సోదాలు చేశారు. అయన మాండ్యా ఎన్నికల బరిలో నిలచిన నటి సుమలత తరపున ప్రచారం నిర్వహిస్తున్నారు. మరోవైపు కాంగ్రెస్ సీనియర్ నేత జీఏ బావా నివాసంపై కూడా నిన్న రాత్రి ఐటీ అధికారులు మెరుపు దాడులు నిర్వహించారు. ఎన్నికల వేళ జరుగుతున్న ఐటీ దాడులు కర్ణాటకలో కలకలం రేపుతున్నాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : I-T raids  Karnataka ministers  Hassan  mandya  money laundering case  karnataka  politics  

Other Articles