kukatpally court sentenced 2 day jail for 59 members డ్రైవింగ్ లెస్సెన్సు లేకుండా వాహనం నడిపితే జైలుకే.!

Kukatpally court sentenced 2 day jail for 59 members

15 days jail term for drunk and drive cases, 2 day jail term for no driving licence, kukatpally court, driving licence, drunk and drive, jail term, traffic violations, cyberabad police, crime

kukatpally court sentenced two day jail for 59 members who are driving vehicles without driving licence, and nearly 15 day jail term to 78 members who are caught in drunk and drive case.

డ్రైవింగ్ లెస్సెన్సు లేకుండా వాహనం నడిపితే జైలుకే.!

Posted: 04/16/2019 12:47 PM IST
Kukatpally court sentenced 2 day jail for 59 members

జాతీయ రవాణా తీసుకువచ్చిన అనేక చట్ట సవరణలు దేశంలో మరీ ముఖ్యంగా రవాణా రంగంలో చాలా మార్పలను తీసుకువస్తున్నాయి. కేవలం మధ్యం సేవించి వాహనం నడిపితే మాత్రమే చర్యలు తీసుకుంటారని బావిస్తే.. ఇక కటకటాలు లెక్కించాల్సిందే. ఔనండీ.. ఇప్పటి వరకు అపరాధ రుసుమును మాత్రమే వసూలు చేసే పోలీసులు ఇప్పుడు ఏకంగా వారిని అదుపులోకి తీసుకుని న్యాయస్థానంలో నిలబెడుతున్నారు. దీంతో న్యాయమూర్తి వారు చేసిన నేరాలు.. (ట్రాఫిక్ రూల్స్ ఉల్లంఘనలను) పరిగణలోకి తీసుకుని ఆ మేర వారికి శిక్ష విధిస్తున్నారు.

మైనారిటీ తీరని బాలబాలికలు వాహనాలను నడిపినా మైనర్లతో పాటు వారి తల్లిదండ్రులకు కూడా జైలు శిక్ష మరియు అపరాధ రుసుము కట్టాల్సి వస్తుంది. ఇక మేజర్లయిన వారు డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా వాహనాలు నడిపిన తరుణంలో ట్రాఫిక్ పోలీసులకు పట్టుబడితే.. వారు కూడా ఊచలు లెక్కబెట్టాల్సిందే. ఎందుకంటే డ్రైవింగ్ లైస్సెన్సు లేకుండా వాహనాలను నడపడం కూడా నేరమే. ఈ తరహలోనే డ్రైవింగ్ లైసెన్సు లేకుండా వాహనాలను నడుపుతూ పట్టుబడిన 59 మందికి కూకట్ పల్లి 9వ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కోర్టు 2 రోజుల జైలుశిక్ష విధించింది.

ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన మొత్తం 137 మందిని పోలీసులు కోర్టు ముందు ప్రవేశపెట్టగా, న్యాయమూర్తి శ్రీదేవి విచారించి శిక్షలు ఖరారు చేశారు. మద్యం తాగి వాహనాలు నడుపుతూ పట్టుబడిన 78 మందికి 3 నుంచి 15 రోజుల శిక్ష విధించారు. సెల్‌ ఫోన్‌ మాట్లాడుతూ పట్టుబడ్డ ముగ్గురికి వెయ్యి రూపాయల చొప్పున జరిమానా విధించారు. వీరు మరోసారి ఇలాగే పట్టుబడితే, జైలుశిక్ష తప్పదని హెచ్చరించారు. కూకట్‌ పల్లి, గచ్చిబౌలి, మాదాపూర్‌, మియాపూర్‌, బాలానగర్‌ పోలీసు స్టేషన్ల పరిధిలో జరిపిన తనిఖీల్లో వీరు పట్టుబడ్డారని పోలీసులు తెలిపారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles